అప్పుడు పవన్ కళ్యాణ్ వస్తే అభ్యంతరమా?: చిరంజీవి
గోవిందు అందరివాడేలే చిత్ర 150 రోజుల దినోత్సవానికి పవన్ కళ్యాణ్ వస్తే అభ్యంతరమా అంటూ అభిమానులకు మెగాస్టార్ చిరంజీవి ప్రశ్నించారు. గోవిందుడు అందరి వాడేలే చిత్ర ఆడియో కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతుండగా పవన్ కళ్యాణ్ అంటూ అభిమానులు అడ్డు తగిలారు. దాంతో మీ మా, అందరి సోదరుడు పవన్ కళ్యాణ్ అంటూ చిరంజీవి ఆడియో కార్యక్రమంలో మాట్లాడవల్సిన పరిస్థితి ఏర్పడింది.
కుటుంబ కథ చిత్రాలను తెరకెక్కించడంలో దర్శకుడు కృష్ణవంశీ ప్రత్యేకమైన శైలి అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం విజేత తనకు ఎంత ఘనవిజయాన్ని అందించిందో.. ఈ చిత్రం కూడా చరణ్ కెరీర్ లో అలాంటి చిత్రంగా మిగులుతుందన్నారు. బి. గణేష్ అంటే బండ్ల గణేష్ కాదని.. బాక్సాఫీస్ గణేష్ అంటూ చిరంజీవి ప్రశంసించారు.