న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ బిల్‌బోర్డుపై ఇళయరాజా.. | Ilaiyaraaja Displayed On New York Tmies Square Billboard | Sakshi
Sakshi News home page

Ilaiyaraaja: న్యూయార్క్‌ టైమ్‌ స్క్వేర్‌ బిల్‌బోర్డుపై ఇళయరాజా..

Published Sat, Nov 20 2021 12:11 PM | Last Updated on Sat, Nov 20 2021 12:12 PM

Ilaiyaraaja Displayed On New York Tmies Square Billboard - Sakshi

Ilaiyaraaja Displayed On New York Tmies Square Billboard: మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా పరిచయం అవసరంలేని పేరు. ఆయన సంగీతం  గురించి అభిమానులకు, సినిమా ప్రేక్షకులకు తెలిసిందే. ఇటీవల న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌ బిల్‌బోర్డుపై ఆయన ముఖ చిత్రంతో ఉన్న బ్యానర్‌ను  ప్రదర్శించారు. స్వరకర్త ఇళయరాజా అధికారిక ఫేస్‌బుక్‌ పేజీలో ఈ విషయాన్ని ప్రకటించారు. మ్యూజికల్‌ స్ట‍్రీమింగ్ సర్వీస్‌ అయిన స్పూటిఫై ప్రచారంలో భాగంగా ఇలా ప్రదర్శించారు. న్యూయార్క్‌లో ఇసైజ్ఞాని (మ్యూజికల్‌ జీనియస్‌) ఇళయరాజా పోస్టర్‌ను చూసి ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేశారు. 

అత్యంత ప్రసిద్ధి చెందిన సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకరు. ఇటీవల స్పూటీఫైతో ఆయన జతకట్టి, ప‍్రచారం నిర్వహిస్తున‍్నారు. స్పూటీఫైలో ఆయన ప్లేలిస్ట్‌లను ప్రమోట్‌ చేయడానికి 3 నిమిషాల నిడివి గల యాడ్‌ ఫిల్మ్‌లో కనిపించారు ఇళయరాజా. నవంబర్‌ 19న టైమ్స్‌ స్క‍్వేర్‌ బిల్‌బోర్డుపై ఇళయరాజా బ్యానర్‌ ప్రదర్శించారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ఫేస్‌బుక్‌లో ప్రకటిస్తూ 'ఈ చాలా పవిత్రమైన రోజున  న్యూయార్క్‌లోని బిల్‌బోర్డ్స్‌ ఆఫ్‌ టైమ్స్‌ స్క్వేర్‌లో 'రాజా ఆఫ్‌ మ్యూజిక్‌', 'రాజా రూల్స్‌'' అని రాసుకొచ్చారు. ఇళయరాజా తనయుడు, సంగీత దర్శకుడు కార్తీక్‌ రాజా, ఈ విజయం ఆయన కెరీర్‌లో ఒక మెట్టుగా అభివర్ణించారు.

'ఆయన మనందరి కంటే ముందుంటారు. కుటుంబంతో కలిసి ఉండండి. ఎప్పుడు పెద్దవారు, మొదటివారు' అని కాస్ట్యూమ్‌ డిజైనర్‌ వాసుకి భాస్కర్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం విదుతాలయి, మాయన్‌, తుప్పరివాళన్‌, తమిళరసన్‌ చిత్రాల్లో సంగీత దర్శకుడిగా చేస్తున్నారు ఇళయరాజా. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement