
తెలుగులో హిట్ అయిన ‘ఆర్‌ఎక్స్100’ను హిందీలో తన కుమారుడితో రీమేక్ చేస్తున్నాడు నటుడు సునీల్ శెట్టి. సినిమా పేరు ‘తడప్’. అంటే తపన అని అర్థం. అహన్ శెట్టి, తార సుతరియా నటిస్తున్న ఈ సినిమాకు దర్శకుడు మిలన్ లుత్‌రియా. ఈ సినిమా పోస్టర్‌ను తాజాగా నటుడు అక్షయ్ కుమార్ రిలీజ్ చేశాడు. అక్షయ్, సునీల్‌శెట్టి కలిసి ‘మొహ్రా’ వంటి సూపర్‌హిట్‌లో నటించారు. ఆ తర్వాత దర్శకుడు ప్రియదర్శన్ కామెడీల్లోను సందడి చేశారు. ఆ స్నేహం కొద్దీ అక్షయ్ కుమార్ ‘తడప్’ పోస్టర్‌ను రిలీజ్ చేశాడు.
ఆర్‌ఎక్స్ 100 రెగ్యులర్ ప్రేమ కథల వంటిది కాదు. అందులో ప్రేమను స్వార్థానికి ఉపయోగించే కొందరు అమ్మాయిల ధోరణిని కథాంశంగా తీసుకున్నారు. సమాజంలో అది ఉందని ప్రేక్షకులు కన్విన్స్ అవడం వల్లే సినిమాను హిట్ చేశారు. ఇందులో నటించిన పాయల్ రాజ్‌పుత్ మంచి పేరు సంపాదించుకుంది. హీరోగా నటించిన కార్తికేయ ట్రాక్‌లో పడ్డాడు. కనుకనే సునీల్ శెట్టి కూడా తన కుమారుడికి ఈ సినిమా మంచి ప్లాట్‌ఫామ్ కాగలదని ఆశిస్తున్నట్టున్నాడు. అహన్ శెట్టి తండ్రి వలే శారీరక పోషణలో శ్రద్ధ ఉన్నవాడు. ఫుట్‌బాల్ బాగా ఆడతాడు. ఇతనికి ఒక అక్క ఉంది. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో వస్తున్నాడు. అతనికి ఆల్ ది బెస్ట్ చెబుదాం.
Comments
Please login to add a commentAdd a comment