Ilaiyaraja son
-
ఇళయరాజా రాసిన పాటకు కొడుకు యువన్ శంకర్ గానం
చెన్నై సినిమా: ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా రాసి బాణీలు కట్టిన పాటను ఆయన తనయుడు, మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా ఆలపించడం విశేషం. ఇళయరాజా సంగీతమందిస్తున్న 1, 417వ చిత్రం 'నినైవెల్లా నీయడా'. ఆదిరాజన్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈ చిత్రంలో ప్రాజన్, మనీషా యాదవ్ జంటగా నటిస్తున్నారు. లేఖా థియేటర్స్ పతాకంపై రాయల్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ఇళయరాజా పాట రాయడం, దానికి ఆయన కుమారుడు, సంగీత దర్శకుడు అయిన యువన్ శంకర్ రాజా పాడటం ప్రత్యేక ఆకర్షణ అని డైరెక్టర్ ఆదిరాజన్ తెలిపారు. తన సినిమాకు ఇళయరాజా సంగీతమందిచాలన్నది తన చిరకాల కోరిక అని వెల్లడించారు. అది ఈ సినిమాతో నెరవేరడం సంతోషంగా ఉందన్నారు. -
న్యూయార్క్ టైమ్ స్క్వేర్ బిల్‌బోర్డుపై ఇళయరాజా..
Ilaiyaraaja Displayed On New York Tmies Square Billboard: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా పరిచయం అవసరంలేని పేరు. ఆయన సంగీతం గురించి అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు తెలిసిందే. ఇటీవల న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డుపై ఆయన ముఖ చిత్రంతో ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. స్వరకర్త ఇళయరాజా అధికారిక ఫేస్బుక్ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మ్యూజికల్ స్ట్రీమింగ్ సర్వీస్ అయిన స్పూటిఫై ప్రచారంలో భాగంగా ఇలా ప్రదర్శించారు. న్యూయార్క్‌లో ఇసైజ్ఞాని (మ్యూజికల్ జీనియస్) ఇళయరాజా పోస్టర్‌ను చూసి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకరు. ఇటీవల స్పూటీఫైతో ఆయన జతకట్టి, ప్రచారం నిర్వహిస్తున్నారు. స్పూటీఫైలో ఆయన ప్లేలిస్ట్‌లను ప్రమోట్ చేయడానికి 3 నిమిషాల నిడివి గల యాడ్ ఫిల్మ్‌లో కనిపించారు ఇళయరాజా. నవంబర్ 19న టైమ్స్ స్క్వేర్ బిల్‌బోర్డుపై ఇళయరాజా బ్యానర్ ప్రదర్శించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఫేస్బుక్లో ప్రకటిస్తూ 'ఈ చాలా పవిత్రమైన రోజున న్యూయార్క్‌లోని బిల్‌బోర్డ్స్ ఆఫ్ టైమ్స్ స్క్వేర్‌లో 'రాజా ఆఫ్ మ్యూజిక్', 'రాజా రూల్స్'' అని రాసుకొచ్చారు. ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, ఈ విజయం ఆయన కెరీర్లో ఒక మెట్టుగా అభివర్ణించారు. Our own #Isaignani at #timesquare proud us🙏🏽👍🏽 pic.twitter.com/SEd60IJEFP — venkat prabhu (@vp_offl) November 19, 2021 'ఆయన మనందరి కంటే ముందుంటారు. కుటుంబంతో కలిసి ఉండండి. ఎప్పుడు పెద్దవారు, మొదటివారు' అని కాస్ట్యూమ్ డిజైనర్ వాసుకి భాస్కర్ పేర్కొన్నారు. ప్రస్తుతం విదుతాలయి, మాయన్, తుప్పరివాళన్, తమిళరసన్ చిత్రాల్లో సంగీత దర్శకుడిగా చేస్తున్నారు ఇళయరాజా. He is always way ahead from all of us...Put together in the family. Always the first and biggest.Dellighted to see #RAJAAPPA. @ilaiyaraajaoffl at the Times Square billboard. New York city. USA. @Spotify @SpotifyUSA ❤️ pic.twitter.com/gRmrfLOQdB — vasuki bhaskar (@vasukibhaskar) November 19, 2021 -
యువన్‌కి మూడో పెళ్లి!
మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజాకు ముగ్గురు పిల్లలు. పెద్ద వాడు కార్తీక్ రాజా, చిన్నవాడు యువన్, అమ్మాయి భవతారిణి-ముగ్గురూ సంగీత దర్శకులే. అయితే, ఇళయరాజా కుమారుడు అనే ఇమేజ్ నుంచి సులువుగానే బయటపడగలిగారు యువన్. దాదాపు 20 ఏళ్ల కెరీర్లో వంద చిత్రాలకు సంగీత దర్శకునిగా వ్యవహరించిన ఘనత యువన్ది. ప్రస్తుతం తమిళం, తెలుగుతో కలిపి చేతిలో అరడజను చిత్రాలున్నాయి. అయితే, యువన్ చేస్తున్న చిత్రాలకన్నా ఆయన వ్యక్తిగత జీవితం గురించే ఇప్పుడు వాడి వేడి చర్చలు జరుగుతున్నాయి. చెన్నై వర్గాల సమాచారం ప్రకారం ముస్లిమ్ యువతి జఫరున్నీసాను యువన్ పెళ్లి చేసుకోనున్నారు. రెండు రోజుల క్రితం నిశ్చితార్థం జరిగిందట. దుబాయ్‌లో పెళ్లి జరగనుందని తెలిసింది. ఇది ప్రేమ వివాహమట. యువన్‌కి ఇది మూడో పెళ్లి. 2005లో సుజయ చంద్రన్‌తో యువన్ వివాహం జరిగింది. అది లవ్ మ్యారేజే. మూడేళ్ల తర్వాత ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అనంతరం 2011లో శిల్పా మోహన్ని యువన్ పెళ్లి చేసుకోవడం, ఆమెనుంచి కూడా విడిపోవడం జరిగింది. ఇప్పుడు జఫరున్నీసాతో యువన్‌కి జరగనున్నది మూడో వివాహం. కాగా, ఆయన తన పేరుని కూడా అబ్దుల్ హలీక్ అని మార్చుకున్నారట. తల్లి చనిపోయిన తర్వాత జరిగిన పరిణామాలకు ఇస్లామ్ మతం మీద యువన్‌కి విశ్వాసం కలిగింది. ఆ విషయాన్ని ఆయన బహిరంగంగానే ప్రకటించారు.