జెంటిల్‌మెన్‌-2 చిత్రానికి సంగీత దర్శకుడు ఖరారు | MM Keeravani To Compose Music For Gentleman-2 | Sakshi
Sakshi News home page

MM Keeravani: జెంటిల్‌మెన్‌-2 చిత్రానికి కీరవాణి సంగీతం

Published Mon, Jan 24 2022 7:55 AM | Last Updated on Mon, Jan 24 2022 8:08 AM

MM Keeravani To Compose Music For Gentleman-2 - Sakshi

MM Keeravani To Compose Music For Gentleman-2: గతంలో జెంటిల్‌మెన్‌ చిత్రం ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. కె.టి.కుంజుమోన్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా శంకర్‌ దర్శకుడిగా పరిచయం కావడం గమనార్హం. ఆ తరువాత పలు భారీ చిత్రాలను నిర్మించిన కె.టి.కుంజుమోన్‌ కొంత గ్యాప్‌ తరువాత తాజాగా జెంటిల్‌మెన్‌ –2 చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరన్నది గెస్‌ చేసిన వారికి బంగారు నాణేన్ని బహుమతిగా అందించనున్నట్లు  నిర్మాత ప్రకటించారు. దీంతో పలువురు తమకు తోచిన సంగీత దర్శకుల పేర్లను తెలియచేశారు. వారిలో జెంటిల్‌ మెన్‌ –2కు సంగీత దర్శకుడు ఎవరన్నది కరెక్టుగా తెలిపిన మొదటి ముగ్గురికి బంగారు నాణేలను బహుమతిగా త్వరలో అందించనున్నట్లు నిర్మాత చెప్పారు.

కాగా ఆదివారం ఆయన ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించనున్నట్లు మీడియా ద్వారా వెల్లడించారు. ఈయన బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ వంటి భారీ చిత్రాలకు సంగీతాన్ని అందించారన్నది గమనార్హం. ఇకపోతే ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది త్వరలో వెల్లడిస్తానని కుంజుమోన్‌   వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement