maheswari
-
బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్
అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళా ఆరాటపడుతుంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. బుల్లితెర నటి మహేశ్వరి గతంలోనే పండంటి కూతురికి జన్మనిచ్చి తల్లయింది. గతేడాది ఆమె మరోసారి గర్భం దాల్చగా ఇటీవలే బాబు పుట్టాడు. దీంతో ఆ నటి ఇంట సంతోషం అంతా ఇంతా కాదు.యూట్యూబ్‌లో వరుస వీడియోలుఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ యూట్యూబ్‌లో వరుస వీడియోలు చేస్తోంది. డెలివరీకి ముందు రోజు, డెలివరీ రోజు, ఆ తర్వాత బాబును చూడటానికి వచ్చిన తారల సందడి.. ఇలా అన్నీ వీడియోల రూపంలో షేర్ చేస్తోంది. తాజాగా మహేశ్వరి ఇంట బాబు బారసాల ఫంక్షన్ జరిగినట్లు తెలుస్తోంది.బారసాలతొలిసారి బాబును ఊయలలో వేశారు. ఈ ఫంక్షన్లో మహేశ్వరి దంపతులిద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిశారు. బాబు ఊయల ఫంక్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాబుకు ఏం పేరు పెట్టాడన్నది మాత్రం తెలియరాలేదు. మహేశ్వరి విషయానికి వస్తే.. వదినమ్మ, శశిరేఖ పరిణయం సహా ఎన్నో సీరియల్స్‌లో నటించింది. సీరియల్స్తోకేవలం సీరియల్స్‌కే పరిమితం కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు రియాలిటీ షోలలోనూ కనిపించింది. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 వంటి షోలలో భర్త శివనాగ్తో కలిసి పాల్గొంది. శివనాగ్ టాలీవుడ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు.చదవండి: ఆ స్టార్ హీరో నాకోసం వెయిట్ చేశాడు.. అదే నా మెట్టినిల్లు! -
Maheshwari: వైభవంగా బుల్లితెర నటి సీమంతం (ఫోటోలు)
-
సీరియల్ నటి సీమంతం.. ఇది రెండోసారి!
బుల్లితెర నటి మహేశ్వరి త్వరలో రెండోసారి తల్లి కాబోతోంది. ఇప్పటికే మెటర్నటీ ఫోటోషూట్లతో తెగ సందడి చేసింది. భర్త, కూతురితో కలిసి బేబీబంప్‌తో ఫోటోలకు ఫోజిచ్చింది. ఆ హంగామా అంతా ఎలా జరిగిందో కూడా వివరిస్తూ యూట్యూబ్‌లో వీడియోలు చేసింది. భార్య అంటే పంచప్రాణాలైన శివ తనకు జీవితాంతం గుర్తుండిపోయేట్లు గత నెలలో పెద్ద సర్ప్రైజ్ ఇచ్చాడు. మరోసారి సీమంతం మహేశ్వరికి మాటైనా చెప్పకుండా అన్నీ అరేంజ్ చేసి సీమంతం చేశాడు. ఇప్పుడు మరోసారి ఆమె సీమంతం జరిగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించారు. ఈ ఫంక్షన్‌కు సంబంధించిన ఫోటోలను నటి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. నీలిరంగు చీరలో నిండా నగలు వేసుకుని ప్రెగ్నెన్సీ గ్లోతో మెరిసిపోతోంది మహేశ్వరి. ఫ్యాన్స్ విషెస్ ఈ ఫోటోలు చూసిన అభిమానులు మహేశ్వరి దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా మహేశ్వరి.. వదినమ్మ, శశిరేఖ పరిణయం వంటి పలు సీరియల్స్‌లో నటించింది. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 అనే రియాలిటీ షోలలో తన భర్త శివనాగ్తో కలిసి పార్టిసిపేట్ చేసింది. వీరికి హరిణి అనే కూతురు ఉంది. చదవండి: మా వాడిని చూసి భయపడుతున్నారా.. ? విజయ్ మేనమామ కామెంట్లు వైరల్ -
ఈమె ఒకప్పటి తెలుగు హీరోయిన్.. ఇప్పుడేమో ఫ్యాషన్ డిజైనర్.. గుర్తుపట్టారా?
ఈమె తెలుగు హీరోయిన్. మంచి మంచి హిట్ సినిమాలు చేసింది. జస్ట్ ఐదేళ్లలో ఏకంగా 30 సినిమాలు చేసింది. కానీ ఏమైందో ఏమో సడన్‌గా యాక్టింగ్ కెరీర్‌కి టాటా చెప్పేసింది. అయితే ఈమె పేరు చెబితే కొన్ని మూవీస్ గుర్తొస్తాయి. అలానే ఓ స్టార్ హీరోయిన్ కూడా గుర్తొస్తుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ పేరు మహేశ్వరి. గుర్తొచ్చిందా? అవును మీరనుకున్న బ్యూటీనే. అతిలోక సుందరి శ్రీదేవికి ఈమె బంధువు అవుతుంది. అంటే ఈమె.. శ్రీదేవి అక్కకు పుట్టిన కూతురు. చెన్నైలో పుట్టి పెరిగిన మహేశ్వరి.. 1994లో ఇండస్ట్రీలోకి వచ్చింది. తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆ తర్వాత చాలావరకు తెలుగు చిత్రాలే చేసింది. ఈమె చేసిన వాటిలో 'పెళ్లి', గులాబీ, దెయ్యం లాంటి హిట్ సినిమాలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఎందుకో అకస్మాత్తుగా నటన పూర్తిగా పక్కనబెట్టేసింది. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) 1994-2000 వరకు దాదాపు 30కి పైగా సినిమాలు చేసిన మహేశ్వరి.. యాక్టింగ్ పక్కనబెట్టేసిన తర్వాత కొన్నాళ్లు ఖాళీగా ఉంది. అలా 2008లో గుంటూరుకు చెందిన జయకృష్ణ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక 2010లో సీరియల్ యాక్టర్‌గా కెరీర్ షురూ చేసింది. ఓ నాలుగేళ్లు బుల్లితెరపై పలు సీరియల్స్ చేసిన తర్వాత దాన్ని కూడా పక్కనబెట్టేసింది. ఇక ఈ మధ్య కాలంలో పలు షోలు, ఇంటర్వ్యూల్లో కనిపిస్తూ వస్తోంది. ప్రస్తుతం మహేశ్వరి.. ఫ్యాషన్ డిజైనర్‌గా డిఫరెంట్ కెరీర్‌ని ఎంచుకుంది. హైదరాబాద్‌లో ఈమెకు ఓ స్టోర్ కూడా ఉంది. ఈ మధ్య కాలంలో జాన్వీ కపూర్‌తో మహేశ్వరి అప్పుడప్పుడు కనిపిస్తోంది. వరసకు వీళ్లిద్దరూ అక్కాచెల్లెళ్లు అవుతారు. కానీ మహేశ్వరి ఒకప్పుడు హీరోయిన్ కాగా.. జాన్వీ మాత్రం ఇప్పుడిప్పుడే కథానాయికగా గుర్తింపు తెచ్చుకునే పనిలో ఉంది. (ఇదీ చదవండి: ఎక్స్పోజింగ్ పాత్రలు ఆయన వల్లే చేశా.. బయటకు రాలేకపోయా: మీనా) View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
మహేశ్వరితో కలిసి జాన్వీ కపూర్ తిరుమలను సందర్శించారు
-
Janhvi Kapoor: హీరోయిన్ మహేశ్వరితో కలిసి స్వామివారిని దర్శించుకున్న దేవర బ్యూటీ (ఫోటోలు)
-
అగ్రహీరోలతో అలరించిన మహేశ్వరి .. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
అప్పటి తెలుగు సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు మహేశ్వరి. అప్పట్లో పలు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. ఇప్పటి సినీ ప్రేక్షకులకు ఆమె పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 35 చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులో పెళ్లి చిత్రంలో హీరోయిన్గా ఆకట్టుకుంది. అయితే మహేశ్వరి తెలుగులో అమ్మాయి కాపురం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. పెళ్లి సినిమాతోనే మహేశ్వరికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రవి తేజతో కలిసి జంటగా నటించిన నీకోసం చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది. గులాబీ సినిమా ఆమెకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అయితే 2008లో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవికి బంధువైన మహేశ్వరి ఇప్పుడేలా ఉంది? ఏం చేస్తోందో తెలుసుకుందాం. తమిళంలో ఎంట్రీ ఉల్లాసం అనే తమిళ చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించింది. ఆమె తమిళంలో అజిత్, విక్రం వంటి అగ్ర నటుల సరసన నటించింది. ' జీ తెలుగు సీరియల్ 'మై నేమ్ ఈజ్ మంగతాయారు'లో నటించింది. అయితే ఈ ధారావాహిక తమిళంలో కూడా ప్రసారమయ్యేది. తెలుగులో గులాబీ, దెయ్యం, నీ కోసం, పెళ్లి, ప్రియరాగాలు, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ, తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగులో చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రంలో కనిపించింది. శ్రీదేవి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఈ మధ్య కాలంలో ఆమె కనుమరుగయ్యారు. అయితే తాజాగా ఇటీవల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు అండగా ఉంటున్నారామె. చెన్నైకి వచ్చినప్పుడల్లా శ్రీదేవితోనే కలిసి ఉండేవారట. ప్రస్తుతం షూటింగ్స్‌లో జాన్వీకి తోడుగా ఉంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి మహేశ్వరికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఆమెను ఎవరైనా గుర్తుపట్టగలరా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్రేజ్ అంతా సులభంగా రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. అలా చాలామంది కెరీర్‌ను మధ్యలోనే ఆపేసిన కథానాయికలు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన టాలీవుడ్ స్టార్ నటీమణులు ఎందరో ఉన్నారు. తాజాగా అలా కనిపించకుండా పోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో తన గులాబీ చూపులతో బంధించిన కథానాయిక మహేశ్వరి మీకు గుర్తున్నారా?. ప్రస్తుతం ఆమెను చూస్తే గుర్తు పడతారా? ఇటీవల బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌తో ఆమె ఫోటో దిగింది. కానీ ఆ ఫోటోలో అందరూ జాన్వీ చూశారే తప్ప.. పక్కన ఉన్న హీరోయిన్ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మహేశ్వరి.. అంటే నేటి యువతకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ అదే గులాబీ సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది భామ. అమ్మాయి కాపురం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత వచ్చిన ‘గులాబీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఆ సినిమా అప్పట్లో భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన చిత్రంలో మహేశ్వరి జంటగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మజీ, బెనర్జీ, జీవ, చంద్రమోహన్, చలపతిరావు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ఇండస్ట్రీలో పలు రికార్డులను తిరగరాసింది. గులాబీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మహేశ్వరికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. వడ్డే నవీన్‌తో పెళ్లి, జేడీ చక్రవర్తితో దెయ్యం, మృగం లాంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
శ్రీదేవి ఫ్యామిలీ అని నాకు పొగరన్నారు: మహేశ్వరి
'గులాబీ' సినిమాతో ప్రేక్షకులందరికీ చేరువైంది నటి మహేశ్వరి. భారతీరాజా దర్శకత్వం వహించిన 'కరుతమ్మ' చిత్రంతో పదహారేళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె 'అమ్మాయి కాపురం'తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'దెయ్యం', 'పెళ్లి', 'మా బాలాజీ', 'గులాబి', 'జాబిలమ్మ పెళ్లి', 'నీకోసం', 'మా అన్నయ్య' వంటి పలు చిత్రాలతో అలరించింది మహేశ్వరి. తాజాగా ఆమె ఓ టీవీ షోలో కనిపించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. శ్రీదేవి తనకు చిన్నమ్మ అవుతారని, కానీ తాను మాత్రం అక్క అని పిలిచేదాన్ని అని తెలిపింది. శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చానని నాకు చాలా పొగరు అనేవాళ్లని, కానీ తనకు పొగరులాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది. 'గులాబీ' సినిమాలోని 'మేఘాలలో తేలిపొమ్మన్నది' సాంగ్ షూటింగ్లో తమ బైక్ స్కిడ్ అయి లోయలో పడిపోయిందన్న ఆమె.. అది తక్కువ లోతు ఉండటంతో బతికిపోయామంటూ ఆ ప్రమాదాన్ని వివరించింది. -
ప్రేమించి పెళ్లిచేసుకుని.. భర్త అకాల మరణం.. భార్య బలవన్మరణం
సాక్షి, చిన్నశంకరంపేట్(మెదక్): ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త అకాల మరణాన్ని తట్టుకోలేని భార్య బలవన్మరణానికి పాల్పడింది. నీ వెంటే నేనంటూ భర్త చనిపోయిన రెండు వారాలకే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై గౌస్ వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ముచ్చర్ల మహేశ్వరి (25) భర్త రమేష్ ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో రమేష్ ఈ నెల 6న మృతిచెందాడు. ఈ క్రమంలో మానసిక వేదనకు గురైన మహేశ్వరి ఆదివారం తెల్లవారుజామున పాతచెరువులో దూకింది. స్థానికులు గమనించి రక్షించడానికి ప్రయత్నించగా, అప్పటికే నీటిలో మునిగి మృతిచెందింది. మృతురాలి తండ్రి మల్లేశం ఫిర్యాధు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 15రోజుల వ్యవధిలోనే దంపతులిద్దరు చనిపోవడంతో కుటుంబంలో విషాదం అలుముకుంది. వీరి మృతితో పిల్లలు అనాథలయ్యారు. చదవండి: (హన్మయ్య నీది ఎంతపెద్ద మనసయ్య.. వారి రుణం తీర్చుకోవడం కోసం..) -
మహేశ్వరి, వర్షిణికి సీఎం జగన్ అభినందనలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు బుధవారం కలిశారు. ప్రకాశం జిల్లా పెద్దపవని బాలయోగి పాఠశాల చెందిన పదో తరగతి విద్యార్థిని సీహెచ్ మహేశ్వరి, విశాఖకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థిని వర్షిణికి ముఖ్యమంత్రి అభినందలు తెలిపారు. వ్యవసాయ రంగంలో పరిశోధనలపై గత ఏడాది నీతి అయోగ్, బెటర్ ఇండియా సంయుక్తంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన పోటీల్లో 1600 ప్రాజెక్టులు ప్రదర్శనకు రాగా, ఏపీ నుంచి భారత్ తరఫున రష్యాకు ఎంపికైన విద్యార్థుల్లో వీరిద్దరూ ఉన్నారు. ప్రొటోటైప్స్ ఆన్ క్యాటిల్ డిమేజి అలర్ట్ సిస్టమ్, మల్టిపర్పస్ అగ్రికల్చర్ రోబోను ఈ విద్యార్థులు రూపొందించారు. డీప్ టెక్నాలజీ లెర్నింగ్, ఇన్నోవేషన్ శిబిరంలో భాగంగా రష్యాలో పదిరోజుల పాటు ఇన్నోవేటింగ్ టెక్నాలజీపై మహేశ్వరి, వర్షిణి శిక్షణ పొందారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి తమ ప్రాజెక్ట్‌లను వివరించారు. రష్యా పర్యటను విజయవంతంగా ముగించుకుని తిరిగి వచ్చిన ఈ సందర్భంగా ఇద్దరు విద్యార్థులను ముఖ్యమంత్రి అభినందించి సన్మానించారు. వారిద్దరికీ చెరో లక్ష రూపాయల ఇన్సెంటివ్ చెక్‌లను అందచేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పి.విశ్వరూప్, మంత్రి కన్నబాబు, కల్నల్ వి.రాములు (సెక్రటరీ, ఏపీ సోషల్ వెల్పేర్ రెసిడెన్షియల్ స్కూల్స్) పాల్గొన్నారు. -
భర్త అంత్యక్రియలపై ఇద్దరు భార్యల బాహాబాహీ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇద్దరు సవతి భార్యల పోరులో భర్త అంత్యక్రియల వ్యవహారం ప్రహసనంగా మారింది. భర్త శవం తనకే సొంతమంటూ ఇద్దరు భార్యలు పోట్లాడుకుని పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కిన ఉదంతం తమిళనాడులో జరిగింది. కోయంబత్తూరులోని తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీలో సెక్యూరిటీ పని చేస్తున్న సెంథిల్ కుమార్ (44), విజయ దంపతులు. వీరికి ఒక కుమార్తె ఉంది. మనస్పర్థల కారణంగా వీరు విడాకులు తీసుకున్నారు. భర్తతో విడిపోయి అదే వర్సిటీలో పనిచేస్తున్న మహేశ్వరి అనే మహిళను సెంథిల్ కుమార్ రెండో వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వర్సిటీ క్వార్టర్స్‌లో కాపురం ఉంటున్నారు. వీరికి సంతానం లేదు. అయితే బుధవారం రాత్రి సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంథిల్ కుమార్ గుండెపోటుకు గురై స్పృహతప్పి పడిపోయాడు. సహచర ఉద్యోగులు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయం తెలుసుకుని ఆస్పత్రికి చేరుకున్న రెండో భార్య మహేశ్వరి.. భర్త అంత్యక్రియల నిమిత్తం మృతదేహాన్ని బంధువుల సహాయంతో ఇంటికి చేర్చింది. ఈ సమాచారం అందుకున్న మొదటి భార్య విజయ అక్కడికి వెళ్లగా.. విడాకులు ఇచ్చిన నీకు భర్త మరణంతో సంబంధం ఏమిటని మహేశ్వరి వెళ్లగొట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరుకుంది. దీంతో బంధువులు చేసేది లేక పోలీసులకు సమాచారం ఇవ్వగా సెంథిల్‌కుమార్ మృతదేహాన్ని వారు స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరి మధ్య సంధి కుదిర్చే ప్రయత్నం చేయగా ఫలించకపోవడంతో పోలీసులు.. విద్యుత్ శ్మశానవాటికలో విజయ కుమార్తె తన తండ్రికి అంత్యక్రియలు చేయవచ్చని తీర్మానం చేశారు. దీంతో సెంథిల్‌కుమార్, ఇద్దరు భార్యలు, బంధువుల సమక్షంలో అంతిమ సంస్కారాలు గురువారం పూర్తయ్యాయి. -
శ్రీదేవి చివరి ఫొటోలు
దుబాయ్: ప్రముఖ నటీమణి శ్రీదేవి మరణవార్త భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేసింది. హీరోయిన్ సోనమ్ కపూర్ సోదరుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం భర్త బోనికపూర్, చిన్నకుమార్తె ఖుషి, సోదరి మహేశ్వరితో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడంతో శ్రీదేవి కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. అంతకుముందు పెళ్లిలో వధూవరులతో కలిసి దిగిన ఫొటోలను ఇన్స్టాగ్రామ్ పేజీలో శ్రీదేవి పోస్ట్ చేశారు. ఆమె చివరిసారిగా దిగిన ఈ ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఆమె చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను చూసి అభిమానులు కన్నీళ్లు పెడుతున్నారు. పెళ్లిలో చలాకీ తిరుగుతూ, అందరినీ అప్యాయంగా పలకరిస్తూ వీడియోలో ఆమె కనిపించారు. -
ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
యాడికి (తాడిపత్రి) : యాడికి మండలం రాయలచెరువులో మహేశ్వరి (26) అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన మహేశ్వరిరకి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపాన గల బత్తలూరు గ్రామానికి చెందిన వీరబ్రహ్మం అనే ఉపాధ్యాయుడితో వివాహమైంది. వీరిద్దరూ వృత్తి రీత్యా యాడికి మండలం రాయలచెరువులో నివాసముంటున్నారు. మహేశ్వరి తుట్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలల, వీరబ్రహ్మం చందన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి రెండేళ్ల వయసు గల కుమారుడు ఉన్నాడు. మహేశ్వరికి వారం రోజుల క్రితం అబార్షన్ జరిగింది. అప్పటి నుంచి కడుపునొప్పితో బాధ పడుతుండేది. బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో మహేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు. -
దూసుకెళ్లిన బస్సు: చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని ఓల్డ్ మలక్‌పేటలో శనివారం ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. రహదారి పక్కనే ఉన్న మహేశ్వరీ (6) పైకి బస్సు దూసుకువెళ్లింది. దీంతో చిన్నారి మహేశ్వరి అక్కడికక్కడే మరణించింది. దాంతో భయపడిన డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడు. చిన్నారి మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు బస్సును ధ్వంసం చేశారు. అనంతరం ఓల్డ్ మలక్‌పేటలో రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి... డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. బస్సు వివరాలు తీసుకుని యజమానికి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. -
నగరంలో మెరిసిన శ్రీదేవి
-
ఫ్యాషనబుల్ సిటీ
హైదరాబాద్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందంటున్న శ్రీదేవి.. నయా ఫ్యాషన్స్‌ను ఓన్ చేసుకోవడంలో భాగ్యనగరం ఈజ్ ద బెస్ట్ సిటీ అంటున్నారు. సినిమా ప్రపంచంలో పెరిగిన ఈ అతిలోకసుందరి.. కొత్తగా ఫ్యాషన్ సూత్రాలు చెబుతుందేంటని అనుకుంటున్నారా..? శ్రీదేవి సోదరి, నటి మహేశ్వరి డిజైన్ చేసిన కలెక్షన్లు బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని ‘అంగసూత్ర’లో కొలువుదీరాయి. ‘మహి అయ్యప్పన్’ పేరిట ఏర్పాటు చేసిన ఈ డిజైనర్ లైన్‌ను లాంచ్ చేయడానికి ఆమె నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా శ్రీదేవితో ‘సిటీప్లస్’ మాటామంతి.. నా సినిమాలెన్నో హైదరాబాద్‌లో షూటింగ్ చేసుకున్నాయి. అందుకేనేమో ఈ సిటీ అంటే నాకు స్పెషల్. నేను ఎక్కడున్నా.. తెలుగువారంతా నా మనసుకు ఎంతో దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తారు. అందుకే నా చెల్లెలు మహి డిజైనర్ లైన్‌ను హైదరాబాద్‌లోనే లాంచ్ చేయమని సజెస్ట్ చేశాను. ఈ రోజు కోసమే.. హైదరాబాదీ యువతులు ట్రెడిషన్‌కు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. కొత్త ఫ్యాషన్స్‌ను అంతే ఆదరిస్తారు. నయా ట్రెండ్స్‌ను అనుసరించడంలో ఇతర దేశాల ఫ్యాషన్ ప్రియులతో మన సిటీ యువతులు ఏమాత్రం తీసిపోరు. ఇంకా చెప్పాలంటే వారికి దీటుగా నిలబడతారు. ఒక్క ఫ్యాషన్ రంగమనే కాదు.. అన్నిట్లోనూ వారు ముందుంటున్నారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఫ్యాషన్ ప్రేమికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకే మహి తన డిజైనింగ్స్ ఇక్కడ లాంచ్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది. ఈరోజు కోసం నేను రెండేళ్లుగా వెయిట్ చేస్తున్నాను. మహి సూపర్ నటిగా అందరికీ తెలిసిన మహిలో గొప్ప డిజైనర్ దాగుంది. నేను వేసుకున్న ఈ అందమైన గౌన్ డిజైన్ చేసింది కూడా తనే. మహీ ఏ డిజైనింగ్ కోర్స్ చేయలేదు. కేవలం అబ్జర్వేషన్‌తో, స్పెషల్ ఇంట్రెస్ట్‌తో ఈ రంగంలోకి వచ్చింది. తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే తన డిజై న్ చేసిన కలెక్షన్ జనం మధ్యలోకి రావాలనుకున్నాను. హైదరాబాద్‌లో నైట్ గౌన్స్, కాక్టెయిల్ గౌన్స్కు డిమాండ్ ఎక్కువ. కానీ, ఆ కలెక్షన్‌కు సంబంధించిన డిజైనర్లు సిటీలో రేర్‌గా ఉన్నారు. ‘మహి అయ్యప్పన్’ వీటికి స్పెషల్‌గా నిలుస్తుంది. -
ఆటకు సిద్ధం
బిజీ సిటీలైఫ్‌లో బతుకమ్మను పేర్చే తీరిక ఎవరికుంది. ఓపిక కూడదీసుకుని బతుకమ్మను తీర్చిదిద్దాలన్నా.. పెరిగిన ధరలతో ఆకాశంలో ఉన్న పూలను మధ్యతరగతి మగువలు అందుకోలేకపోతున్నారు. వీరి కోసమే.. వచ్చాయి రెడీమేడ్ బతుకమ్మలు. గంటలకు గంటలు కూర్చొని బతుకమ్మను తయారు చేసే పనిలేకుండా.. తీరొక్క రీతిగా ముస్తాబైన ఆర్టిఫిషియల్ బతుకమ్మలు అంగట్లో దొరుకుతున్నాయి. పూల పండుగ బతుకమ్మను మధ్యతరగతి కుటుంబీకులు జోష్‌ఫుల్‌గా సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. భగ్గుమంటున్న పూల ధరలు.. మిడిల్‌క్లాస్‌కు బతుకమ్మ సంబురాల్ని భారంగా మారుస్తున్నాయి. చటాక్ పూలకు రూ.70 వరకూ చెల్లించాల్సి వస్తుంది. అలాంటి వర్గానికి వరమే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ. దీనికి గంపలకొద్దీ పూలు అక్కర్లేదు. ఇంట్లో వృథాగా ఉన్న కార్డ్బోర్డ్, చవకగా దొరికే థర్మాకోల్, పేపర్ పూలు, వెజిటబుల్ కలర్స్‌తో తయారైన కాగితం పూలతో ఈ బతుకమ్మ తయారు చేయొచ్చు. డిజైనర్ బతుకమ్మలు ఈ మధ్య నగరవాసులు ప్రతీదానికి డిజైనర్ సెలెక్షన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. బతుకమ్మల విషయంలో కూడా అదే ఆసక్తి కనబరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ మెథడ్‌తో అలాంటి డిజైనర్ బతుకమ్మల తయారీ వెరీ ఈజీ. ఖర్చు కేవలం 60 రూపాయలే. రోజుకో రకం తయారు చేసుకోవచ్చు. లేదంటే ఒకే బతుకమ్మను తొమ్మిది రోజులూ పెట్టుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగను ఘనంగా నిర్వహిస్తున్నందున సిటీలోని ప్రధాన కూడళ్లలో నిలువెత్తు రెడీమేడ్ బతుకమ్మలు కొలువుదీరి కనిపిస్తున్నాయి. షాిపింగ్ మాల్స్ దగ్గర్నుంచి ఆఫీసులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లలో ఎక్కడైనా.. ఈ రెడీమేడ్ బతుకమ్మలను అలంకరించుకోవచ్చు. వీటన్నిటికీ మించి ఈ పండుగ సందర్భంగా ఈ రెడీమేడ్ బతుకమ్మలను తయారుచేసే వందలాది మందికి ఉపాధి దొరుకుతోంది. ప్రకృతికి నో ఫికర్ ఈ రెడీమేడ్ బతుకమ్మలతో పర్యావరణానికి ఎలాంటి చేటు ఉండదంటున్నారు ఎకో ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అరుణ్‌జ్యోతి ఎస్ లోఖండే. థర్మకోల్, కార్డ్‌బోర్డ్‌తో చేసిన ఈ బతుకమ్మలు నిమజ్జనం చేయాల్సిన అవసరం లేదంటున్నారామె. తొమ్మిది రోజుల పండుగ అయిపోయాక ఈ రెడీమేడ్ బతుకమ్మను ఇంట్లోనే అలంకరించుకోవచ్చని చెబుతున్నారు. దీనివల్ల ప్రకృతిని కాపాడినవారం అవుతామంటున్నారు అరుణ్‌జ్యోతి. డబ్బుకి డబ్బు ఆదా.. ‘పూల కాస్ట్ ఎక్కువైపోయింది. మూడు వందలు పెడితేకాని పావుకిలో పూలు రావట్లేదు. ఆ పూలతో బుజ్జి బతుకమ్మే తయారవుతోంది. పదిమందిలో ఆడేటప్పుడు కాస్త ఆకర్షణగా ఉండాలంటే కనీసం రూ.1,500 ఖర్చు చేయాల్సిందే. తొమ్మిది రోజులూ అంత డబ్బంటే మాటలుకాదు. అందుకే ఈ రెడీమేడ్ బతుకమ్మలను కొనుక్కుంటున్నాం. డబ్బుకి డబ్బు ఆదా.. శ్రమా అదా.. పండుగ చేసుకున్న భాగ్యమూ దక్కుతోంది’ అని చెప్పింది ఓల్డ్ బోయిన్‌పల్లికి చెందిన సరిత. జ్ఞాపకంగా.. ‘రేట్ లెక్కచేయకుండా పూలు కొని బతుకమ్మను పేర్చినా అందరూ వచ్చి ఆడేసరికి ఆ పూలు వాడిపోయినట్టు కనిపిస్తాయి. అయితే ఈ ఆర్టిఫిషియల్ బతుకమ్మ ఎంత లేటయినా కలర్ఫుల్గా కనిపిస్తుంది. పండుగ అయిపోయినా ఓ జ్ఞాపకంగా షోకేస్‌లో దాచుకోవచ్చు’ అని వివరించింది అన్నానగర్ నివాసి మహేశ్వరి. -
శ్రీవారి సన్నిధిలో సినీతార శ్రీదేవి
ప్రముఖ సినీనటి శ్రీదేవి గురువారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయంలో శ్రీదేవి తన చిన్న కుమార్తె ఖుషి కపూర్, సోదరి మహేశ్వరితో కలిసి వైకుంఠం క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్లారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని అనంతరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సినీనటి కావటంతో ఆలయం వెలుపల శ్రీదేవిని చూడటానికి భక్తులు పోటీపడ్డారు. - తిరుమల -
క్యాన్సర్ కు ఖో
బ్లడ్ క్యాన్సర్...ఈ వ్యాధి పేరు వినగానే గుండెల్లో ఒక రకమైన భయాందోళన కలుగుతుంది. అదే క్రీడాకారులకు ఈ వ్యాధి సోకితే... ఆర్మ్‌స్ట్రాంగ్, యువరాజ్‌లాంటి వారైతే పెద్ద మొత్తం ఖర్చు చేసి విదేశాల్లో చికిత్స చేయించుకుంటారు...ఆ తర్వాత క్యాన్సర్ నివారణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదే ఒక పేద క్రీడాకారిణి, ఆమె తండ్రి రోజువారీ కూలీ అయితే ఆ అమ్మాయి ఏం చేస్తుంది. తన దురదృష్టానికి నిందిస్తూ విధిని నమ్ముకొని బతికేస్తుంది. అయితే ఈ అమ్మాయి అలా అనుకోలేదు. బ్లడ్ క్యాన్సర్ బయటపడినా...బతికే అవకాశాలు తక్కువని చెప్పినా...జీవితంతో పోరాడింది. అంతే కాదు...తనకిష్టమైన ఆటలో కూడా మళ్లీ ప్రవేశించి జాతీయ స్థాయి పోటీల్లో ఆడుతోంది. చిన్న విషయాలకే మానసికంగా కుప్పకూలిపోయే అమ్మాయిలకు ఈ ఖోఖో క్రీడాకారిణి విజయగాథ ఒక స్ఫూర్తి. - మొహమ్మద్ అబ్దుల్ హాది వేముల మహేశ్వరి... వయసు 18 ఏళ్లు. హైదరాబాద్‌లోని బర్కత్‌పురా ప్రాంతంలో నివాసం. తండ్రి కనకయ్య రోజు కూలీ. తల్లి రాములమ్మ ఇళ్లలో పని మనిషి. మహేశ్వరికి కేశవ్ మెమోరియల్ స్కూల్లో విద్యార్థినిగా ఉన్నప్పుడే ఆటలపై ఆసక్తి కలిగింది. అక్కడి పీఈటీ పోచప్ప ప్రోత్సాహంతో ఆమె ఖోఖోను ఎంచుకుంది. ఆరో తరగతిలో ఖోఖో క్రీడను నేర్చుకున్న ఈ అమ్మాయి ఆ తర్వాత వరుసగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. అండర్-14, అండర్-17 కేటగిరీలతో పాటు జూనియర్, సీనియర్ విభాగాల్లోనూ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహించింది. కమ్మిన విషాదం... అయితే అటు చదువులోనూ, ఇటు ఆటల్లోనూ అంతా సంతోషంగా సాగుతున్న క్షణాన ఆ అమ్మాయి జీవితంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. ఒక రోజు అనూహ్యంగా వచ్చిన జ్వరం, ఆ తర్వాత ఎంతకీ తగ్గకపోవడం, వాంతులు...ఇలా వేర్వేరు లక్షణాలు కనిపించినా దానిని సాధారణ అనారోగ్యంగానే అంతా భావించారు. అయితే కుటుంబ సభ్యులకు సందేహం వచ్చి అన్ని వైద్య పరీక్షలకు సిద్ధమయ్యారు. బోన్ మారో పరీక్ష తర్వాత మహేశ్వరికి సోకింది బ్లడ్ క్యాన్సర్ అని తేలింది. అంతే...ఆ కుటుంబంలో చీకటి కమ్ముకుంది. రోజు గడవడమే కష్టమైన ఆ పేద కుటుంబం ఇక అమ్మాయి జీవితంపై ఆశలు వదిలేసుకుంది. జీవన పోరాటం... క్యాన్సర్ చికిత్స కోసం కనీసం రూ. 4-5 లక్షలు ఖర్చవుతుందని చెప్పిన డాక్టర్లు మరో హెచ్చరిక కూడా చేశారు. మొదటి దశలో 25 రోజుల పాటు చికిత్స చేస్తామని...వయసు చిన్నది కాబట్టి ఆ చికిత్సకు తట్టుకోగలిగితే బతుకుతుందని, లేదంటే చనిపోవడం ఖాయమని చెప్పి మరీ పత్రంపై సంతకం చేయించారు. ఈ దశలో కీమోథెరపీతో మహేశ్వరి పోరాటం మొదలైంది. ఇంజెక్షన్స్, వరుసగా బ్లడ్ బాటిల్స్ ఎక్కించడం, శరీరంలో అణువణువూ తీవ్రమైన నొప్పి... ఇలా అన్ని రకాల నొప్పి, వేదనను ఈ అమ్మాయి భరించింది. దాదాపు నాలుగు నెలల పాటు ఆమె చికిత్స కొనసాగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సే అయినా 15 రోజులకు సొంత ఖర్చులు కూడా దాదాపు రూ. లక్ష దాటేశాయి. ఆమె బంధువులు, సన్నిహితులు తలా కొంత మొత్తం ఇచ్చి అండగా నిలిచారు. చివరకు ఈ పోరాటంలో మహేశ్వరిదే పైచేయి అయింది. క్యాన్సర్ అదుపులోకి రావడంతో పాటు సెలైన్లు దాటి చికిత్స టాబ్లెట్ల వరకు వచ్చింది. ఇక ప్రతీ 3 నెలలకు తప్పనిసరిగా పరీక్ష చేయించు కోవాలంటూ డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేశారు. ఆట ముగిసిపోలేదు... మూడేళ్ల విరామం తర్వాత మహేశ్వరి మళ్లీ ఇంటర్మీడియెట్‌లో ప్రవేశించింది. అయితే తనకు ఇష్టమైన ఖోఖోపై మళ్లీ మనసు మళ్లింది. శారీరక బలహీనత ఆటకు అడ్డంకి అని, అలాంటి సాహసం చేయవద్దని చాలా మంది హెచ్చరించారు. అయితే జాగ్రత్తలు తీసుకుంటూనే ఆమె మళ్లీ ఫిట్నెస్ను సంపాదించింది. ఆమె పట్టుదల చూసి తల్లిదండ్రులు కూడా చివరకు ప్రోత్సహించారు. అంతే మళ్లీ జట్టుతో కలసి ప్రాక్టీస్ మొదలు. ఈసారి ఆట ఇంకా మెరుగైంది. హైదరాబాద్ జట్టులో స్థానం మళ్లీ దక్కింది. కర్ణాటకలో జరిగిన సీనియర్ నేషనల్స్ (సౌత్‌జోన్)లో జట్టు సభ్యురాలిగా రాణించింది. గత జనవరిలో కూడా జాతీయ అండర్-19 చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించింది. మహేశ్వరి పట్టుదల ముందు క్యాన్సర్ ఓడిపోయింది. ఇకపై కూడా ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం. -
రాష్ట్ర స్థాయి ఖోఖో: హైదరాబాద్ శుభారంభం
జింఖానా, న్యూస్‌లైన్: రాష్ట్ర స్థాయి అండర్-19 ఖోఖో పోటీల్లో హైదరాబాద్ జట్లు శుభారంభం చేశాయి. ఖమ్మంలో సోమవారం జరిగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు 15-10తో అనంతపురం జట్టుపై విజయం సాధించింది. బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టు 6-1తో గుంటూరుపై గెలుపొందింది. హైదరాబాద్ క్రీడాకారిణి మహేశ్వరి చక్కటి ప్రతిభ కనబరిచింది. బాలుర విభాగంలో నిజామాబాద్ 13-3తో గుంటూరుపై, రంగారెడ్డి 18-1తో క ర్నూలుపై, ఖమ్మం 10-5తో తూర్పు గోదావరిపై, విజయనగరం 11-2తో మహబూబ్‌నగర్‌పై గెలుపొందాయి. బాలికల విభాగంలో కృష్ణ 3-2తో కరీంనగర్‌పై, నిజామాబాద్ 14-7తో ఖమ్మంపై నెగ్గాయి. -
వేర్వేరు ప్రాంతాల్లో బంగారు నగల చోరీ
తిరువొత్తియూరు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో మంగళవారం వేర్వేరు ప్రాంతాల్లో చోరీలు జరిగాయి. మొత్తం 7 సవర్ల బంగారు నగలు, 3 పంచ లోహ విగ్రహాలు చోరీ అయ్యాయి. చెన్నై, ఉల్లగరం ద్రౌపతి అమ్మవారి ఆలయ వీధికి చెందిన బాల సుబ్రమణ్యం (62) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేసి ఉద్యోగ విరమణ చేశారు. ఆయన తన భార్య మహేశ్వరి (52 నగలను స్టేట్ బ్యాంకు లాకర్లో ఉంచారు. కృష్ణ జయంతిని పురస్కరించుకుని బుధవారం పూజలో ఉంచేందుకు మంగళవారం బ్యాంకుకు వెళ్లి లాకర్లో ఉన్న నగలను ఇంటికి తీసుకువచ్చారు. వాటిని స్కూటీ సీటు కింద ఉంచి తాళం వేశారు. ఆ సమయంలో దంపతులకు శరీరంలో దురద ఏర్పడింది. దీంతో వారి సమీపంలో ఉన్నదుకాణం వద్దకు వెళ్లి నీటిని తీసుకుని చేతులు ముఖం శుభ్రం చేసుకున్నారు. దురద తగ్గక పోవడంతో తాను ఆటోలో ఇంటికి వెళతానని, నగలు తన చేతికి ఇవ్వమని మహేశ్వరి భర్తను కోరింది. దీంతో నగల కోసం సీటు పై కెత్తారు. ఆ సమయంలో అక్కడ నగలు లేక పోవడంతో దిగ్భ్రాంతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు దురద ఏర్పడే పౌడర్‌ను చల్లి నగలు కాజేసినట్టు బాల సుబ్రమణ్యం అనుమానించారు. నగలు చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పంచలోహ విగ్రహాలు మాయం.. కడలూరు జిల్లా కాట్టు మన్నార్ కోవిల్ సమీపం వేలంపూండికి చెందిన వ్యక్తి మరుదు ముత్తు (61). ఇతని ఇంటి వెనుక వైపున నాలుగు తరాలుగా పేచ్చాయి, మరుదవీరన్, ఇడుంబన్ తదితర పంచలోహ విగ్రహాలను ప్రతిష్ట చేసి పూజలు నిర్వహిస్తున్నారు. సంవత్సరానికి ఒక సారి వీటినిబయటకు తెచ్చి ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం మరుదుముత్తు మనమరాలు విజయలక్ష్మి దేవతా విగ్రహాలకు పూజలు చేసేందుకు గదిలోకి వెళ్లింది. అక్కడ ఆ సమయంలో మూడు విగ్రహాలు మాయమయ్యాయి. ఈ సంగతిని కుటుంబ సభ్యులకు తెలిపింది. ఫిర్యాదు మేరకు కాట్టుమన్నార్ కోవిల్ పోలీసులుకేసు నమోదు చేసి, దుండగుల కోసం గాలిస్తున్నారు.