'గులాబీ' సినిమాతో ప్రేక్షకులందరికీ చేరువైంది నటి మహేశ్వరి. భారతీరాజా దర్శకత్వం వహించిన 'కరుతమ్మ' చిత్రంతో పదహారేళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమె 'అమ్మాయి కాపురం'తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 'దెయ్యం', 'పెళ్లి', 'మా బాలాజీ', 'గులాబి', 'జాబిలమ్మ పెళ్లి', 'నీకోసం', 'మా అన్నయ్య' వంటి పలు చిత్రాలతో అలరించింది మహేశ్వరి.
తాజాగా ఆమె ఓ టీవీ షోలో కనిపించింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. శ్రీదేవి తనకు చిన్నమ్మ అవుతారని, కానీ తాను మాత్రం అక్క అని పిలిచేదాన్ని అని తెలిపింది. శ్రీదేవి ఫ్యామిలీ నుంచి వచ్చానని నాకు చాలా పొగరు అనేవాళ్లని, కానీ తనకు పొగరులాంటిదేమీ లేదని చెప్పుకొచ్చింది. 'గులాబీ' సినిమాలోని 'మేఘాలలో తేలిపొమ్మన్నది' సాంగ్ షూటింగ్‌లో తమ బైక్ స్కిడ్ అయి లోయలో పడిపోయిందన్న ఆమె.. అది తక్కువ లోతు ఉండటంతో బతికిపోయామంటూ ఆ ప్రమాదాన్ని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment