వారికే ప్రాముఖ్యతనిస్తా | High importance in Commercial Advertisement says kajal aggarwal | Sakshi
Sakshi News home page

వారికే ప్రాముఖ్యతనిస్తా

Published Sun, Oct 19 2014 12:15 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

వారికే ప్రాముఖ్యతనిస్తా - Sakshi

వారికే ప్రాముఖ్యతనిస్తా

 అభిమానుల అభిరుచి మేరకే తన నటన ఉంటుందని కాజల్ అగర్వాల్ అంటోంది. టాలీవుడ్‌లో గోవిందుడు అందరి వాడే చిత్రం అందించిన విజయంతో మంచి జోష్‌లో ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం వాణిజ్య ప్రకటనల్లో దుమ్మురేపుతోంది. చిత్రాల కంటే వీటికే అధిక ప్రాముఖ్యత నిస్తున్నట్లున్నారు. ఇకపోతే తమిళంలో జిల్లా చిత్రం తరువాత మరో అవకాశం లేదీ అమ్మడికి. అందుకు కారణం నిర్మాతల కళ్లు బైర్లు కమ్మే పారితోషికం డిమాండ్ చేస్తోందన్న టాక్ బాగా స్ప్రెడ్ అవడమే. ఈ విషయం అటుంచితే ఎవరైనా విజయవంతమైన చిత్రం తీయాలనే ప్రయత్నిస్తారు. అయితే ప్రస్తుతం పది చిత్రాల్లో ఒక చిత్రం మాత్రమే హిట్ అనిపించుకుంటోంది.

 దీని గురించి కాజల్ మాట్లాడుతూ అభిమానులు సోషియల్ నెట్‌వర్క్స్‌లో తన గురించి చేసే వ్యాఖ్యలకూ ప్రాముఖ్యతనిస్తానని వారి సలహాలను స్వీకరిస్తానంది. సినిమా జయాపజయాలనేవి అభిమానుల చేతుల్లోనే ఉంటాయని చెప్పింది. అందువలనే వారి అభిరుచికి అనుగుణంగా నటించడానికి ప్రయత్నిస్తానంది. తన నటనపై విమర్శలు చేస్తే తదుపరి చిత్రంలో ఆ కొరతలు లేకుండా జాగ్రత పడతానని తెలిపింది. అదే విధంగా తనకు ఎలాంటి కాస్ట్యూమ్స్ బాగుంటాయన్న విషయంలో వారి సూచనలను పాటిస్తానని కాజల్ చెప్పడం గమనార్హం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement