నాటు నాటు పాటకు అవార్డ్‌ వస్తుందని ఊహించలేదు: కీరవాణి | MM Keeravani talks on Natu Natu song about Oscar Award | Sakshi
Sakshi News home page

నాకు తొలి ఆస్కార్ రామ్ ‍గోపాల‍్ వర్మనే: కీరవాణి

Published Sun, Mar 26 2023 6:15 AM | Last Updated on Sun, Mar 26 2023 8:08 AM

MM Keeravani talks on Natu Natu song about Oscar Award - Sakshi

‘‘నాటు నాటు’ పాటకు అవార్డులు వస్తాయని నేను ఊహించలేదు. ఆస్కార్‌ అవార్డు వస్తుందని కలలో కూడా అనుకోలేదు’’ అన్నారు సంగీత దర్శకుడు ఎమ్‌ఎమ్‌ కీరవాణి. ఇటీవల జరిగిన 95వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ పాటకు సంగీత దర్శకుడు కీరవాణి, రచయిత చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డులు అందుకున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ఈ ‘నాటు నాటు’ పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ పాడగా ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రఫీ చేశారు. కాగా ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం గురించి తాజాగా సంగీత దర్శకుడు కీరవాణి స్పందించారు. ఓ తమిళ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పిన విశేషాల్లో కొన్ని ఈ విధంగా...

► ‘నాటు నాటు’ ఓ కమర్షియల్‌ సాంగ్‌... అంతే. ఒక వినూత్నమైన పాటలో మన ప్రతిభను క్లాసికల్‌ మ్యూజిక్‌ పరంగా, ఆర్కెస్ట్రాలో కొత్త డిజైనింగ్‌ కంపోజిషన్, అద్భుతమైన పొయిట్రీ వంటి వాటితో కనబరిచి ఉంటే.. అప్పుడు ఆ పాటకు అవార్డులను ఊహిస్తాం. కానీ ‘నాటు నాటు’ పాట పక్కా ఫాస్ట్‌ బీట్‌ కమర్షియల్‌ నెంబర్‌. ఆస్కార్‌ని మరచిపోండి.. అసలు ‘నాటు నాటు’ పాటకు నేను ఏ అవార్డునూ ఊహించలేదు.

ఈ పాటను రాజమౌళి తీసిన విధానం, ప్రేమ్‌రక్షిత్‌ కొరియోగ్రఫీ చేసిన విధానానికి మేజర్‌ క్రెడిట్‌ దక్కుతుంది. అఫ్‌కోర్స్‌ చంద్రబోస్‌కి కూడా. ‘నాటు నాటు వీరనాటు.. నాటు నాటు ఊరనాటు’ అనే ఆ రెండు వాక్యాలు ఒక మంత్రంలాంటివి. వాటిని క్రియేట్‌ చేసిన చంద్రబోస్‌ ఆస్కార్‌ అవార్డుకి అర్హుడు. ఈ పాటను తమిళ, మలయాళం, హిందీ భాషల్లో కూడా చేశాం. అక్కడి రచయితలు కూడా వారి స్థాయికి తగ్గట్లుగా బాగానే కష్టపడ్డారు. కానీ తెలుగు వెర్షన్‌కి మంచి సౌండింగ్, రైమింగ్‌ కుదిరాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అయ్యింది.

► ఇక నాకు లభించిన తొలి ఆస్కార్‌ రామ్‌గోపాల్‌ వర్మగారు. ఇప్పుడు తీసుకున్నది రెండో ఆస్కార్‌. కెరీర్‌ స్టార్టింగ్‌లో నా సంగీత ప్రతిభను గుర్తించమన్నట్లుగా నా మ్యూజిక్‌ క్యాసెట్స్‌ను కొందరికి షేర్‌ చేశాను. వాటిని కొందరు డస్ట్‌బిన్‌లో వేశారు. ఇండస్ట్రీకి ఓ స్ట్రేంజర్‌ వచ్చి నా పాటలు వినండని క్యాసెట్స్‌ ఇస్తే ఎవరు మాత్రం పట్టించుకుంటారు. కానీ ‘క్షణక్షణం’ సినిమాకు రామ్‌గోపాల్‌వర్మగారు చాన్స్‌ ఇచ్చారు. ఆయన కెరీర్‌లో ‘శివ’ ఆస్కార్‌ రోల్‌ ప్లే చేస్తే.. నా కెరీర్‌లో రామ్‌గోపాల్‌వర్మగారు ఆస్కార్‌ రోల్‌ ప్లే చేశారు. ‘రామ్‌గోపాల్‌వర్మతో వర్క్‌ చేస్తున్నాడు కాబట్టి కీరవాణిని మన సినిమాకి తీసుకుందాం’ అంటూ నాకు అవకాశాలు ఇచ్చారు.  

► గునీత్‌ మోంగాగారి (బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్‌లో ఆస్కార్‌ పొందిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ నిర్మాత)కి ఆస్కార్‌ వేదికపై మాట్లాడటానికి తగిన సమయం దక్కలేదు. దీంతో ఆమె తన యాక్సెప్టెన్సీ స్పీచ్‌ తర్వాత సరిగా శ్వాస తీసుకోలేక హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement