
దుబాయ్: ప్రముఖ నటీమణి శ్రీదేవి మరణవార్త భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతిలో ముంచేసింది. హీరోయిన్ సోనమ్ కపూర్ సోదరుడు మొహిత్ మార్వా పెళ్లి కోసం భర్త బోనికపూర్, చిన్నకుమార్తె ఖుషి, సోదరి మహేశ్వరితో కలిసి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి శనివారం రాత్రి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. అప్పటివరకు తమతో సంతోషంగా గడిపిన ఆమె ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోవడంతో శ్రీదేవి కుటుంబ సభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు.
అంతకుముందు పెళ్లిలో వధూవరులతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ పేజీలో శ్రీదేవి పోస్ట్ చేశారు. ఆమె చివరిసారిగా దిగిన ఈ ఫొటోలను అభిమానులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఆమె చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను చూసి అభిమానులు కన్నీళ్లు పెడుతున్నారు. పెళ్లిలో చలాకీ తిరుగుతూ, అందరినీ అప్యాయంగా పలకరిస్తూ వీడియోలో ఆమె కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment