Yuvan Shankar
-
ఇళయరాజా రాసిన పాటకు కొడుకు యువన్ శంకర్ గానం
చెన్నై సినిమా: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా రాసి బాణీలు కట్టిన పాటను ఆయన తనయుడు, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఆలపించడం విశేషం. ఇళయరాజా సంగీతమందిస్తున్న 1, 417వ చిత్రం 'నినైవెల్లా నీయడా'. ఆదిరాజన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రంలో ప్రాజన్, మనీషా యాదవ్ జంటగా నటిస్తున్నారు. లేఖా థియేటర్స్ పతాకంపై రాయల్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఇళయరాజా పాట రాయడం, దానికి ఆయన కుమారుడు, సంగీత దర్శకుడు అయిన యువన్ శంకర్ రాజా పాడటం ప్రత్యేక ఆకర్షణ అని డైరెక్టర్ ఆదిరాజన్ తెలిపారు. తన సినిమాకు ఇళయరాజా సంగీతమందిచాలన్నది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. అది ఈ సినిమాతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. -
తమన్ ఔట్! యువన్ ఇన్!!
టాలీవుడ్ బిజీ సంగీత దర్శకుల్లో తమన్ ఒకరు. ఇప్పటికే ఆయన ఖాతాలో పలు మ్యూజికల్ హిట్లున్నాయి. ప్రస్తుతం మహేశ్ ‘ఆగడు’, ఎన్టీఆర్ ‘రభస’ చిత్రాలతో బిజీగా ఉన్నారు తమన్. కృష్ణవంశీ-రామ్‌చరణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రానికి కూడా తమన్ సంగీత దర్శకుడని గతంలో వార్తలొచ్చాయి. సంగీతాభిరుచి కలిగిన కృష్ణవంశీతో తమన్ చేసే ఈ చిత్రం కచ్చితంగా సంగీత సంచలనం అవుతుందని అందరూ భావించారు. అయితే... ఆ సినిమాకు ఇప్పుడు యువన్‌శంకర్‌రాజా సంగీత దర్శకునిగా తీసుకున్నట్లు తెలిసింది. యువన్ తెలుగులో ‘ఆడవారి మాటలకు అర్థాలు వేరులే’, ‘దూసుకెళ్తా’ తదితర చిత్రాలకు సంగీతం అందించారు. కృష్ణవంశీ, యువన్, చరణ్... ఈ నవ్యమైన కలయిక మెగా అభిమానులకు ఓ కొత్త అనుభూతినివ్వడం ఖాయం.