priyalal
-
'జెంటిల్ మేన్ 2'కి మరో హీరోయిన్.. నిర్మాత ప్రకటన
Gentleman 2 Movie Producer Kunjumon Announces Second Heroine: 1993లో విడుదలై సంచలన విజయం సాధించిన యాక్షన్ కింగ్ అర్జున్ చిత్రం 'జెంటిల్ మేన్'. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా 'జెంటిల్ మేన్ 2' రానుంది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ప్రొడ్యూసర్ కె.టి. కుంజుమోన్ 2020లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా ఇటీవల మాలీవుడ్ బ్యూటీ నయనతార చక్రవర్తిని ఎంపిక చేశారు. తాజాగా ఈ చిత్రం కోసం మరో హీరోయిన్ను సెలెక్ట్ చేసినట్లు ప్రొడ్యూసర్ కె.టి. కుంజుమోన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. 'జెంటిల్ మేన్ 2' మూవీలో మరో హీరోయిన్గా ప్రియాలాల్ నటించనుందని అధికారికంగా తెలిపారు. 'జెంటిల్ మేన్ 2' మూవీలో ఇంకా హీరో ఎవరనేది వెల్లడికాలేదు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిచనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కబోతోంది. కాగా ఇదివరకు వచ్చిన 'జెంటిల్ మేన్' చిత్రానికి డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించారు. మరీ ఈ సీక్వెల్ మూవీకి దర్శకత్వ బాధ్యతలు ఎవరికీ అప్పగిస్తారనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నట్లు సమాచారం. The enthusiastic @PriyaaLal will be the another lead actress in our Mega movie #Gentleman2#ஜென்டில்மேன்2 #जेंटलमेन2 #ജെന്റിൽമാൻ2 #ಜಂಟಲ್ಮನ್2 #జెంటిల్మాన్2@mmkeeravaani #GentlemanFilmInternational@ajay_64403 @johnsoncinepro @UrsVamsiShekar @PRO_SVenkatesh @Fridaymedia2 pic.twitter.com/3mHPuvQ4jz — K.T.Kunjumon (@KT_Kunjumon) April 13, 2022 -
మానవ సంబంధాలతో...
సినిమా తర్వాత సినిమా చేస్తూ లాక్డౌన్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు సత్యదేవ్. లాక్ డౌన్ లో ’ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’ చిత్రంతో అలరించిన సత్యదేవ్ నటించిన మరో చిత్రం ’గువ్వా గోరింక’ విడుదలకు సిద్ధమైంది. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బమ్మిడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాలాల్ కథానాయిక. దాము రెడ్డి కొసనం, ‘దళం’ దర్శకుడు జీవన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న అమెజాన్ ప్రై మ్లో విడుదల కానుంది. దర్శకుడు మోహన్ మాట్లాడుతూ– ’’ఈ తరం యువతీ, యువకుల మధ్య పెనవేసుకున్న మానవ సంబంధాలే కథా వస్తువుగా ‘గువ్వాగోరింక’ చిత్రం రూపొందింది. లిమిటెడ్ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రాన్ని తీశాది. తక్కువ బడ్టెట్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయాలనేవాళ్లకు ఈ సినిమా ఓ గైడ్‌లా ఉంటుందని భావిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి. కెమెరా: మైలేశం రంగస్వామి. -
గువ్వా గోరింక వర్కింగ్ స్టిల్స్
-
గువ్వది ఓ దారి... గోరింకది మరో దారి
రెండు రెక్కలు కలిస్తేనే పక్షి గాల్లోకి ఎగురుతుంది. అలాగే, రెండు మనస్తత్వాలు కలిస్తేనే జంట ప్రయాణం బాగుంటుంది. అలాంటి జంటలను గువ్వా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారంటుంటారు. సత్యదేవ్, ప్రియాలాల్ జంట ‘గువ్వ గోరింక’ అనేలా ఉంటుంది. కానీ, మనస్తత్వాలే వేర్వేరు. ఇద్దరిదీ చెరో దారి. విభిన్న మనస్తత్వాలు గల ఈ జంట ప్రయాణం, ప్రేమకథతో రూపొందుతున్న సినిమా ‘గువ్వ గోరింక’. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకత్వంలో ఆకార్ మూవీస్ పతాకంపై దామురెడ్డి కొసనం, ‘దళం’ జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ‘‘చక్కని ప్రేమకథా చిత్రమిది. మానవ సంబంధాలు కనుమరుగవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగిన సంఘటనలకు దృశ్యరూపమే ఈ సినిమా’’ అన్నారు నిర్మాతలు. మధుమిత, ప్రియదర్శి, చైతన్య ప్రధాన తారలుగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బొలి. -
గువ్వా గోరింక... కొత్తగా
‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట...’ – చిరంజీవి సూపర్‌హిట్ సిన్మా ‘ఖైదీ నంబర్ 786’లో ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల నోట వినిపిస్తుంటుంది. ఇప్పుడీ పాట పల్లవిలోని తొలి రెండు పదాలతో ఓ చిత్రం వస్తోంది. ‘జ్యోతిలక్ష్మీ’ ఫేమ్ సత్యదేవ్, ప్రియాలాల్ జంటగా దాము కొసనం, ‘దళం’ చిత్రదర్శకుడు జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి ‘గువ్వ గోరింక’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం టీజర్‌ను ప్రేమికుల రోజు (ఈ నెల 14న) సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు ప్రేమికుల కథే ఈ ‘గువ్వ గోరింక’. కొత్త తరహా చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా వినూత్న అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. చైతన్య, మధుమిత, ‘పెళ్లిచూపులు’ ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: బజారా, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, కెమేరా: మైల్స్ రంగస్వామి, సంగీతం: సురేశ్ బొబ్బిలి.