హీరో నాగ శౌర్య
టాలీవుడ్‌లో యంగ్ హీరో నాగశౌర్య ఛలో సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం శౌర్య నటించిన కణం చిత్రం రిలీజ్‌కు రెడీకాగా, మరో సినిమా ‘అమ్మమ్మగారి ఇల్లు’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా, ఆ కార్యక్రమంలో శౌర్య క్రిటిక్స్, రివ్యూలు రాసేవారికి విజ్ఞప్తి చేశాడు.
‘అమ్మమ్మ గారి ఇల్లు సినిమా రిలీజ్ అయ్యాక దయచేసి రేటింగ్ పెట్టకండి. ఎందుకంటే అమ్మమ్మ బంధం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ నచ్చాలని మేం తీయలేదు. ఈ సినిమా ఒక్కరికి కనెక్ట్ అయినా.. వారి అనుభూతులు మీరు తెలుసుకోండి. అంతేగానీ దయచేసి రేటింగ్ మాత్రం ఇవ్వకండి. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి’ అంటూ శౌర్య కోరాడు.
నాగ శౌర్య, షామిలి(ఓయ్ ఫేమ్) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment