మళ్లీ రీమేక్‌ల వైపు..
నృత్య దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు ప్రభుదేవా. తెలుగు, తమిళంలో తలా రెండు చిత్రాలు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, గిల్లీ, విల్లు) చేసి జయాపజయాలను సమంగా పొందారు. తర్వాత బాలీవుడ్ వెళ్లారు. అక్కడ రౌడీ రాథోర్, రామయ్య వస్తావయ్యా చిత్రాలతో విజయాలు అందుకున్నారు. తర్వాత తెరకెక్కించిన ఆర్.రాజ్‌కుమార్, యాక్షన్ జాక్షన్ చిత్రాలు నిరాశపరచాయి.
విషయం ఏమిటంటే ప్రభుదేవా దర్శకత్వం వహించిన రీమేక్ చిత్రాలు విజయం సాధించాయి. సొంత కథలతో రూపొందించిన చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. దీంతో తనను విజయపరంపరపై కూర్చోబెట్టిన రీమేక్ చిత్రాలపై ప్రభుదేవా దృష్టి సారించారని సమాచారం. ఇటీవల తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే చిత్రం చూశారని తెలిసింది. కుటుంబ అనుబంధాలు ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రభుదేవాను బాగా ఆకట్టుకుందని, దీన్ని హిందీలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.