మానవ సంబంధాలతో... | Guvva gorinka will be releasing on december 17th in amazon prime | Sakshi
Sakshi News home page

మానవ సంబంధాలతో...

Published Sat, Dec 12 2020 5:42 AM | Last Updated on Sat, Dec 12 2020 5:42 AM

Guvva gorinka will be releasing on december 17th in amazon prime - Sakshi

సినిమా తర్వాత సినిమా చేస్తూ లాక్‌డౌన్‌లో కూడా ఫుల్‌ బిజీగా ఉన్నారు సత్యదేవ్‌. లాక్‌ డౌన్‌ లో ’ఉమా మహేశ్వర ఉగ్రరూపశ్య’ చిత్రంతో అలరించిన సత్యదేవ్‌ నటించిన మరో చిత్రం ’గువ్వా గోరింక’ విడుదలకు సిద్ధమైంది. రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు మోహన్‌ బమ్మిడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రియాలాల్‌ కథానాయిక. దాము రెడ్డి కొసనం, ‘దళం’ దర్శకుడు జీవన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న అమెజాన్‌ ప్రై మ్‌లో విడుదల కానుంది. దర్శకుడు మోహన్‌ మాట్లాడుతూ– ’’ఈ తరం యువతీ, యువకుల మధ్య పెనవేసుకున్న మానవ సంబంధాలే కథా వస్తువుగా ‘గువ్వాగోరింక’ చిత్రం రూపొందింది. లిమిటెడ్‌ బడ్జెట్‌ చిత్రంగా ఈ చిత్రాన్ని తీశాది. తక్కువ బడ్టెట్‌లో మంచి కంటెంట్‌ ఉన్న సినిమా తీయాలనేవాళ్లకు ఈ సినిమా ఓ గైడ్‌లా ఉంటుందని భావిస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సురేశ్‌ బొబ్బిలి. కెమెరా: మైలేశం రంగస్వామి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement