గువ్వా గోరింక... కొత్తగా | 'Guvva Gorinka' First Looks released | Sakshi
Sakshi News home page

గువ్వా గోరింక... కొత్తగా

Published Sat, Feb 11 2017 11:48 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM

గువ్వా గోరింక... కొత్తగా

గువ్వా గోరింక... కొత్తగా

‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట...’ – చిరంజీవి సూపర్‌హిట్‌ సిన్మా ‘ఖైదీ నంబర్‌ 786’లో ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల నోట వినిపిస్తుంటుంది. ఇప్పుడీ పాట పల్లవిలోని తొలి రెండు పదాలతో ఓ చిత్రం వస్తోంది. ‘జ్యోతిలక్ష్మీ’ ఫేమ్‌ సత్యదేవ్, ప్రియాలాల్‌ జంటగా దాము కొసనం, ‘దళం’ చిత్రదర్శకుడు జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి ‘గువ్వ గోరింక’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఇటీవల ఫస్ట్‌ లుక్‌ విడుదల చేశారు.

రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు మోహన్‌ బొమ్మిడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం టీజర్‌ను ప్రేమికుల రోజు (ఈ నెల 14న) సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు ప్రేమికుల కథే ఈ ‘గువ్వ గోరింక’. కొత్త తరహా చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా వినూత్న అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. చైతన్య, మధుమిత, ‘పెళ్లిచూపులు’ ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: బజారా, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, కెమేరా: మైల్స్‌ రంగస్వామి, సంగీతం: సురేశ్‌ బొబ్బిలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement