ఉపాధ్యాయురాలి ఆత్మహత్య | teacher suicides | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయురాలి ఆత్మహత్య

Published Thu, Jan 12 2017 12:20 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM

teacher suicides

యాడికి (తాడిపత్రి) : యాడికి మండలం రాయలచెరువులో మహేశ్వరి (26) అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఎస్‌ఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన మహేశ్వరిరకి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపాన గల బత్తలూరు గ్రామానికి చెందిన వీరబ్రహ్మం అనే ఉపాధ్యాయుడితో వివాహమైంది. వీరిద్దరూ వృత్తి రీత్యా యాడికి మండలం రాయలచెరువులో నివాసముంటున్నారు. మహేశ్వరి తుట్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలల, వీరబ్రహ్మం చందన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు.

వీరికి రెండేళ్ల వయసు గల కుమారుడు ఉన్నాడు. మహేశ్వరికి వారం రోజుల క్రితం అబార్షన్‌ జరిగింది. అప్పటి నుంచి కడుపునొప్పితో బాధ పడుతుండేది. బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో మహేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రికి తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement