సైరా మోషన్ పోస్టర్ దృశ్యం
సాక్షి, సినిమా : మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు సైరా నరసింహారెడ్డి గురించి ఇప్పుడు మరో వార్త హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్‌కు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్‌ను ఎంపిక చేశారనేది దాని సారాంశం.
ముందుగా ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తాడని అధికారికంగా ప్రకటించారు. కానీ, డేట్లు సర్దుబాటు కాకపోవటంతో రెహమాన్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. ఇక తర్వాత థమన్ పేరు తెరపైకి వచ్చింది. అటుపై కీరవాణి పేరు వినిపించింది. ఇక ఇప్పుడు క్లాసిక్ మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయారాజా పేరు చక్కర్లు కొడుతోంది. అందుకు కారణం చిరు ఇళయరాజాను కలిశాడన్న ఓ వార్తే.
అయితే సైరా చరిత్రకు సంబంధించిన కథ కావటంతో పాటల కన్నా ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌పైనే ప్రేక్షకులు ఎక్కువ కనెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చిరు భావిస్తున్నాడంట. ఈ నేపథ్యంలో కీరవాణి వైపే ఎక్కువ మొగ్గు చూపే అవకాశం ఉండొచ్చని టాక్. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సైరా.. రెండో షెడ్యూల్‌కు రెడీ అయిపోయింది. అయినప్పటికీ ఇప్పటిదాకా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో స్పష్టత లేకపోవటం విశేషం. ఏది ఏమైనా ఈ ఊహాగానాలకు త్వరలో నిర్మాత రామ్ చరణ్ పుల్ స్టాప్ పెట్టాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment