'జెంటిల్‌మెన్‌ 2' చిత్రానికి హీరోయిన్‌గా బేబీ నయనతార.. | Gentleman 2 Movie Heroine Is Nayanthara Chakravarthy | Sakshi
Sakshi News home page

Gentleman 2 Movie: 'జెంటిల్‌మెన్‌ 2' సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌..

Published Wed, Mar 23 2022 6:04 PM | Last Updated on Wed, Mar 23 2022 6:32 PM

Gentleman 2 Movie Heroine Is Nayanthara Chakravarthy - Sakshi

Gentleman 2 Movie Heroine Is Nayanthara Chakravarthy: అప్పట్లో యాక్షన్‌ కింగ్‌ అర్జున్‌ హీరోగా వచ్చిన 'జెంటిల్‌మెన్‌' సినిమా సంచలన విజయం సాధించింది. కె.టి. కుంజుమోన్‌ నిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంతోనే శంకర్‌ దర్శకుడిగా పరిచయమయ్యారు. అనంతరం డైరెక్టర్‌గా శంకర్‌ పేరు ఏ రేంజ్‌లో పాపులర్‌ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతేకాదు 'జెంటిల్‌మెన్‌' సినిమాతో అర్జున్‌కు కూడా మంచి పేరు వచ్చింది. 1993లో విడుదలైన ఈ సినిమాలో అర్జున్‌తోపాటు మధుభాల, శుభశ్రీ ప్రధాన పాత్రల్లో నటించి అలరించారు. ఇప్పటికీ ఈ మూవీ సినీ లవర్స్‌ మదిలో ఎవర్‌గ్రీన్‌ చిత్రం అని చెప్పవచ్చు. జెంటిల్‌మెన్‌ చిత్రం తర్వాత పలు భారీ చిత్రాలను నిర్మించిన నిర్మాత కె.టి. కుంజుమోన్‌ చాలా కాలం గ్యాప్‌ తర్వాత జెంటిల్‌మెన్‌ 2 సినిమా తీస్తున్నట్లు 2020లో ప్రకటించారు. 



అప్పటి నుంచి ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎం.ఎం. కీరవాణిని ప్రకటిస్తూ మీడియా ద్వారా వెల్లడించారు నిర్మాత కుంజుమోన్. తర్వాత ఈ సినిమాలో హీరోయిన్‌ ఎవరనే టాపిక్‌ నడుస్తోంది. మొదట్లో ఈ చిత్రంలో హీరోయిన్‌గా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతారను సెలెక్ట్‌ చేసినట్లు పుకార్లు షికార్లు చేశాయి. ప్రస్తుతం వాటన్నింటికి చెక్‌ పెడుతూ హీరోయిన్‌ను వెల్లడించారు నిర్మాత కుంజుమోన్. సోషల్‌ మీడియా వేదికగా 'జెంటిల్‌మెన్‌ 2' చిత్రంలో హీరోయిన్‌ పేరును ప్రకటించారు. ఈ పాన్‌ ఇండియా చిత్రంలో మాలీవుడ్‌ బ్యూటీ నయనతార చక్రవర్తిని కథానాయికగా ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించారు కుంజుమోన్. మాలీవుడ్‌లో ఈ బ్యూటీని బేబీ నయనతార అని కూడా పిలుస్తారట. అయితే ఈ సినిమాకు డైరెక్టర్‌ ఎవరనే విషయం మేకర్స్‌ ఇంకా వెల్లడించలేదు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement