guvva gorinka
-
మానవ సంబంధాలతో...
సినిమా తర్వాత సినిమా చేస్తూ లాక్డౌన్లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు సత్యదేవ్. లాక్ డౌన్ లో ’ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’ చిత్రంతో అలరించిన సత్యదేవ్ నటించిన మరో చిత్రం ’గువ్వా గోరింక’ విడుదలకు సిద్ధమైంది. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బమ్మిడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాలాల్ కథానాయిక. దాము రెడ్డి కొసనం, ‘దళం’ దర్శకుడు జీవన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న అమెజాన్ ప్రై మ్లో విడుదల కానుంది. దర్శకుడు మోహన్ మాట్లాడుతూ– ’’ఈ తరం యువతీ, యువకుల మధ్య పెనవేసుకున్న మానవ సంబంధాలే కథా వస్తువుగా ‘గువ్వాగోరింక’ చిత్రం రూపొందింది. లిమిటెడ్ బడ్జెట్ చిత్రంగా ఈ చిత్రాన్ని తీశాది. తక్కువ బడ్టెట్‌లో మంచి కంటెంట్ ఉన్న సినిమా తీయాలనేవాళ్లకు ఈ సినిమా ఓ గైడ్‌లా ఉంటుందని భావిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్ బొబ్బిలి. కెమెరా: మైలేశం రంగస్వామి. -
‘సోషల్ మీడియా దుమారమే’
జ్యోతిలక్ష్మి సినిమాలో హీరోగా నటించిన సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ‘గువ్వా గోరింక’ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సోషల్ మీడియాపై ఓ ఆసక్తికరమైన పాటను రూపొందించారు. ‘అరె దగ్గరి వాళ్లను దూరం చేసి ఆటాడిస్తది కాకా, ఇది ఆండ్రాయిడూ మజాకా. ఒడవని ముచ్చట రచ్చగ మార్చి పిచ్చెక్కిస్తది కాకా, నువు అందులోన దిగినాకా.. అంటూ సాగే ఈ పాటలో సోషల్ మీడియా ట్రెండ్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. ఈ సినిమాలో పెళ్లి చూపులు ఫేం ప్రియదర్శి, అర్జున్ రెడ్డి ఫేం రాహుల్ రామకృష్ణ, ప్రియాలాల్, మధుమిత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. -
‘సోషల్ మీడియ దుమారమే’
-
గువ్వా గోరింక వర్కింగ్ స్టిల్స్
-
గువ్వా గోరింక... కొత్తగా
‘గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట...’ – చిరంజీవి సూపర్‌హిట్ సిన్మా ‘ఖైదీ నంబర్ 786’లో ఈ పాట ఇప్పటికీ ప్రేక్షకుల నోట వినిపిస్తుంటుంది. ఇప్పుడీ పాట పల్లవిలోని తొలి రెండు పదాలతో ఓ చిత్రం వస్తోంది. ‘జ్యోతిలక్ష్మీ’ ఫేమ్ సత్యదేవ్, ప్రియాలాల్ జంటగా దాము కొసనం, ‘దళం’ చిత్రదర్శకుడు జీవన్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి ‘గువ్వ గోరింక’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఇటీవల ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రామ్‌గోపాల్ వర్మ శిష్యుడు మోహన్ బొమ్మిడి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రం టీజర్‌ను ప్రేమికుల రోజు (ఈ నెల 14న) సందర్భంగా విడుదల చేయాలనుకుంటున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు ప్రేమికుల కథే ఈ ‘గువ్వ గోరింక’. కొత్త తరహా చిత్రాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా వినూత్న అనుభూతిని పంచుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. చైతన్య, మధుమిత, ‘పెళ్లిచూపులు’ ప్రియదర్శి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: బజారా, పాటలు: కందికొండ, కృష్ణకాంత్, మిట్టపల్లి సురేందర్, కెమేరా: మైల్స్ రంగస్వామి, సంగీతం: సురేశ్ బొబ్బిలి.