అనుపమ్ ఖేర్
‘‘మా తరానికి చెందిన అద్భుతమైన సంగీతదర్శకుల్లో ఒకరైన కీరవాణితో సినిమా చేసే అవకాశం రావడం నాకు గర్వకారణం. నా కల నిజమైంది’’ అని బాలీవుడ్ ప్రముఖ నటుడు–దర్శకుడు అనుపమ్ ఖేర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరవై రెండేళ్ల తర్వాత ఆయన మళ్లీ మెగాఫోన్ పట్టారు. గతంలో ‘ఓం జై జగదీష్’ (2002) చిత్రానికి దర్శకత్వం వహించారు అనుపమ్ ఖేర్. తాజాగా ‘తన్వీ ది గ్రేట్’ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.
ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతదర్శకత్వం వహిస్తున్నట్లు ప్రకటించి, ఆయన ట్రాక్ కంపోజ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. ‘‘ఆస్కార్ అవార్డు, గోల్డెన్ గ్లోబ్ అవార్డు విజేత కీరవాణి మా సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం ఓ ఆశీర్వాదం. ఏడాదిగా ఈ సినిమాకి కలిసి పని చేస్తున్నాం. కీరవాణి స్వరపరచిన ‘తుమ్ మిలే దిల్ ఖిలే..’ (నాగార్జున, మనీషా కొయిరాలా, రమ్యకృష్ణ నటించిన ‘క్రిమినల్’ సినిమాలోని ΄ాట) విన్నప్పట్నుంచి ఆయనకు అభిమాని అయిపోయాను. ఇప్పుడు నా సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకు «థ్యాంక్స్’’ అని పేర్కొన్నారు అనుపమ్ ఖేర్.
Comments
Please login to add a commentAdd a comment