Remake films
-
రీమేక్ లకు గుడ్ బై చెప్పిన మెగా బ్రదర్స్..!
-
బాలీవుడ్ సేఫ్ గేమ్.. రీమేక్‌తో పబ్బం గడుపుతుంది!
హిట్టయిన కథతో సినిమా తీస్తే...దాదాపు హిట్ ఖాయం.దీన్నే ‘సేఫ్ గేమ్’ అంటారు.ఇప్పుడు బాలీవుడ్ ఈ గేమ్ ఆడుతోంది.ఇప్పటికే దక్షిణాదిలో హిట్టయిన పలు చిత్రాలు అక్కడ రీమేక్ అవుతున్నాయి.మరోవైపు దాదాపు అరడజను హాలీవుడ్ సినిమాల ఆధారంగా హిందీ సినిమాలు రూపొందుతున్నాయి.హిందీలో రీమేక్ అవుతున్న ఆ హాలీవుడ్ చిత్రాల గురించి తెలుసుకుందాం. లాల్ కథ లాల్‌సింగ్ అమాయకుడు... చిన్నపాటి శారీరక లోపం కూడా ఉంటుంది. అమాయకుడు కదా అని కొందరు హేళన చేస్తుంటారు. అయితే తన పుట్టుకకు ఒక కారణం ఉందనుకుంటాడు లాల్. ఆర్మీలో చేరతాడు. తన చిన్ననాటి ప్రేయసిని కలవాలన్నది అతని లక్ష్యం. చివరికి కలుసుకోగలిగాడా? లాల్ జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ‘ఫారెస్ట్ గంప్’ చిత్రకథ. 1994లో విడుదలైన ఈ హాలీవుడ్ కామెడీ డ్రామా ‘లాల్‌సింగ్ చద్దా’గా హిందీలో రీమేక్ అయింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టైటిల్ రోల్లో ఆమిర్ ఖాన్, హీరోయిన్గా కరీనా కపూర్, కీలక పాత్రలో నాగచైతన్య నటించారు. కోవిడ్ కారణంగా పలు మార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం ఆగస్ట్ 11న విడుదల కానుంది. మరో రీమేక్‌లోనూ.. ఇంకో విషయం ఏంటంటే... ‘ఫారెస్ట్ గంప్’ రీమేక్‌లో నటించిన ఆమిర్ ఖాన్ మరో హాలీవుడ్ సినిమా ‘కాంపియన్స్’ రీమేక్‌లో నటించడానికి సన్నాహాలు మొదలుపెట్టారని టాక్. 2018లో ‘కాంపియన్స్’ విడుదలైంది. మానసిక లోపాలున్న బాస్కెట్ బాల్ క్రీడాకారుల జట్టుకు కోచింగ్ ఇచ్చి, అంతర్జాతీయ పోటీల్లో విజయాలు సాధించేలా చేసిన కోచ్ జీవితకథే ఈ సినిమా. కోచ్‌గా ఆమిర్ చేయనున్నారు. ఓ ప్రత్యేకమైన అనుబంధం అతని వయసు 70. భార్య చనిపోతుంది. ఎంతో చురుకుగా ఉండే అతనికి రిటైర్మెంట్ జీవితం నచ్చదు. ఓ ఆన్లైన్ ఫ్యాషన్ వెబ్సైట్లో సీనియర్ ఇంటర్న్‌గా జాబ్ సంపాదిస్తాడు. పని రాక్షసి అయిన సీఈవో అంటే ఎవరికీ నచ్చదు. అయితే తన ప్రతిభ, తీరు కారణంగా సహోద్యోగులకు దగ్గర కావడంతో పాటు లేడీ బాస్‌ని కూడా ఆకట్టుకుంటాడు. ఆ ఇద్దరి మధ్య ఓ ప్రత్యేకమైన బంధం ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనేది ‘ది ఇంటర్న్’ కథ. 2015లో విడుదలైన ఈ చిత్రం హిందీ రీమేక్ రిషీ కపూర్, దీపికా పదుకోన్ కాంబినేషన్లో రూపొందాల్సింది. అయితే రిషీ కపూర్ మరణించడంతో ఆయన పాత్రకు అమితాబ్ బచ్చన్‌ని తీసుకున్నారు. కోవిడ్ లాక్డౌన్ల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. ఈ కామెడీ డ్రామా మూవీ షూటింగ్‌ను త్వరలో ఆరంభించాలనుకుంటున్నారు. సోదరి కోసం.. సోదరిని హత్య చేసిందెవరో తెలుసుకోవడానికి ఓ అమ్మాయి చేసే ప్రయత్నమే ‘జూలియాస్ ఐస్’. 2010లో ఈ హారర్ థ్రిల్లర్ విడుదలైంది. హిందీలో ఈ చిత్రం ‘బ్లర్’ టైటిల్‌తో రీమేక్ అయింది. కంటిచూపు మందగిస్తున్నప్పటికీ సోదరిని హత్య చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి పలు రకాలుగా ప్రయత్నం చేసే యువతి పాత్రను తాప్సీ చేశారు. ఈ సినిమా కథ నచ్చి ఆమె ఓ నిర్మాతగా కూడా వ్యవహరించారు. అజయ్ బెహల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. చూపు లేకపోయినా.... ఒక కారు ప్రమాదంలో ఓ యువతి చూపు కోల్పోతుంది. అయితే ఓ ఇన్వెస్టిగేషన్ విషయంలో పోలీసులకు సహాయపడుతుంది. హాలీవుడ్ మూవీ ‘బ్లైండ్’ (2016) కథ ఇది. ఇదే టైటిల్‌తో సోనమ్ కపూర్ నాయికగా హిందీలో రీమేక్ అయింది. షోమే మఖీజా దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల కోవిడ్ వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లలో లేదా ఓటీటీలో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఓ సైనికుడి కథ జాన్ రాంబో మాజీ సైనికుడు. వియత్నాం యుద్ధం తాలూకు జ్ఞాపకాలతో జీవితం గడుపుతుంటాడు. అయితే ఒక చిన్న పట్టణంలో ఒక వ్యక్తితో జరిగిన ఘటన వల్ల రాంబో ఇబ్బందులు ఎదుర్కొంటాడు? వాటిని ఎలా అధిగమించాడు? అనే కథతో సాగే చిత్రం ‘రాంబో: ఫస్ట్ బ్లడ్’ (1982). సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన ఈ యాక్షన్ మూవీ హిందీలో టైగర్ ష్రాఫ్ హీరోగా రీమేక్ కానుంది. ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకుడు. ఇవే కాదు... ‘బిగిన్ ఎగైన్’, ‘రెడ్’ వంటి హాలీవుడ్ చిత్రాలు కూడా హిందీలో రీమేక్ కానున్నాయి. కథ యూనివర్శల్ అయితే ప్రాంతం, భాషతో సంబంధం లేదు. అందులోని పాయింట్ ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. అందుకే ఈ విదేశీ చిత్రాలు దేశీ తెరమీదకు వస్తున్నాయి. -
ఆర్ఎక్స్100 రీమేక్‌లో స్టార్ హీరో కొడుకు
తెలుగులో హిట్ అయిన ‘ఆర్ఎక్స్100’ను హిందీలో తన కుమారుడితో రీమేక్ చేస్తున్నాడు నటుడు సునీల్ శెట్టి. సినిమా పేరు ‘తడప్’. అంటే తపన అని అర్థం. అహన్ శెట్టి, తార సుతరియా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు మిలన్ లుత్రియా. ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా నటుడు అక్షయ్ కుమార్ రిలీజ్ చేశాడు. అక్షయ్, సునీల్‌శెట్టి కలిసి ‘మొహ్రా’ వంటి సూపర్‌హిట్‌లో నటించారు. ఆ తర్వాత దర్శకుడు ప్రియదర్శన్ కామెడీల్లోను సందడి చేశారు. ఆ స్నేహం కొద్దీ అక్షయ్ కుమార్ ‘తడప్’ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు. ఆర్ఎక్స్ 100 రెగ్యులర్ ప్రేమ కథల వంటిది కాదు. అందులో ప్రేమను స్వార్థానికి ఉపయోగించే కొందరు అమ్మాయిల ధోరణిని కథాంశంగా తీసుకున్నారు. సమాజంలో అది ఉందని ప్రేక్షకులు కన్విన్స్ అవడం వల్లే సినిమాను హిట్ చేశారు. ఇందులో నటించిన పాయల్ రాజ్‌పుత్ మంచి పేరు సంపాదించుకుంది. హీరోగా నటించిన కార్తికేయ ట్రాక్‌లో పడ్డాడు. కనుకనే సునీల్ శెట్టి కూడా తన కుమారుడికి ఈ సినిమా మంచి ప్లాట్‌ఫామ్ కాగలదని ఆశిస్తున్నట్టున్నాడు. అహన్ శెట్టి తండ్రి వలే శారీరక పోషణలో శ్రద్ధ ఉన్నవాడు. ఫుట్‌బాల్ బాగా ఆడతాడు. ఇతనికి ఒక అక్క ఉంది. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో వస్తున్నాడు. అతనికి ఆల్ ది బెస్ట్ చెబుదాం. -
దేశీ టచ్‌తో విదేశీ కథలు
దక్షిణాది చిత్రాలు ఉత్తరాదిన రీమేక్ కావడం... ఉత్తరాది హిట్లు దక్షిణాదిన రీమేక్ కావడం సహజం. అయితే విదేశీ చిత్రాలు ఇక్కడ రీమేక్ కావడం అరుదుగా జరుగుతుంటుంది. అలాంటిది ఒకేసారి రెండు అమెరికన్ చిత్రాలు, ఒక జర్మన్ థ్రిల్లర్, ఒక సౌత్ కొరియన్ మూవీ హిందీలో రీమేక్ కావడం విశేషం. ఈ విదేశీ కథలకు దేశీ టచ్ ఇచ్చి రీమేక్ చేస్తున్నారు. ఆ నాలుగు చిత్రాల కథా కమామీషు తెలుసుకుందాం. కొరియా ఈసారైనా కలిసొచ్చేనా? ఓ ధనవంతుడి నిజస్వరూపాన్ని బయట పెట్టేందుకు డిటెక్టివ్‌గా మారనున్నారు సల్మాన్ ఖాన్. సౌత్ కొరియాలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల టాప్ టెన్ లిస్ట్‌లో ఉన్న ‘వెటరన్’ (2015) హిందీ రీమేక్‌లోనే ఆయన డిటెక్టివ్‌గా కనిపించనున్నారు. ‘వెటరన్’ హిందీ రీమేక్ హక్కులను దర్శక–నిర్మాత, నటుడు అతుల్ అగ్నిహోత్రి దక్కించుకున్నారు. వ్యాపారం ముసుగులో ఓ యువ వ్యాపారవేత్త నేరాలకు పాల్పడుతుంటాడు. ఆ నేరాలను నిరూపించేందుకు ఓ డిటెక్టివ్, అతని బృందం ప్రయత్నాలు చేస్తుంటారు. ఫైనల్‌గా ఈ కేసును డిటెక్టివ్ ఎలా పరిష్కరించాడన్నదే కథ. సల్మాన్‌కి తొలి సౌత్ కొరియన్ చిత్రం కాదిది. 2017లో విడుదలైన సౌత్ కొరియన్ మూవీ ‘ఓడ్ టు మై ఫాదర్’ హిందీ రీమేక్ ‘భారత్’లో ఆయన హీరోగా నటించారు. ‘భారత్’ బాక్సాఫీసు వద్ద సరైన ఫలితం ఇవ్వలేదు. మరి.. సల్మాన్ కమిట్ అయిన మరో సౌత్ కొరియన్ మూవీ ‘వెటరన్’ రీమేక్ హిట్ అవుతుందా? వేచి చూడాలి. లాల్‌సింగ్ ప్రయాణం ఆరు ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న అమెరికన్ ఫిల్మ్ ‘ది ఫారెస్ట్‌గంప్’ (1994). విన్స్టన్ గ్రూమ్ రాసిన ‘ఫారెస్ట్ గంప్’ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ సినిమా ఇప్పుడు హిందీలో ‘లాల్‌సింగ్ చద్దా’గా రీమేక్ అవుతోంది. ఆమిర్ ఖాన్ టైటిల్ రోల్లో అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక.. ‘ఫారెస్ట్‌గంప్’ కథ విషయానికి వస్తే... ఓ పిల్లాడు మానసిక సమస్యతో ఇబ్బందిపడుతుంటాడు. పైగా కాళ్లు సరిగా ఉండవు. ఓ సందర్భంలో అతని కాళ్లు బాగుపడతాయి. ఆ తర్వాత అతను మిలటరీకి వెళతాడు. అక్కడ ఓ స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం వారి కుటుంబ సభ్యుల బాగోగులకు బాధ్యత వహిస్తాడు. మిలటరీ నుంచి రిటైర్ అయిన తర్వాత ఓ బోటు ఓనర్‌గా మారి ధనవంతుడు అవుతాడు. ఆ తర్వాత తన గురించి తాను తెలుసుకోవడానికి దేశంలో సుదీర్ఘ దూరం పరిగెడతాడు. ప్రేయసిని వెతుక్కుంటూ వెళతాడు. ఇలా ఓ వ్యక్తి జీవితంలోని ముఖ్యమైన సంఘటనల సమాహారమే ‘ది ఫారెస్ట్ గంప్’ చిత్రం. ప్రియుడి కోసం సాహసం ప్రియుడి క్షేమం కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధం అంటున్నారు హీరోయిన్ తాప్సీ. ‘లూప్ లపేటా’ చిత్రంలో తన లవర్ కోసం సాహసాలు చేయబోతున్నారామె. 1998లో వచ్చిన జర్మన్ థ్రిల్లర్ ‘రన్ లోలా రన్’కి ‘లూప్ లపేటా’ హిందీ రీమేక్. ఈ చిత్రానికి ఆకాష్ భాటియా దర్శకత్వం వహిస్తారు. 71వ ఆస్కార్ వేడుకల్లో ‘రన్ లోలా రన్’ చిత్రం ఉత్తమ విదేశీ విభాగంలో నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. అయితే నామినేషన్ దక్కకపోయినా ‘రన్ లోలా..’ మంచి సినిమాగా ప్రేక్షకుల కితాబులందుకుంది. ఈ చిత్రకథ విషయానికి వస్తే... ఒకతను డబ్బు ఉన్న బ్యాగుతో ట్రైన్లో ప్రయాణిస్తుంటాడు. కానీ అది అక్రమ సొత్తు. డబ్బు ఉన్న ఆ బ్యాగుని రైల్వే అధికారులు పరిశీలిస్తారనే భయంతో అతను ఆ బ్యాగును ట్రైన్లో వదిలి వెళ్లిపోతాడు. ఇంతలో అతని బాస్ ఫోన్ చేసి 20 నిమిషాల్లో తన డబ్బు తనకు కావాలని బెదిరిస్తాడు. జరిగిన విషయాన్ని తన ప్రేయసికి చెబుతాడు అతను. ఆమె తన తండ్రి దగ్గర లేదా ఏదైనా బ్యాంకులో డబ్బు కోసం ప్రయత్నిద్దామని చెబుతుంది. కుదరకపోవడంతో వారు ఓ సూపర్మార్కెట్లో దొంగతనం చేయాల్సి వస్తుంది. కానీ ఇద్దరిలో ఒకర్ని పోలీసులు పట్టుకుంటారు. ఒకర్ని తుపాకీతో కాలుస్తారు. మరి.. బాస్‌కు డబ్బు అందిందా? ప్రియుడ్ని ఆ యువతి ఎలా రక్షించుకుంది? అన్నదే కథ. మిస్సింగ్ మిస్టరీ అమెరికన్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ ‘ద గాళ్ ఆన్ ద ట్రైన్’ (2016). రచయిత పౌలా హాకిన్స్ రాసిన నవలల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన నవల ‘ద గాళ్ ఆన్ ద ట్రైన్’ (2016) ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. హిందీలో అదే టైటిల్‌తో ఈ సినిమా రీమేక్ అవుతోంది. రిబుదాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పరిణీతీ చోప్రా నటిస్తున్నారు. ఓ మహిళకు మద్యం తీసుకునే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల ఆమె వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితంలో చాలా సమస్యలు తలెత్తుతాయి. ఓ మిస్సింగ్ కేసులోనూ ఇరుక్కుంటుంది. అసలు.. ఈ మిస్టరీ వెనక ఉన్న సూత్రధారి ఎవరు? ఈ సంఘటన తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అన్నదే కథ. విదేశీ కథలు మనకు నచ్చుతాయా? అంటే మన నేటివిటీకి తగ్గట్టు ఉంటే నచ్చుతాయి. ఈ నాలుగు చిత్రాల దర్శకులు కథలో మార్పులు చేశారు. మరి.. ఈ రీమేక్స్ బాక్సాఫీస్ వద్ద గెలుస్తాయా? వేచి చూద్దాం. -
భార్య, భర్త మధ్యలో ఆమె!
ప్రపంచంలో ఏడే కథలు ఉంటాయట.. సప్త సముద్రాల్లానే. ఆ సముద్రంలోని చేప ఈ సముద్రంలోకి.. ఈ సముద్రంలోని చేప ఆ సముద్రంలోకి సాధారణంగా పోదు.. పోలేదు.కానీ ముంబై మహా తీరానికి అన్ని సముద్రాల చేపలూ కొట్టుకొస్తున్నాయి. బాలీవుడ్ మరి! అదొక రీమేక్ కథాసాగరం. గత ఏడాదంతా బాలీవుడ్ సిల్వర్‌స్క్రీన్‌పై ఎక్కువగా బయోపిక్‌ల హవా నడిచింది. ఈ ఏడాది రీమేక్‌ల హవా. సల్మాన్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, సంజయ్‌దత్, అక్షయ్‌కుమార్ వంటి స్టార్ యాక్టర్స్ రీమేక్ సినిమాల వైపు దృష్టి పెట్టారు. ఇతర భాషల్లో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో కింగ్‌లా నిలిచిన హిట్ సినిమాల రిమేక్స్తో బిజీ బిజీగా ఉన్నారు. ఈ ‘రీ’మేకింగ్ చిత్రాల్లో నటించబోయే, నటిస్తున్న బాలీవుడ్ స్టార్స్ గురించి తెలుసుకుందాం. మరో కొరియన్ కొరియన్ హిట్ సినిమాలపై ఓ కన్నేసినట్లున్నారు కండల వీరుడు సల్మాన్‌ఖాన్. ఈ ఏడాది ‘ఓడ్ టు మై ఫాదర్’ అనే సౌత్ కొరియన్ మూవీ హిందీ రీమేక్ ‘భారత్’లో నటించిన సల్మాన్... వెంటనే మరో సౌత్ కొరియన్ చిత్రం ‘వెటరన్’ రీమేక్‌లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సల్మాన్ ఆశించిన విజయాన్ని ‘భారత్’ అందించకపోయినప్పటిMీ ‘వెటరన్’ చిత్రం రీమేక్‌కు సల్లూ భాయ్ సై అనడం విశేషం. నటుడు, నిర్మాత, దర్శకుడు అతుల్ అగ్నిహోత్రి ‘వెటరన్’ రీమేక్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. హిందీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి, వచ్చే ఏడాది షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారట. లాల్‌సింగ్ ఆమిర్ ఖాన్, అమితాబ్ బచ్చన్ తొలిసారి కలిసి నటించిన 300 కోట్ల భారీ బడ్జెట్ చిత్రం ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. దీంతో ఆమిర్ ఆలోచనలు ఒక్కసారిగా ఆస్కార్ విన్నింగ్ హాలీవుడ్ ఫిల్మ్ ‘ఫారెస్ట్ గంప్’ వైపు తిరిగాయి. ‘లాల్‌సింగ్ చద్దా’ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ రీమేక్ కోసం ఆమిర్ దాదాపు 20 కిలోల బరువు తగ్గారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు ఆమిర్ కూడా ఒక నిర్మాత కావడం విశేషం. డబుల్ ధమాకా ఏడాదికి కనీసం నాలుగు సినిమాలనైనా ప్రేక్షకుల ముందకు తీసుకురావడం అక్షయ్ కుమార్ స్టైల్. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అక్షయ్ సినిమాల్లో ప్రస్తుతానికి రెండు సౌత్ రీమేక్స్ ఉన్నాయి. లారెన్స్ ‘కాంచన’, అజిత్ ‘వీరమ్’ చిత్రాల హిందీ రీమేక్స్ ‘లక్ష్మీబాంబ్’, ‘బచ్చన్‌పాండే’ల్లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్నారు. ‘లక్ష్మీ బాంబ్’ చిత్రానికి రాఘవ లారెన్స్, ‘బచ్చన్‌పాండే’కు ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే నిర్మాతలు తనకు సరైన గౌరవం ఇవ్వలేదని లారెన్స్ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతల నుంచి మొదట తప్పుకున్నారు. అక్షయ్ జోక్యంతో తిరిగి మళ్లీ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇక అక్షయ్ నటించిన ‘మిషన్ మంగళ్, హౌస్‌ఫుల్ 4, గుడ్ న్యూస్’ రిలీజ్‌కు రెడీ అయ్యాయి. రాజకీయ ప్రస్థానం రాజకీయ నాయకుడిగా ‘ప్రస్థానం’ మొదలుపెట్టారు బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్‌దత్. ఇది వెండితెర పార్టీ. 2010లో దేవకట్టా దర్శకత్వంలో తెలుగులో వచ్చిన ‘ప్రస్థానం’ చిత్రం ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చేప్పక్కర్లేదు. ఈ సినిమాను దేవాకట్టాయే ప్రస్తుతం హిందీలో ‘ప్రస్థానం’ అనే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. తెలుగులో సాయికుమార్ చేసిన పాత్రను హిందీలో సంజయ్‌దత్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మనీషా కొయిరాల, అలీ ఫజల్, జాకీష్రాఫ్, అమైరా దస్తూర్, చుంకీ పాండే కీలక పాత్రధారులు. కొత్త కూలీ తొలిసారి నిర్మాతగా మారి కూలీ చేస్తున్నారు బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్. 1995లో వరుణ్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం ‘కూలీ నం 1’ అప్పట్లో మంచి విజయం సాధించింది. గోవింద, కరిష్మా కపూర్ నటించారు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్లో అదే టైటిల్‌తో రీమేక్ అవుతోంది. వరుణ్ ధావన్, సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. నాటి ‘కూలీ నం 1’కు దర్శకత్వం వహించిన డేవిడ్ ధావనే ఈ సినిమాకూ దర్శకుడు. వచ్చే ఏడాది కార్మికుల దినోత్సవానికి (మే 1) ఈ కూలీ నం 1 వెండితెరపైకి రానున్నారు. రంగు మారెనే! త్వరలో రైలు ప్రయాణం చేయడానికి జుట్టు రంగు మార్చుకున్నారు హీరోయిన్ పరిణీతీ చోప్రా. హాలీవుడ్ మూవీ ‘ద గాళ్ ఆన్ ది ట్రైన్’ రీమేక్ కోసం అలా మేకోవర్ అయ్యారు పరిణీతి. మూడేళ్ల క్రితం విడుదలైన ఈ హాలీవుడ్ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా హిందీ రీమేక్ రిభూ దాస్‌గుప్తా దర్శకత్వంలో తెరకెక్కనుండగా పరిణీతీ చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారు. క్యాన్సర్ బాధితుడు బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ క్యాన్సర్‌తో బాధపడే వ్యక్తిగా కనిపించనున్న చిత్రం ‘దిల్ బచారే’. ఐదేళ్ల క్రితం హాలీవుడ్లో వచ్చిన ‘ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ చిత్రం హిందీలో ‘దిల్ బచారే’గా రీమేక్ అవుతోంది. సుశాంత్ సింగ్, సంజనా సాంఘీ హీరో హీరోయిన్లు. ముఖేష్ చబ్రా దర్శకుడు. ఇంకా... మలయాళ హిట్ ‘ఎజ్రా’ సేమ్ టైటిల్‌తో హిందీలో రీమేక్ అవుతోంది. నటుడు ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. 1971లో వచ్చిన ‘హాథీ మేరే సాథీ’ సినిమా సోల్‌ను ప్రేరణగా తీసుకుని అదే టైటిల్‌తో హిందీలో సినిమా చేస్తున్నారు రానా. ఈ సినిమాకు తెలుగులో అరణ్య, తమిళంలో ‘కాడన్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ‘ఆర్ఎక్స్ 100’ హిందీ రీమేక్‌లో అహన్ శెట్టి హీరోగా నటించనున్నారు. మరోవైపు 1994లో వచ్చిన హిందీ హిట్ ‘అందాజ్ అప్నా అప్నా’ లేటెస్ట్ రీమేక్‌లో రణ్వీర్ సింగ్, వరుణ్‌ధావన్ కలిసి నటించబోతున్నారని టాక్. ‘ఓ కౌన్ తీ?’ (1964) ‘రాత్ ఔర్ దిన్’ (1967) తాజా రీమేక్స్‌లో ఐశ్యర్యారాయ్ నటించబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. హీరోలు కావలెను! కొన్ని సౌత్ సినిమాలు హిందీలో రీమేక్ కానున్నట్లు అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ ఆ సినిమాల్లో ఎవరు హీరోలుగా నటించబోతున్నారు అనే విషయంపై సరైన స్పష్టత రావడం లేదు. ఇప్పుడు ఈ రీమేక్స్‌లో నటించడానికి బాలీవుడ్లో హీరోలు కావాలి. తెలుగు చిత్రాలు ‘జెర్సీ’, ‘ఓ బేబి’, ‘ఎఫ్ 2’, ‘డియర్ కామ్రేడ్’, ‘ఎవడు’తో పాటు తమిళ చిత్రాలు ‘వేదాలం’, ‘కత్తి’, ‘విక్రమ్ వేదా’, ‘పితామగన్’, ‘జిగర్తండా’ హిందీలో రీమేక్ కానున్నాయి. కానీ ఈ చిత్రాల్లో ఎవరు హీరో హీరోయిన్లుగా నటించబోతున్నారనే అంశంపై బాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి. ‘జెర్సీ’ హిందీ రీమేక్‌లో షాహిద్‌కపూర్, ‘ఎఫ్ 2’లో ఒక హీరోగా అర్జున్ కపూర్, ‘ఓ బేబీ’ హీరోయిన్గా ఆలియా భట్ నటించనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకా ‘జిగర్తండా’ హిందీ రీమేక్‌లో రాజ్‌కుమార్ రావు, సైఫ్ అలీఖాన్ నటించనున్నారని తాజా బీ టౌన్ టాక్. మరి.. ప్రచారంలో ఉన్నట్లుగా ఆయా రీమేక్ చిత్రాల్లో పైన పేర్కొన్న నటీనటులు నటిస్తారా? లేక కొత్తవారు ఎవరైనా వస్తారా? అనే ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వెయిట్ చేయాల్సిందే. కోట్ల క్లబ్లో హిట్ ఫార్ములా బడా బడా స్టార్స్ రీమేక్ సినిమాలవైపు ఆసక్తి చూపడానికి బాక్సాఫీస్ కలెక్షన్స్ కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ఎలాగంటే.. అమితాబ్ బచ్చన్, తాప్సీ కలిసి నటించిన ‘బద్లా’ మూవీ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టింది. స్పానిష్ థ్రిల్లర్ ‘ది ఇన్విజిబుల్ గెస్ట్’ చిత్రానికి ఇది హిందీ రీమేక్. రణ్వీర్ సింగ్ నటించిన ‘సింబా’ (తెలుగు హిట్ ‘టెంపర్’ రీమేక్) బీటౌన్ బాక్సాఫీస్ వద్ద రెండువందల కోట్ల రూపాయలను కలెక్ట్ చేసింది. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ హిందీ రీమేక్ ‘కబీర్‌సింగ్’లో షాహిద్‌కపూర్ నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా 300కోట్ల రూపాయల వసూళ్లవైపు పరుగులు తీస్తోంది. ఇలా స్ట్రయిట్ చిత్రాలకు దీటుగా రీమేక్ చిత్రాల వసూళ్లు ఉండటంతో ఆల్రెడీ హిట్ అయిన సినిమా మీద నమ్మకం ఉంచి, రీమేక్‌కి సై అంటున్నారని ఊహించవచ్చు. భార్య, భర్త మధ్యలో ఆమె! ‘సోనూ కి టిట్టు కి స్వీటీ’ సినిమా సక్సెస్‌తో బాలీవుడ్లో కార్తీక్ ఆర్యన్‌కు మంచి గుర్తింపు దక్కింది. ఈ సినిమా వందకోట్ల క్లబ్లో చేరడంతో కార్తీక్ క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న చిత్రాల్లో ‘పతీ పత్నీ ఔర్ ఓ’ సినిమా ఒకటి. ఈ సినిమా టైటిల్ ఎక్కడో విన్నట్లు ఉంది కదూ. అవును.. 1978లో బీఆర్ చోప్రా దర్శకత్వంలో వచ్చిన ‘పతీ పత్నీ ఔర్ ఓ’ సినిమాను అదే టైటిల్‌తో రీమేక్ చేస్తున్నారు. కార్తీక్, భూమి ఫడ్నేకర్, అనన్య పాండే హీరో హీరోయిన్లు. ముదస్సార్ అజీజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ♦ ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది బాలీవుడ్లో దాదాపు 25 రీమేక్ సినిమాలు నిర్మాణంలో ఉండటం విశేషం. కథల కొరతా? అంటే.. అదొక కారణం అయ్యుండొచ్చు. హిట్ ఫార్ములాతో సేఫ్ గేమ్ ఆడొచ్చనే కారణం కూడా ఇన్ని రీమేక్స్‌కి కారణం అయ్యుండొచ్చు.– ముసిమి శివాంజనేయులు -
బాలీవుడ్‌కు సోషల్ మీడియా స్టార్!
సాక్షి, ముంబయి : ఆమె ఒక్కసారి కన్నుకొట్టి కుర్రకారు గుండెల్ని పిండేసింది. ‘ముద్దు’ గన్నుతో కాల్చి హృదయాలను పేల్చేసింది. ఆమె ఎవరు? అని మాత్రం చెప్పనక్కర్లేదు. రాత్రికి రాత్రే స్టార్డమ్ తెచ్చుకుని సోషల్ మీడియా మొత్తం తన చుట్టూ తిరిగేలా చేసుకున్న మళయాల ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఇప్పటి వరకు ఆమె నటించిన ఏ సినిమా కూడా విడుదల కాకుండానే అటు మళయాళం మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా యువహృదయాలను కొల్లగొట్టిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ ఇంట అడుగుపెడుతోందట. పూరీ, ఎన్టీఆర్ కాంబీనేషన్‌లో వచ్చి బంపర్ హిట్‌గా నిలిచిన టెంపర్ సినిమాను బాలీవుడ్లో రీమేక్ అవబోతుందన్న విషయం తెలిసిందే. రోహిత్ శెట్టి దర్శకత్వంలో, కరణ్ జోహార్ నిర్మాణ సారథ్యంలో రణ్వీర్ సింగ్ హీరోగా ‘సింబా’ అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమాకు ప్రియాను కూడా తీసుకోవాలని కరణ్ జోహర్ ఆమెను సంప్రదించినట్లు సమాచారం. ఒకవేళ అదే జరిగితే ఆ సినిమాలో ఆమెకు హీరోయిన్ పాత్ర ఇస్తారా?, లేక తెలుగులో మధురిమ చేసిన పాత్ర కోసమా? అనేది వేచి చూడాలి. -
మళ్లీ రీమేక్‌ల వైపు..
నృత్య దర్శకుడిగా, నటుడిగా, దర్శకుడిగా ప్రతిభ చాటుకున్నారు ప్రభుదేవా. తెలుగు, తమిళంలో తలా రెండు చిత్రాలు నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, గిల్లీ, విల్లు) చేసి జయాపజయాలను సమంగా పొందారు. తర్వాత బాలీవుడ్ వెళ్లారు. అక్కడ రౌడీ రాథోర్, రామయ్య వస్తావయ్యా చిత్రాలతో విజయాలు అందుకున్నారు. తర్వాత తెరకెక్కించిన ఆర్.రాజ్‌కుమార్, యాక్షన్ జాక్షన్ చిత్రాలు నిరాశపరచాయి. విషయం ఏమిటంటే ప్రభుదేవా దర్శకత్వం వహించిన రీమేక్ చిత్రాలు విజయం సాధించాయి. సొంత కథలతో రూపొందించిన చిత్రాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. దీంతో తనను విజయపరంపరపై కూర్చోబెట్టిన రీమేక్ చిత్రాలపై ప్రభుదేవా దృష్టి సారించారని సమాచారం. ఇటీవల తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన గోవిందుడు అందరివాడే చిత్రం చూశారని తెలిసింది. కుటుంబ అనుబంధాలు ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రభుదేవాను బాగా ఆకట్టుకుందని, దీన్ని హిందీలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.