Gulabi Movie Actress Maheswari Latest Photos Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

అప్పట్లో క్యూ కట్టేవారు.. ఇప్పుడు కనీసం గుర్తు పట్టడం లేదు..!

Published Tue, Nov 29 2022 7:06 PM | Last Updated on Tue, Nov 29 2022 8:35 PM

Gulabi Movie Actress Maheswari Pics Goes Viral On Social Media - Sakshi

ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్రేజ్ అంతా సులభంగా రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. అలా చాలామంది కెరీర్‌ను మధ్యలోనే ఆపేసిన కథానాయికలు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన టాలీవుడ్‌ స్టార్‌ నటీమణులు ఎందరో ఉ‍న్నారు. తాజాగా అలా కనిపించకుండా పోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.

అప్పట్లో తన గులాబీ చూపులతో బంధించిన కథానాయిక మహేశ్వరి మీకు గుర్తున్నారా?. ప్రస్తుతం ఆమెను చూస్తే గుర్తు పడతారా? ఇటీవల బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌తో ఆమె ఫోటో దిగింది. కానీ ఆ ఫోటోలో అందరూ జాన్వీ చూశారే తప్ప.. పక్కన ఉన్న హీరోయిన్‌ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది.

 మహేశ్వరి.. అంటే నేటి యువతకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ అదే గులాబీ సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది భామ. అమ్మాయి కాపురం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత వచ్చిన ‘గులాబీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించింది. రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఆ సినిమా అప్పట్లో భారీ హిట్‌గా నిలిచింది.

ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన చిత్రంలో మహేశ్వరి జంటగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మజీ, బెనర్జీ, జీవ, చంద్రమోహన్, చలపతిరావు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ఇండస్ట్రీలో పలు రికార్డులను తిరగరాసింది. గులాబీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో  మహేశ్వరికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. వడ్డే నవీన్‌తో పెళ్లి, జేడీ చక్రవర్తితో దెయ్యం, మృగం లాంటి సినిమాల్లో నటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement