బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్‌ | Sakshi
Sakshi News home page

బుల్లితెర నటి ఇంట సెలబ్రేషన్స్‌.. బాబు ఊయల ఫంక్షన్‌

Published Fri, May 10 2024 12:43 PM

TV Actress Maheswari Son Naming Ceremony

అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళా ఆరాటపడుతుంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. బుల్లితెర నటి మహేశ్వరి గతంలోనే పండంటి కూతురికి జన్మనిచ్చి తల్లయింది. గతేడాది ఆమె మరోసారి గర్భం దాల్చగా ఇటీవలే బాబు పుట్టాడు. దీంతో ఆ నటి ఇంట సంతోషం అంతా ఇంతా కాదు.

యూట్యూబ్‌లో వరుస వీడియోలు
ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ యూట్యూబ్‌లో వరుస వీడియోలు చేస్తోంది. డెలివరీకి ముందు రోజు, డెలివరీ రోజు, ఆ తర్వాత బాబును చూడటానికి వచ్చిన తారల సందడి.. ఇలా అన్నీ వీడియోల రూపంలో షేర్‌ చేస్తోంది. తాజాగా మహేశ్వరి ఇంట బాబు బారసాల ఫంక్షన్‌ జరిగినట్లు తెలుస్తోంది.

బారసాల
తొలిసారి బాబును ఊయలలో వేశారు. ఈ ఫంక్షన్‌లో మహేశ్వరి దంపతులిద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిశారు. బాబు ఊయల ఫంక్షన్‌ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. బాబుకు ఏం పేరు పెట్టాడన్నది మాత్రం తెలియరాలేదు. మహేశ్వరి విషయానికి వస్తే.. వదినమ్మ, శశిరేఖ పరిణయం సహా ఎన్నో సీరియల్స్‌లో నటించింది. 

సీరియల్స్‌తో
కేవలం సీరియల్స్‌కే పరిమితం కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు రియాలిటీ షోలలోనూ కనిపించింది. ఫ్యామిలీ నెంబర్‌ 1, ఇస్మార్ట్‌ జోడీ 2 వంటి షోలలో భర్త శివనాగ్‌తో కలిసి పాల్గొంది. శివనాగ్‌ టాలీవుడ్‌లో డైరెక్షన్‌ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నాడు.

చదవండి: ఆ స్టార్‌ హీరో నాకోసం వెయిట్‌ చేశాడు.. అదే నా మెట్టినిల్లు!

Advertisement
 
Advertisement
 
Advertisement