review rates
-
12 వారాలు న్యూస్ ఛానెల్స్ రేటింగ్ నిలిపివేత
సాక్షి, న్యూఢిల్లీ: హిందీ, ఇంగ్లీష్, ప్రాంతీయ న్యూస్ ఛానెల్స్‌తో పాటు బిజినెస్ న్యూస్ ఛానెల్‌ల వ్యూయర్షిప్ రేటింగ్‌ను ఎప్పటికప్పుడు విడుదల చేసే బ్రాడ్కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బార్క్) సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా న్యూస్ ఛానెల్‌ల వ్యూయరిషిప్ రేటింగ్‌ను పన్నెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. దీంతో ఈ వారం విడుదల చేయాల్సిన న్యూస్ ఛానెల్‌ల వ్యక్తిగత రేటింగ్‌ను బార్క్ ప్రకటించడం లేదని తెలిపింది. బార్క్ తన ప్రకటనలో.. ‘ప్రస్తుతం టెలివిజన్, న్యూస్ ఛానెల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు సంకేతిక లోపాల దృష్ట్యా బార్క్ బోర్డు, సాంకెతిక మండలిని(టెక్ కమిటీని) సంప్రదించినట్లు చెప్పింది. ఈ టెక్ కామ్ రోజువారి ఛానెల్ సముచిత డేటాను ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ.. ప్రస్తుత బ్రాడ్‌కాస్టింగ్ ప్రమాణాల నివేధికను పరీక్షిస్తుంది. రేటింగ్ గణాంకాలను మెరుగుపరచడంతో పాటు . ప్యానెల్ గృహాలలోకి చొరబడే సంభావ్యత ప్రయత్నాలను కూడా గణనీయంగా దెబ్బతీస్తుంది’ అని పేర్కొంది. అయితే టెక్కామ్ పర్యవేక్షలో జరిపే ప్రయోగానికి 8 నుంచి 12 వారాల సమయం పడుతుందని, ఈ నేపథ్యంలో టీవీ, న్యూస్ ఛానెల్‌ల రేటింగ్‌ను 12 వారాల నిలిపివేస్తున్నట్లు బార్క్ తన ప్రకటనలో వివరించింది. (చదవండి: లవ్ జిహాద్: వివాహాలపై వివాదాస్పద నిర్ణయం) అలాగే వార్తా ప్రాసారకులకు ప్రాతినిధ్యం వహించే న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌ర్స్ అసోసియేషన్(ఎన్బీఏ) కూడా బార్క్ నిర్ణయాన్ని స్వాగతించింది. ఈ సస్పెన్స్ ఖచ్చితమైన రేటింగ్‌కు ఇచ్చేందుకు సరైన మార్గంగా ఎన్బీఏ ప్రెసిడెంట్ రజత్ శర్మ అన్నారు. ఆయన ఓ ప్రకటన విడుదల చేస్తూ.. ఇటివల బ్రాడ్‌స్టింగ్ రేటింగ్స్‌ను ఎప్పటికప్పుడు వెల్లడించే క్రమంలో రేటింగ్ ఎజేన్సీకి, ప్రసార వార్త మాధ్యమాలకు అపఖ్యాతిని తెచ్చిపెట్టింది. రేటింగ్ డేటాలో హెచ్చుతగ్గులు ఊహించని విధంగా చోటుచేసుకున్నాయన్నారు. అసలు భారత ప్రజలు ఏం చూస్తున్నారో దానిపై ఖచ్చితమైన రేటింగ్ ఇవ్వడంలో కూడా తప్పుడు కథనాలు వచ్చాయన్నారు. అలాగే జర్నలిస్టులపై, జర్నలీజం ఆదర్శాలకు విరుద్ధంగా పనిచేసే సంపాదకియ కాల్స్ తీసుకోవడంలో కూడా తమ సభ్యులపై ఒత్తిడి తెచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకే బార్క్ ఈ నిర్ణయం తీసుకుందని, వార్తా ఛానెల్‌ల రేటింగ్లను, కంటెంటెంట్‌ను మెరుగుపరచడం కోసమే బార్క్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. (చదవండి: మహా గవర్నర్ రీకాల్‌కు సేన డిమాండ్) -
ప్లీజ్.. నా సినిమాకు రేటింగ్ ఇవ్వకండి
టాలీవుడ్లో యంగ్ హీరో నాగశౌర్య ఛలో సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం శౌర్య నటించిన కణం చిత్రం రిలీజ్‌కు రెడీకాగా, మరో సినిమా ‘అమ్మమ్మగారి ఇల్లు’ షూటింగ్ తుది దశకు చేరుకుంది. తాజాగా ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ జరగ్గా, ఆ కార్యక్రమంలో శౌర్య క్రిటిక్స్, రివ్యూలు రాసేవారికి విజ్ఞప్తి చేశాడు. ‘అమ్మమ్మ గారి ఇల్లు సినిమా రిలీజ్ అయ్యాక దయచేసి రేటింగ్ పెట్టకండి. ఎందుకంటే అమ్మమ్మ బంధం నేపథ్యంలో రూపొందించారు. ఈ సినిమా ప్రతీ ఒక్కరికీ నచ్చాలని మేం తీయలేదు. ఈ సినిమా ఒక్కరికి కనెక్ట్ అయినా.. వారి అనుభూతులు మీరు తెలుసుకోండి. అంతేగానీ దయచేసి రేటింగ్ మాత్రం ఇవ్వకండి. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి’ అంటూ శౌర్య కోరాడు. నాగ శౌర్య, షామిలి(ఓయ్ ఫేమ్) జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సుందర్ సూర్య దర్శకత్వం వహించాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
జూన్11న జీఎస్టీ కౌన్సిల్ తుది భేటీ
న్యూఢిల్లీ: జూలై 1వ తేదీ నుంచి ప్రతిష్టాత్మక జీఎస్టీ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మరోసారి పునరుద్ఘాటించారు. ఈ మేరకు జీఎస్టీ కౌన్సిల్ తుది సమావేశం జూన్ 11న తేదీన నిర్వహించనున్నట్టు శుక్రవారం చెప్పారు. బహుశా ఇది చివరి భేటీ అవుతుందన్నారు. పలు వర్గాల నుంచి వచ్చిన సూచనలు, అసంతృప్తులను దృష్టిలో ఉంచుకుని ఆదివారం జరిగే కౌన్సిల్ సమావేశంలో సమీక్షించనున్నట్టు తెలిపారు. జూన్ 3వ తేదీన జరిగిన 15వ సమావేశంలో సభ్యులు సూచించిన సవరణలు, జీఎస్టీ డ్రాఫ్ట్ రూల్స్, రేటు సవరణలను 16వ సమావేశంలో ప్రధానంగా చర్చించి అంగీకారం తెలపనున్నట్లు చెప్పారు. దీంతో పాటు వివిధ పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన వినతులపై కూడా కౌన్సిల్ చర్చిస్తుందన్నారు. మరోవైపు తమపై విధించిన జీఎస్టీ రేటుపై సమీక్షించాల్సిందిగా ఆటో పరిశ్రమ వర్గాలు డిమాండ్ చేశాయి. మధ్యశ్రేణి నుంచి లార్జ్ సైజ్ హైబ్రిడ్ కార్లపై విధించే 43 శాతం పన్నును సమీక్షించాల్సిందిగా కోరాయి. ఈ పన్ను రేటు ప్రస్తుతం 30.3 శాతంగా ఉంది. అదేవిధంగా టెలికాం సెక్టార్ సైతం తమపై 18 శాతంగా ఉన్న పన్నును సమీక్షించాల్సిందిగా కోరింది. అలాగే సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా( సీవోఏఐ ) కూడా ఇప్పటికే రెవెన్యూ సెక్రటరీకి ఈ మేరకు ఓ లేఖ కూడా రాసింది. ఐటీ హార్డ్‌వేర్ పరిశ్రమ సైతం ఐటీ ఉత్పత్తులు మానిటర్లు, ప్రింటర్లులాంటి కొన్ని అంశాలకు ప్రతిపాదించిన 28 శాతం బదులుగా ఏకరూప పన్ను విధానం తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. కాగా జీఎస్టీ కౌన్సిల్ ఇప్పటికే దాదాపు అన్ని వస్తు, సేవలపై పన్నులను నిర్ణయించింది. వివిధ రకాల వస్తువులపై 5, 12, 18, 28 శాతంగా పన్నులను ఖరారు చేసింది. విలువైన లోహాలు, బంగారు నాణేలు , అనుకరణ ఆభరణాలు, బంగారంపై 3శాతం శ్లాబ్‌ను నిర్ణయించింది. ముడి డైమండ్లపై 0.25శాతం పన్ను రేటును విధించిన విషయం తెలిసిందే.