
గురువు బాటలో నడుస్తున్నాడు
గత ఏడాది గోవిందుడు అందరివాడేలే సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్న కృష్ణవంశీ, ఆ తర్వాత ఇంతవరకు సినిమా మొదలు పెట్టలేదు. చాలా రోజులుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న కృష్ణవంశీ.. గోవిందుడు సినిమాతో మంచి విజయం సాధించినా గత వైభవాన్ని మాత్రం సాధించలేకపోయాడు. దీంతో లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్ తాజాగా మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. తన గురువు రామ్గోపాల్వర్మ స్టైల్లో ఓ హార్రర్ సినిమా చేయాడానికి ప్లాన్ చేస్తున్నాడు కృష్ణవంశీ.
ఇప్పటివరకు రొమాంటిక్ ఎంటర్టైనర్స్, పేట్రియాటిక్ ఫిలింస్ మాత్రమే చేసిన కృష్ణవంశీ తొలిసారిగా ఓ డిఫరెంట్ మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. సక్సెస్ఫుల్ నిర్మాత దిల్రాజు బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా, టాలీవుడ్ లో ఎక్కువ విజయాలు సాధించిన హారర్ మూవీగా తెరకెక్కించనున్నాడు. ప్రస్తుతం కథాచర్చల దశలోనే ఉన్న ఈ సినిమా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.