ఇళయరాజా రాసిన పాటకు కొడుకు యువన్ శంకర్​​ గానం | Yuvan Shankar Sings A Song Written By His Father Ilaiyaraaja | Sakshi
Sakshi News home page

Ilaiyaraaja Yuvan Shankar: ఇళయరాజా రాసిన పాటకు కొడుకు యువన్ శంకర్​​ గానం

Published Mon, Feb 21 2022 3:26 PM | Last Updated on Mon, Feb 21 2022 3:31 PM

Yuvan Shankar Sings A Song Written By His Father Ilaiyaraaja - Sakshi

చెన్నై సినిమా: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా రాసి బాణీలు కట్టిన పాటను ఆయన తనయుడు, మ్యూజిక్​ డైరెక్టర్​ యువన్​ శంకర్​ రాజా ఆలపించడం విశేషం. ఇళయరాజా సంగీతమందిస్తున్న 1, 417వ చిత్రం 'నినైవెల్లా నీయడా'. ఆదిరాజన్​ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రంలో ప్రాజన్​, మనీషా యాదవ్ జంటగా నటిస్తున్నారు. 

లేఖా థియేటర్స్​ పతాకంపై రాయల్​ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఇళయరాజా పాట రాయడం, దానికి ఆయన కుమారుడు, సంగీత దర్శకుడు అయిన యువన్​ శంకర్​ రాజా పాడటం ప్రత్యేక ఆకర్షణ అని డైరెక్టర్​ ఆదిరాజన్​ తెలిపారు. తన సినిమాకు ఇళయరాజా సంగీతమందిచాలన్నది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. అది ఈ సినిమాతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement