
మా గోవిందుడు అందరినీ అలరిస్తాడు...
- అప్పన్నను దర్శించుకున్న చిత్ర నిర్మాత బండ్ల గణేష్
సింహాచలం: రామ్‌చరణ్ హీరోగా తాను నిర్మించి న ‘గోవిందుడు అందరి వాడేలే’ చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందని ఆచిత్ర నిర్మాత బండ్ల గణేష్ తెలిపారు. ఆదివారం ఉదయం సింహా చల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఆయ న కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అక్టోబర్ ఒకటిన విడుదల అవుతున్న తమ చిత్రం విజయవంతంకావాలని స్వామికి పూజ లు నిర్వహించారు. కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. గోదాదేవి సన్నిధిలో కుంకుమార్చన నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడుతూ ‘గబ్బర్‌సింగ్’ సినిమా నుంచి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిం దన్నారు. అప్పటి నుంచి తన పరమేశ్వర ఆర్ట్స్ బేనర్ వేల్యూ పెరిగిందన్నారు. గోవిందుడు అందరివాడేలే కూడా స్వామి ఆశీస్సులతో పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నానన్నారు.
ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ ఒకటిన ఈ సిని మా రిలీజ్ అవుతోందన్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్, జయసుధతోపాటు దాదాపు 60 మంది ప్రముఖ నటీనటులతో ఈ చిత్రాన్ని తీశామన్నారు. ఒక మంచి కుటుంబ కథా చిత్రంగా, మానవతా విలువలు, తాతా మనవళ్ల మధ్య అనుబంధాన్ని చాటిచెప్పేవిధంగా చిత్రాన్ని రూపొందించామన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా మరో చిత్రాన్ని నిర్మిస్తున్నామని, సంక్రాంతికి విడుదల చేస్తామని చెప్పారు.
శరణ్య వేంకటేశునికి పూజలు
ఆనందపురం: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ దంపతులు పైడా ఇంజినీరింగ్ కళాశాల ఆవరణలో ఉన్న శ్రీ శరణ్య వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని ఆదివారం దర్శించుకున్నారు. ‘గోవిందుడు అందరి వాడేలే’ సినిమా విజయవంతం కావాలని కోరుతూ వారు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకుడు కిశోర్ ఆచార్యులు స్వాగతం పలికి పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలను అంద జేశారు.