critics
-
దసరా ఉత్సవాల్లో సనాతన ధర్మం విమర్శకులపై పోస్టర్లు
ఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరుగుతున్న దసరా వేడుకల్లో దిష్టిబొమ్మలకు సనాతన ధర్మ వ్యతిరేకులపై పోస్టర్లు వెలిశాయి. 'సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్లు నశించిపోతారు', 'సనాతన ధర్మ విమర్శకులు అంతరించిపోతారు' అని పేర్కొన్న పోస్టర్లను దిష్టిబొమ్మలకు అంటించారు. కానీ వేడుకల ప్రారంభానికి ముందే వాటన్నింటిని తొలగించారు. కాగా ఈ ఏడాది ఎర్రకోటలో జరుగుతున్న దసరా ఉత్సవాలకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా హాజరుకానున్నారు. 50 ఏళ్లుగా జరుగుతున్న ఎర్రకోట ఉత్సవాల చరిత్రలో తొలిసారి ఓ మహిళ కంగనా రనౌత్ ఈ సారి దిష్టిబొమ్మను దహనం చేయనుంది. ఎర్రకోట వద్ద జరుగుతున్న ఉత్సవాల్లో రావణ, కుంభకర్ణ, మేఘనాథ్ ల దిష్టిబొమ్మలను దహనం చేస్తారు. రావణ దహనం పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమం దసరా వేడుకల్లో ఓ సాంప్రదాయంగా వస్తోంది. చెడుపై మంచి విజయానికి గుర్తుగా ఈ వేడుకలను జరుపుతున్నారు. సనాతన ధర్మంపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వివాదం దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో పోలుస్తూ ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ మండిపడింది. దేశంలో మతసామరస్యాన్ని దెబ్బతీసే చర్యగా పరిగణించింది. ఇదీ చదవండి: మొసలితో రైతుల వినూత్న నిరసన.. కేటీఆర్ రియాక్షన్ ఇది..! -
నా కెరీర్ ఖతమన్నారు, ఇప్పటికీ అలాగే రాస్తున్నారు: హీరో
బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం తాజాగా నటించిన యాక్షన్ మూవీ ఎటాక్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో నెగెటివ్ రివ్యూలను, నెగెటివ్ కామెంట్లను తానసలు పట్టించుకోనంటున్నాడు జాన్ అబ్రహం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. 'నా సినిమాల గురించి నెగెటివ్‌గా రాసే వార్తలను నేను పట్టించుకోను. నా ప్రతి సినిమాకు నా కెరీర్ క్లోజ్ అంటూ రాస్తారు. కానీ అలా రాసేవాళ్లలో చాలామంది(పేర్లు చెప్పను) రచయితగా పని ఇప్పించమని వచ్చారు. వారికి నేను చేతనైనంత సాయం చేశాను. అప్పుడు వాళ్లు సారీ చెప్పి, మీ గురించి తెలీక అలా రాశాము. ఆరోజు ఏదో చికాకులో అలా రాసేశాం అని చెప్పేవారు.' 'బహుశా వాళ్లకు వైవాహిక జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. లైఫ్‌లో సంతోషంగా లేకపోవచ్చు, లేదంటే ఉదయాన్నే మూడ్ ఆఫ్ అయి ఉండొచ్చు అని అర్థం చేసుకునేవాడిని. అలాగే రచయితగా అవకాశం ఇప్పించమని వచ్చినప్పుడు నాకు వీలైన సాయం చేసేవాడిని. అందులో కొందరు క్రిటిక్స్ తీరు మార్చుకున్నారు, మరికొందరు ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఇతర ఆర్టిస్టుల మీద పడుతూ వాళ్ల కెరీర్ ఖతమంటూ ఇంకా నెగెటివ్ రివ్యూలు రాస్తూనే ఉన్నారు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: త్వరలో సినిమాల్లో ఎంట్రీ ఇవ్వనున్న అకీరా, స్పందించిన రేణు దేశాయ్ బన్నీకి మెగాస్టార్ క్రేజీ విషెస్, కొద్ది క్షణాల్లోనే వేలల్లో లైక్స్ -
మోదీ బలపడుతున్నారంటే.. కాంగ్రెస్‌దే పాపం
పనాజీ: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ప్రధానమంత్రి మంత్రి నరేంద్ర మోదీ బలపడడానికి కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించారు. కాంగ్రెస్ రాజకీయాల్ని సీరియస్‌గా తీసుకోవడం లేదని, దీంతో మోదీ బలీయమైన శక్తిగా మారుతున్నారని దుయ్యబట్టారు. మోదీకి ప్రచారం చేయడానికి కాంగ్రెస్ ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. మరోవైపు బీజేపీపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాదాగిరిని సహించే ప్రసక్తే లేదని దీదీ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న గోవాలో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న మమతా బెనర్జీ శనివారం విలేకరులతో మాట్లాడారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని రేసులో మీరుంటారా అని విలేకరుల అడిగిన ప్రశ్నకు తాను ఎప్పుడూ ఎల్ఐపీ (లెస్ ఇంపార్టెంట్ పర్సన్)గా , వీధిపోరాటాలు చేసే వ్యక్తిగా ఉండాలనే కోరుకుంటున్నానని చెప్పారు. కాంగ్రెస్ నిర్ణయాలు తీసుకోలేదు: కాంగ్రెస్ పార్టీకి నిర్ణయాలు తీసుకోవడం చేతకావడం లేదని దీంతో దేశం బాధపడే పరిస్థితులు వచ్చాయని మమత వ్యాఖ్యానించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను ఏ మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఆ పార్టీ వల్లే మోదీ మరింత శక్తిమంతంగా ఎదుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బీజేపీకి టీఆర్పీ రేటింగ్లా ఉంది. ఆ పార్టీ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల దేశం బాధపడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగడానికి కాంగ్రెస్‌కు ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ పార్టీ అందిపుచ్చుకోలేదు. ఆ పార్టీ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉంటే దేశం ఎందుకు నష్టపోవాలి’’ అని మమత ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో తమ పార్టీతో జత కట్టే అవకాశాన్ని కాంగ్రెస్ వదులుకొని లెఫ్ట్‌తో చేతులు కలిపిందని, అలా చేయడం వల్ల ఒక్క స్థానంలో కూడా వాళ్లు గెలవలేకపోయారని ఎద్దేవా చేశారు. బీజేపీతో పోరాడడానికి బదులు కాంగ్రెస్ పార్టీ తమతో పెట్టుకుందని, దానికి తగ్గ ఫలితాన్ని చూసిందని మమత వ్యాఖ్యానించారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటేనే రాష్ట్రాలు బాగుంటాయని, అప్పుడే కేంద్ర ప్రభుత్వం కూడా బాగుంటుందని మమత అన్నారు. -
బద్వేలులో టీడీపీ నాయకుడు తీరుపై విమర్శలు
-
ప్లీజ్.. నా సినిమాకు రేటింగ్ ఇవ్వకండి
టాలీవుడ్లో యంగ్ హీరో నాగశౌర్య ఛలో సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం శౌర్య నటించిన కణం చిత్రం రిలీజ్‌కు రెడీకాగా, మరో సినిమా ‘అమ్మమ్మగారి ఇల్లు’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా, ఆ కార్యక్రమంలో శౌర్య క్రిటిక్స్, రివ్యూలు రాసేవారికి విజ్ఞప్తి చేశాడు. ‘అమ్మమ్మ గారి ఇల్లు సినిమా రిలీజ్ అయ్యాక దయచేసి రేటింగ్ పెట్టకండి. ఎందుకంటే అమ్మమ్మ బంధం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ నచ్చాలని మేం తీయలేదు. ఈ సినిమా ఒక్కరికి కనెక్ట్ అయినా.. వారి అనుభూతులు మీరు తెలుసుకోండి. అంతేగానీ దయచేసి రేటింగ్ మాత్రం ఇవ్వకండి. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి’ అంటూ శౌర్య కోరాడు. నాగ శౌర్య, షామిలి(ఓయ్ ఫేమ్) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
నా అభిమానులే మీకు పాఠాలు చెబుతారు
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాజకీయ నాయకులెవ్వరూ తన అభిమానులకు పాఠాలు నేర్పాల్సిన అవసరం లేదని, వారే ఎదుటి వారికి పాఠాలు చెప్పగల నేర్పులని నటుడు రజనీకాంత్ విమర్శకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. చెన్నైలో ప్రజా సంఘాల సమావేశాల్లో ఆయన మాట్లాడారు. 32 ఏళ్ల చరిత్ర కలిగిన అభిమాన సంఘాల నుంచి తమ పార్టీ ఉద్భవిస్తోందని, తాము ఇప్పుడు చేయాల్సిందల్లా వాటిని మరింత బలోపేతం చేయడమేనని అన్నారు. జిల్లాల్లో ఇన్‌చార్జ్‌ల నియామకం పూర్తయ్యాక రాష్ట్ర పర్యటన చేపడతానన్నారు. కమల్ సమర్థుడు.. ఇటీవల పార్టీ స్థాపించిన సహ నటుడు కమల్ హాసన్‌పై రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. కమల్ సమర్థుడని, ఆయన ప్రజల విశ్వాసం చూరగొంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజకీయాల్లోకి రాబోతున్న తనది, కమల్‌ది రెండు వేర్వేరు దారులని, అయినా ఇద్దరి అంతిమ లక్ష్యం ప్రజా సంక్షేమమేనని అన్నారు. -
ప్చ్... ఒక్క ధోనీ తప్ప!
సాక్షి, సినిమా : స్ట్రాంగ్ కంటెంట్‌తో సినిమాలు తెరకెక్కిస్తాడనే పేరు బాలీవుడ్ దర్శకుడు నీరజ్ పాండేకు ఉంది. ముఖ్యంగా దేశభక్తి సందేశం ఆయన చిత్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. 44 ఏళ్ల ఈ బిహార్ బాబు తన పదేళ్ల కెరీర్లో రైటర్‌గా, నిర్మాతగా, డైరెక్టర్‌గా 12 చిత్రాలకు పని చేశాడు. అందులో దర్శకత్వం వహించింది కేవలం ఐదింటికి మాత్రమే. అన్నీ కూడా విమర్శకుల నుంచి ప్రత్యేక ప్రశంసలు అందుకున్నాయి తప్ప కమర్షియల్ గా మాత్రం హిట్లు కాలేకపోతున్నాయి. 2008లో ఎ వెడ్నస్ డే(తెలుగులో కమల్ హీరోగా తెరకెక్కిన ఈనాడు) చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయిన నీరజ్.. తర్వాత ఐదేళ్లకు స్పెషల్ ఛబ్బీస్‌తో పలకరించాడు. తర్వాత వరుసగా బేబీ, ఎంఎస్ ధోనీ:ది అన్‌టోల్డ్ స్టోరీ, తాజాగా అయ్యారీ చిత్రాలతో పలకరించాడు. అయితే ఆసక్తికర కథనాలు, ఎంగేజింగ్ స్క్రీన్‌ప్లే తో సినిమాలు తెరకెక్కిస్తాడన్న పేరున్న ఆయన.. కలెక్షన్ల విషయంలో మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఒక్క ధోనీ బయోపిక్ తప్పించి ఆయన చిత్రాలేవీ వంద కోట్లు దాటలేకపోయాయి. ఏ వెడ్నస్డే చిత్రం ఫుల్ రన్లో రూ. 12 కోట్లు, స్పెషల్ ఛబ్బీస్ రూ. 66.8 కోట్లు, భారీ అంచనాల నడుమ వచ్చిన బేబీ చిత్రం రూ. 95.56 కోట్లు వసూలు చేశాయి. ఒక్క ధోనీ చిత్రం మాత్రం రూ. 133.04 కోట్లు సాధించి నీరజ్ కెరీర్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక ఈ మధ్య రిలీజ్ అయిన అయ్యారీ కూడా వీక్ కలెక్షన్లతోనే ప్రదర్శితమవుతోంది. రెండు రోజులకు గానూ ఈ చిత్రం కేవలం రూ.7.40 కోట్లు వసూలు చేసింది. కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ అది ప్రేక్షకులను మెప్పించటంలో విఫలమైందన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి కంటెంట్ హిట్.. కమర్షియల్ ఫెయిల్యూర్స్‌తో నీరజ్ పాండే జర్నీ సాగుతుదన్నమాట. (ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సౌజన్యంతో...) -
పవన్ జేఎఫ్సీ కొత్తగా ఏం కనిపెట్టింది?
సాక్షి, అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో ముగిసింది. ఈ రెండు రోజుల సమావేశం కొత్తగా ఏమి కనిపెట్టిందో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈనెల 15 లోపు పూర్తి సమాచారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ కనీసం స్పందించకపోగా... కొందరు వ్యక్తుల కోసం తాము సమాచారాన్ని బజార్లో పెట్టబోమని, అసెంబ్లీలో చెబుతామని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు. దీంతో వైబ్సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో దొరికిన సమాచారం ఆధారంగానే నిజనిర్ధారణ జరిగింది. ఏదో ఒక నెపం మీద తిరస్కరిస్తున్న తీరును ప్రశ్నించారే తప్ప దానికి సరైన సాక్ష్యాధారాలను కనిపెట్టలేకపోయారు. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా? అనే దానిపైనా స్పష్టత ఇవ్వలేకపోయారు. దేనివల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందనే దానిపై స్వల్ప చర్చతో సరిపెట్టారు. హోదాతోనే విద్య, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని జనం నెత్తినోరు కొట్టుకుని చెబుతుండగా... దేనివల్ల ఎన్ని నిధులు వస్తాయని చర్చించడం సమంజసంగా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2016 సెప్టెంబర్‌లో, 2017 మార్చిలో సాక్షాత్తు ముఖ్యమంత్రే రెండుసార్లు ప్యాకేజీకి అంగీకరించినందున దాన్నుంచి వెనక్కుపోవడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి కేటాయించిన నిధులెన్నీ, వచ్చినవి ఎన్ని? అనే దానిపైనా సమావేశంలో స్పష్టత కొరవడింది. టీవీ చర్చల్లో, విలేకరుల సమావేశాల్లో చెప్పిన వివరాలే ఈ భేటీకి ప్రాతిపదిక అయితే అర్థం ఏముందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నేతలందరూ ఏకమై ప్రత్యేకహోదా కోసంపోరాడాల్సిన తరుణంలో నిధుల లెక్కలంటూ సమావేశం నిర్వహించడం సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నంలా ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల తరఫున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నేరుగా ప్రశ్నించకుండా జేఎఫ్సీ పేరిట సమావేశాలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శిస్తున్నారు. కమిటీకి కొరవడిన స్పష్టత కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య నాయకత్వంలో కమిటీ మొత్తం 11 అంశాలపై చర్చించినా దేనిపైనా నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేకపోయింది. కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని, మరికొన్నింటిలో కేంద్రానిది తప్పు ఉందని జేఎఫ్సీ కనిపెట్టింది. రూ.16,078 కోట్ల రెవెన్యూ లోటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటే కేంద్రం రూ.4,113 కోట్లు ఇచ్చి మిగతా వాటినన్నింటినీ తిరస్కరించిందని పద్మనాభయ్య తెలిపారు. పెన్షన్ పెంపు, రుణ విమోచన, డిస్కంల నష్టాల సర్దుబాటు, పదో వేతన సంఘం బకాయిలు వంటి వాటికి తాము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పినట్టు వివరించారు. చాలా పథకాలు, కార్యక్రమాలు ఆచరణ సాధ్యం కానివిగా కేంద్రం కొట్టిపారేసిందని, రాష్ట్ర విభజనే వయబులిటీ లేనిదైతే... మెట్రో, పెట్రోకెమికల్ ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి వాటికి ఎలా వయబులిటీ ఉంటుందని కొందరు ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదని సమావేశం అభిప్రాయపడింది. జాతీయ విద్యా సంస్థల వ్యవహారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన తీరులో స్పందించలేదని, వీటి బడ్జెట్ గురించి ఎక్కడా ప్రస్తావనే లేదని సమావేశంలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు. ఈ సంస్థలకు రూ.11 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పటికి కేవలం రూ.500 కోట్లే ఇచ్చినట్టు తమ వద్ద ఉన్న పేపర్లలో ఉన్నట్టు పద్మనాభయ్య తెలిపారు. దుగరాజుపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినా నీతి ఆయోగ్ మోకాలడ్డిందని, కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే జరిగిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదని తోట చంద్రశేఖర్ తదితరులు చెప్పారు. తొలిరోజు భేటీకి హాజరైన సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా నాయకులు, త్రిసభ్య కమిటీ సభ్యుడయిన ఐవైఆర్ కృష్ణారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ రెండో రోజు సమావేశానికి హాజరుకాలేదు. సమాచారం రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిందా?: ఉండవల్లి జేఎఫ్సీ చర్చించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందేనా? అని ఉండవల్లి జనసేన నేతను అడిగారు. జయప్రకాష్ నారాయణ తన సోర్స్ ద్వారా కొంత సంపాదించారని, మరికొంత వేరే మార్గం ద్వారా వచ్చిందని పవన్ బదులిచ్చారు. ‘అయితే మనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ స్పందించలేదన్న మాట’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ’పవన్ ఇంకా ఎన్డీఏ భాగస్వామే. దాన్నుంచి బయటకు వచ్చినట్టు చెప్పలేదు. సమాచారం కావాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ప్రభుత్వాలు స్పందించలేదు’ అని తెలిపారు. ఇద్దరు అధికారుల్ని నియమించారంటూ లీకులు ఈ దశలో పవన్ వద్దకు వచ్చిన జనసేన కార్యకర్త ఒకరు జేఎఫ్సీ కమిటీతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఎఎస్‌లు ప్రేంచంద్రారెడ్డి, ఎస్.బాలసుబ్రమణ్యంలను నియమించదని చెప్పారు. ఇదో శుభ పరిణామమని, ఆ ఇద్దరూ తనతో కాకుండా పద్మనాభయ్య, జయప్రకాశ్ నారాయణ, టి.చంద్రశేఖర్, ఐవైఆర్ కృష్ణారావుతో మాట్లాడమని చెబుతానని పవన్ చెప్పారు. అయితే ఆ ఇద్దరు అధికారులను నియమించినట్టు రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలనే పిలిచామని శుక్రవారం జనసేన వర్గాలు ప్రకటించగా.. వైఎస్సార్ సీపీ, టీడీపీలకు కూడా సమాచారం పంపామని పవన్ శనివారం చెప్పారు. -
అందరికీ థ్యాంక్స్ : హీరో నాని
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నాని తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కించిన సినిమా అ!. ఈ సినిమా ఫిబ్రవరి 16న(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిషో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అటు సినీ అభిమానులు సైతం సినిమా బాగుందంటూ కితాబిచ్చారు. దీంతో నిర్మాత నాని సినిమా విజయవంతం చేసినందుకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై నిర్మాత నానీ కూడ స్పందించారు. ఈ సందర్భంగా సినీ విశ్లేషకులతో పాటు సినీ అభిమానులకు నాని ధన్యవాదాలు తెలిపారు. పలు వెబ్సైట్లు అ! సినిమాకు ఇచ్చిన రేటింగ్ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందరికీ థ్యాంక్స్ అంటూ తన వాల్‌పై రాసుకొచ్చాడు. ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయం అయ్యారు. కొత్త తరహ కథ కావడంతో 'అ!' సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. -
హాట్ టాపిక్‌గా తారక్ కామెంట్స్!
సాక్షి, హైదరాబాద్: 'జై లవ కుశ' విజయోత్సవంలో వేడి రాజుకుంది. సినీ విమర్శకులు వ్యవహరిస్తున్న తీరుపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ మండిపడ్డాడు. కష్టపడి తెరకెక్కిస్తున్న చిత్రాలకు కొందరు విమర్శకులు నెగిటివ్ సమీక్షలు ఇస్తున్నారని చెప్పాడు. తారక్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. బాబీ దర్శకత్వంలో వచ్చిన 'జై లవ కుశ' చిత్రంలో జూనియర్ మూడు పాత్రల్లో నటించాడు. బాక్సాఫీస్ దగ్గర బంపర్ ఓపెనింగ్స్ అందుకున్న ఈ చిత్రానికి క్రిటిక్స్ బిలో యావరేజ్ రేటింగ్స్ తో సరిపెట్టారు. ఇలా నెగిటీవ్ రివ్యూలు ఇవ్వడంతో తారక్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. 'జై లవ కుశ' విజయోత్సవంలో తారక్ మాట్లాడుతూ.. 'హాస్పటల్లో మన కుటుంబసభ్యులెవరైనా క్రిటికల్ కండిషన్‌తో ఎమర్జెన్సీ వార్డులో ఉంటే.. డాక్టర్లు ఏం చెబుతారో? మనం ఆశలు పెట్టుకోవచ్చో? లేదో? అని ఎదురు చూస్తుంటాం. టెస్టులు చేసిన తర్వాత చెబుతామని ఎన్నో ఏళ్లు అనుభవం గల, చదువుకున్నటువంటి డాక్టర్లు చెబుతారు. ఈలోపు దారినపోయే దానయ్యలు కొందరు అన్నీ తెలిసినట్టే ‘బతకడు. పోతాడు’ అంటుంటారు. భయంలో ఉన్న మనకు ధైర్యాన్ని ఇవ్వకపోగా... చావు బతుకుల మధ్య ఉన్నోణ్ణి చంపేయడం, వాడి మీద ఆశలు పెట్టుకున్నోణ్ణి ఇంకా చంపేసేయడం... ఇటీవల ఇలాంటి ప్రక్రియ మన తెలుగు ఇండస్ట్రీలో మొదలైంది. విడుదలైన సిన్మా ఎమర్జెన్సీ వార్డులో ఉన్న పేషెంట్ లాంటిది. పేషెంట్ బతుకుతాడా? లేదా? అనుకునే చుట్టాలు మేము (సిన్మా టీమ్). ప్రేక్షకులు డాక్టర్లు. విశ్లేషకులు దారినపోయే దానయ్యలు. పేషెంట్ చచ్చిపోయాడని వాళ్లు (ప్రేక్షకులు) చెబితే ఓకే. ఆశలు వదిలేసి, ఒప్పేసుకుంటాం. కానీ, ఆ క్లారిటీ రాకుండా... ముందే పోయాడనో! అదనో! ఇదనో! ఎందుకు? డాక్టర్లను చెప్పనివ్వండి. ఎమర్జెన్సీ వార్డుకి ఇంకొకణ్ణి తెచ్చుకుంటాం. మాకే కాదు, అందరికీ జరుగుతున్నటువంటి ప్రక్రియ ఇది. దయచేసి... ఒక సిన్మా వచ్చినప్పుడు ప్రేక్షకుల్ని స్పందించనివ్వండి. అఫ్కోర్స్... 101 శాతం మనందరికీ వాక్ స్వాతంత్య్రం ఉంది. కానీ, మనం మాట్లాడే ఒక మాట అవతలి వ్యక్తికి ఉన్నటువంటి ఆశను ఎంత దిగజారుస్తుందో ఒక్కసారి ఆలోచించండి. నా మాటల్లో తప్పులుంటే క్షమించండి! అర్థం లేకుంటే వదిలేయండి. నా బాధను మీ అందరికీ ఒక్కసారి వెల్లడిద్దామనుకున్నా’’ అంటూ ఎన్టీఆర్ ఆవేదనగా పేర్కొన్నాడు. ‘‘ఎమర్జెన్సీ వార్డుకి వచ్చిన మా పేషెంట్ ‘జై లవకుశ’ హెల్త్ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన మా డాక్టర్లందరికీ ధన్యవాదాలు’’ అంటూ ఆయన ముగించాడు. ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు టాలీవుడ్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఎన్టీఆర్ ఎందుకింత ఎమోషనల్‌గా స్పందించారు? ఆయనను బాధపరిచిన నెగిటివ్ రివ్యూలేమిటి? అన్నది చర్చనీయాంశమైంది. -
హాట్ టాపిక్‌గా తారక్ కామెంట్స్!
-
మీ పని చూసుకోండి!
విమర్శకులకు మయంతి ఘాటు జవాబు బెంగళూరు: ఒక ఆటగాడు విఫలమైనప్పుడు అతడిని కాకుండా ‘దురభిమానులు’ అతడి వెనుక ఉన్న అమ్మాయిని సోషల్ మీడియాలో ఆడిపోసుకోవడం ఇటీవల తరచూ కనిపిస్తోంది. కోహ్లి బాగా ఆడని రోజు అనుష్క శర్మపై అంతా విరుచుకు పడ్డారు. ఇప్పుడు స్టువర్ట్ బిన్నీ వైఫల్యంపై అతని భార్య మయంతి లంగర్‌కు ఇదే అనుభవం ఎదురైంది. విండీస్‌తో జరిగిన తొలి టి20లో ఒకే ఓవర్లో స్టువర్ట్ 32 పరుగులిచ్చిన తర్వాత ఇది మొదలైంది. గతంలో కూడా మయంతి అందచందాలపై చాలా మంది పలు వ్యాఖ్యలు చేసినా... ట్విట్టర్లో ఈ సారి బిన్నీ ఆటకు ఆమెను బాధ్యులను చేయడం మయంతికి ఆగ్రహం తెప్పించింది. ఏం చేసి అతడిని భారత జట్టులో ఉంచుతున్నావని కొందరంటే, వెంటనే విడాకులు తీసుకొమ్మని ఇంకొందరు వ్యాఖ్యానించారు. అసలు ఆత్మహత్య చేసుకోలేకపోయావా అని కూడా మయంతిని అడిగేశారు! చివరకు దీనిపై మయంతి స్పందించింది. ‘ఆత్మహత్య చేసుకోమని చెప్పడం చూస్తే సిగ్గుగా అనిపిస్తోంది. విడాకుల గురించి మాట్లాడుతున్నారు. మీ జీవితంలో అలాంటిది జరగకుండా మీకు తగిన ప్రేమాభిమానాలు దక్కాలని కోరుకుంటున్నా. మమ్మల్ని విమర్శించడంలో మీకు చాలా ఆనందం లభిస్తుందని అనిపిస్తోంది. నేను 18 ఏళ్ల వయసునుంచి సంపాదిస్తున్నాను. డబ్బు కోసం బిన్నీని చేసుకున్నానని అనే బదులు వెళ్లి ఒక మంచి ఉద్యోగం చూసుకోండి. మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది’ అని లంగర్ సమాధానం ఇచ్చింది. -
'అసలు నన్నెందుకు టార్గెట్ చేస్తున్నారు'
ఆగ్రా: మథుర అల్లర్ల విషయంలో తాను చేసిన వ్యాఖ్యలను అనవసరంగా రాద్ధాంతం చేశారని బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ హేమ మాలిని అన్నారు. 'మీడియాతో సహా ప్రతి ఒక్కరూ ఎలాంటి నిజనిజాలు తెలుసుకోకుండా తన చిత్తశుద్ధిని శంకిస్తున్నారు. నన్ను టార్గెట్ చేసుకున్నారు. ఘర్షణలకు సంబంధించిన సమాచారం నాకు తెలియగానే వెళ్లి అధికారులను కలిశాను. అలాగే, బాధితులను కూడా పరామర్శించాను. అక్రమంగా కొందరు వ్యక్తులు స్వాధీనం చేసుకున్న క్వార్టర్స్ విషయంలో చర్యలు తీసుకోవాలని నేను రెండు నెలల కిందట మధుర జిల్లా మెజిస్ట్రేట్ రాజేశ్ కుమార్‌ను కలిసి చెప్పాను. ఈ విషయంలో ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, అధికారులు విఫలమైనట్లే. ఇలాంటి ఘటన జరగడం దురదృష్టం' అని ఆమె చెప్పారు. జరుగుతున్న హింసను, బాధిత ప్రజల గురించి సమాచారం అందజేయకుండా వాళ్లు(మీడియా-సోషల్ మీడియా) తనను టార్గెట్ చేసుకున్నారని విమర్శించారు. మీడియా ఇలాంటి ఘటనల వెనుక నిజనిజాలు కచ్చితంగా తెలుసుకోవాలని, కానీ, అలా తెలుసుకునే ప్రయత్నం చేయకుండా తనను టార్గెట్ చేయడం సబబుకాదన్నారు. తాను మథుర, బృందావనంకోసం ఎంతో పనిచేస్తున్నానని, అక్కడే ఎక్కువ సమయం గడుపుతున్నానని చెప్పారు. -
మోదీ అధ్యక్ష తరహా పాలన చేస్తున్నారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నీ తానై అధ్యక్ష తరహా ప్రభుత్వాన్ని నడుపుతున్నారని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ బహిషృత నేత అరుణ్ శౌరీ ధ్వజమెత్తారు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం నగదు లేకున్నా చెక్కు జారీ చేసే విధానాలను అవలంభింస్తుందని ఎద్దేవా చేశారు. మోదీ నాయకత్వంలో రాబోయే మూడేళ్లలో ప్రభుత్వం ఎలా ఉండబోతోంది అన్నప్రశ్నకు సమాధానంగా శౌరీ స్పందిస్తూ... పకడ్బందీగా పౌరులపై దాడులు చేయడానికి, పరిపాలనను వికేంద్రీకరించి భయపెట్టడానికి,అసమ్మతి వర్గాల గొంతులు నులిమేయనున్నారని మోదీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మోదీని నియంతృత్వంలోఇందిరాగాంధీ, జయలలితలతో పోల్చారు.అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పట్టించుకోవడం లేదని వారిని 'టిష్యు పేరర్' లాగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి పశ్చాత్తాపం చెందే రోజు ఎంతో దూరంలో లేదన్నారు. -
విమర్శకులకు సమాధానమిదే!
న్యూఢిల్లీ: తన పని అయిపోయిందని వస్తున్న విమర్శలకు ఫుల్స్టాప్ పెట్టాలంటే గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలాంటి విజయం చాలా అవసరమని భారత టాప్ షట్లర్ పారుపల్లి కశ్యప్ అన్నాడు. సయ్యద్ మోడి గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్‌ను గెలవడం చాలా సంతోషాన్నిస్తోందన్నాడు. ‘సీజన్‌ను ఆరంభించడానికి ఇంతకంటే మంచిది లేదు. మలేసియా, సయ్యద్ మోడి ఈవెంట్లలో బాగా ఆడాలని నవంబర్లోనే అనుకున్నా. అయితే మలేసియాలో ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగాను. లక్కీగా ఇక్కడ మాత్రం టైటిల్‌ను నెగ్గా. ఈ టోర్నీలో రాణించాననే అనుకుంటున్నా. గతేడాది శ్రీకాంత్ చాలా మెరుగ్గా ఆడాడు. ఒక్కసారిగా నాలుగో ర్యాంక్‌లోకి దూసుకురావడంతో ఇక అందరూ నా పని అయిపోయిందని విమర్శలు మొదలుపెట్టారు. ఈ టోర్నీని మొదలుపెట్టినప్పుడు చాలా మంది నేను ఫామ్‌లో లేనని భావించారు. నిరుడు బాగా ఆడలేదు. కాబట్టి ఈసారి కూడా కష్టమేనని వ్యాఖ్యానాలు చేశారు. అయితే కామన్వెల్త్ గేమ్స్ తర్వాత నా కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో ఉన్నా. మూడు టోర్నీల్లో రెండింటిలో క్వార్టర్ ఫైనల్స్, ఒకదాంట్లో సెమీస్‌కు చేరా. కాకపోతే శ్రీకాంత్‌కు అన్నీ కలిసొచ్చి అద్భుతంగా ఆడాడు. దీంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ఈ దశలో నాకు ఈ విజయం చాలా ముఖ్యం’ అని కశ్యప్ పేర్కొన్నాడు. ఆందోళన కలిగిస్తోంది... టైటిల్ గెలవడం ఆనందాన్ని కలిగించినా... మ్యాచ్ మధ్యలో పొత్తి కడుపు కండరం చిరిగిపోవడం కాస్త ఆందోళన కలిగిస్తోందని కశ్యప్ వెల్లడించాడు. ‘నా పొత్తి కడుపు కండరంలో చిన్న చీలిక వచ్చింది. ప్రస్తుతం దాని పరిస్థితి ఎలా ఉందో తెలియదు. హైదరాబాద్‌లో మంచి ఫిజియోలు లేరు. ముంబై వెళ్లి పరీక్షించుకోవాలి. గాయంపై కాస్త ఆందోళనతో ఉన్నా. అయితే నేను తర్వాత ఆడబోయే టోర్నీ ఆల్ ఇంగ్లండ్ కాబట్టి చికిత్స తీసుకోవడానికి అవసరమైన సమయం ఉంది. టోర్నీ సమయానికి కోలుకుంటా’ అని ఈ హైదరాబాదీ వ్యాఖ్యానించాడు. శ్రీకాంత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడుతూ... ‘మంచి ఫామ్‌లో ఉన్నాడు. పోటీ బాగా ఇచ్చాడు. ఫలితం ఇలాగే ఉంటుందని ముందే ఊహించా. గురుసాయిదత్, ఇతర ఆటగాళ్లతో పోటీపడ్డాను. కానీ ఏడాది కాలంగా శ్రీకాంత్‌తో తలపడలేదు. మళ్లీ చైనా, హాంకాంగ్ టోర్నీల్లో ఎదురవొచ్చు. ఇది ఒలింపిక్స్ అర్హత ఏడాది కావడంతో షట్లర్లందరికీ చాలా ముఖ్యమైంది. ర్యాంకింగ్‌పై కాకుండా టోర్నీలు గెలవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టా’ అని కశ్యప్ వివరించాడు. -
విమర్శలను గౌరవిస్తా: కృష్ణవంశీ
చెన్నై: తన సినిమాలపై వచ్చే విమర్శలను గౌరవిస్తానని క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ అన్నారు. ప్రేక్షకులు విమర్శలు పట్టించుకోరని, వారికి నచ్చితే సినిమా చూస్తారని చెప్పారు. తాను తెరకెక్కించిన 'గోవిందుడు అందరివాడేలే' సినిమా విజయవంతం కావడం పట్ల ఆయన సంతోషంగా ఉన్నారు. ఈ సినిమాకు వస్తున్న స్పందన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా తీశానని కృష్ణవంశీ చెప్పారు. యాక్షన్ హీరో రామ్‌చరణ్ ను కుటుంబ కథా చిత్రంలో ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారోనని ముందు కొంచెం భయపడ్డానని వెల్లడించారు. కొత్త అవతారంలో రామ్‌చరణ్ ను ప్రేక్షకులు ఆదరించడంతో తన అనుమానాలు పటాపంచలయ్యాయని చెప్పారు.