Priya Lal: Mega Producer KT Kunjumon Announce Second Heroine Of Gentleman 2 Movie - Sakshi
Sakshi News home page

Gentleman 2 Movie: 'జెంటిల్‌ మేన్‌ 2'కి మరో హీరోయిన్‌.. నిర్మాత ప్రకటన

Published Wed, Apr 13 2022 4:15 PM | Last Updated on Wed, Apr 13 2022 5:30 PM

Priya Lal Comes On Board In Gentleman 2 Movie - Sakshi

Gentleman 2 Movie Producer Kunjumon Announces Second Heroine: 1993లో విడుదలై సంచలన విజయం సాధించిన యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ చిత్రం 'జెంటిల్‌ మేన్'. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జెంటిల్‌ మేన్‌ 2' రానుంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రొడ్యూసర్‌ కె.టి. కుంజుమోన్‌ 2020లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇటీవల మాలీవుడ్‌ బ్యూటీ నయనతార చక్రవర్తిని ఎంపిక చేశారు. తాజాగా ఈ చిత్రం కోసం మరో హీరోయిన్‌ను సెలెక్ట్‌ చేసినట్లు ప్రొడ్యూసర్‌ కె.టి. కుంజుమోన్‌ సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. 'జెంటిల్‌ మేన్‌ 2' మూవీలో మరో హీరోయిన్‌గా ప్రియాలాల్‌ నటించనుందని అధికారికంగా తెలిపారు. 

'జెంటిల్‌ మేన్‌ 2' మూవీలో ఇంకా హీరో ఎవరనేది వెల్లడికాలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిచనున్నారు. ఈ సినిమా పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోంది. కాగా ఇదివరకు వచ్చిన 'జెంటిల్‌ మేన్‌' చిత్రానికి డైరెక్టర్‌ శంకర్ దర్శకత్వం వహించారు. మరీ ఈ సీక్వెల్‌ మూవీకి దర్శకత్వ బాధ్యతలు ఎవరికీ అప్పగిస్తారనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు సమాచారం.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement