barasala
-
బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్
అమ్మ అని పిలిపించుకోవాలని ప్రతి మహిళా ఆరాటపడుతుంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు అతీతం కాదు. బుల్లితెర నటి మహేశ్వరి గతంలోనే పండంటి కూతురికి జన్మనిచ్చి తల్లయింది. గతేడాది ఆమె మరోసారి గర్భం దాల్చగా ఇటీవలే బాబు పుట్టాడు. దీంతో ఆ నటి ఇంట సంతోషం అంతా ఇంతా కాదు.యూట్యూబ్‌లో వరుస వీడియోలుఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటూ యూట్యూబ్‌లో వరుస వీడియోలు చేస్తోంది. డెలివరీకి ముందు రోజు, డెలివరీ రోజు, ఆ తర్వాత బాబును చూడటానికి వచ్చిన తారల సందడి.. ఇలా అన్నీ వీడియోల రూపంలో షేర్ చేస్తోంది. తాజాగా మహేశ్వరి ఇంట బాబు బారసాల ఫంక్షన్ జరిగినట్లు తెలుస్తోంది.బారసాలతొలిసారి బాబును ఊయలలో వేశారు. ఈ ఫంక్షన్లో మహేశ్వరి దంపతులిద్దరూ పసుపు రంగు దుస్తుల్లో మెరిశారు. బాబు ఊయల ఫంక్షన్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బాబుకు ఏం పేరు పెట్టాడన్నది మాత్రం తెలియరాలేదు. మహేశ్వరి విషయానికి వస్తే.. వదినమ్మ, శశిరేఖ పరిణయం సహా ఎన్నో సీరియల్స్‌లో నటించింది. సీరియల్స్తోకేవలం సీరియల్స్‌కే పరిమితం కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే పలు రియాలిటీ షోలలోనూ కనిపించింది. ఫ్యామిలీ నెంబర్ 1, ఇస్మార్ట్ జోడీ 2 వంటి షోలలో భర్త శివనాగ్తో కలిసి పాల్గొంది. శివనాగ్ టాలీవుడ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నాడు.చదవండి: ఆ స్టార్ హీరో నాకోసం వెయిట్ చేశాడు.. అదే నా మెట్టినిల్లు! -
కోర్టులో నామకరణం
కొచ్చి: ఆ.. పేరులో ఏముందిలే అని కొందరు అనుకుంటారు కానీ ఆ పేరు కూడా ఒక ప్రహసనంగా మారిందని కేరళలో జరిగిన ఒక ఘటన నిరూపించింది. కన్నబిడ్డకు పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేకపోయిన తల్లిదండ్రులు కోర్టుకెక్కడంతో మూడేళ్ల వయసున్న వారి కుమార్తెకు కేరళ హైకోర్టు పేరు పెట్టాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కేరళకి చెందిన దంపతులు విభేదాలతో విడి విడిగా ఉంటున్నారు. తల్లి సంరక్షణలో వారి మూడేళ్ల వయసున్న కుమార్తె ఉంటోంది. ఆ పాప బర్త్ సర్టిఫికెట్లో పేరు లేదు. ఆ తల్లి కూతురికి పేరు పెట్టి సర్టిఫికెట్లో చేర్చాలని సదరు అధికారుల్ని సంప్రదిస్తే తల్లిదండ్రులిద్దరూ ఒకేసారి హాజరై పేరు చెబితే రిజిస్టర్ చేస్తామన్నారు. అప్పటికే విభేదాలతో దూరమైన దంపతులు పేరు విషయంలో కూడా రాజీకి రాలేకపోయారు. భార్య చెప్పిన పేరు భర్తకి, భర్త చెప్పిన పేరు భార్యకి నచ్చలేదు. కూతురు తన వద్దే ఉండడంతో తల్లి కోర్టుకెక్కింది. చివరికి కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బెచు కురియన్ థామస్ ఆ పాపకు పేరు పెట్టారు. పాప శ్రేయస్సు, తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలు, వారి సంస్కృతి, సామాజిక పరిస్థితులు అన్నీ పరిగణనలోకి తీసుకొని పేరు పెట్టినట్టు న్యాయమూర్తి వెల్లడించారు. కానీ ఏం పేరు పెట్టారో మాత్రం ఆయన బయటపెట్టలేదు. -
మెగా ఇంట్లో బారసాల వేడుక.. వారికి గిఫ్ట్‌గా ఏమిచ్చారంటే?
మెగా వారసురాలు రాకతో చిరంజీవి ఇంట్లో సందడి నెలకొంది. రామ్ చరణ్-ఉపాసనకు తొలిసారి బిడ్డ పుట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు వారి కుటుంబసభ్యులు సంబురాలు చేసుకుంటున్నారు. జూన్ 20న ఉపాసన పాపకు జన్మనివ్వగా.. జూన్ 30న బారసాల వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు సన్నిహితులు కూడా పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన మనవరాలి పేరును వెల్లడించారు. క్లీంకార కొణిదెల అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ పేరును లలిత సహస్రనామం నుంచి తీసుకున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) ఖరీదైన గిఫ్ట్! అయితే ఈ వేడుకలో పాల్గొన్న వారికి ఎలాంటి బహుమతులు ఇచ్చారనే విషయంపై నెట్టింట్లో చర్చ మొదలైంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత మెగా ఇంట్లో ఈ వేడుకను ఓ పండుగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అంతే కాకుండా బారసాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేసి అత్యంత సుందరంగా అలకరించారు. ఈ వేడుకలో పాల్గొన్న వారికి మెగా ఫ్యామిలీ ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫంక్షన్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికి పట్టుచీర గాజులతో పాటు గోల్డ్ కాయిన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవి తన మనవరాలి పేరును రివీల్ చేస్తూ అర్థాన్ని కూడా వివరించారు. రామ్ చరణ్- ఉపాసన కూతురు పేరుని లలిత సహస్రనామం నుంచి తీసుకున్నారు. 'క్లీంకార' అనే పదం ప్రకృతి స్వరూపాన్ని, మాతాశక్తిలో నిక్షిప్తమైన అనుగ్రహాన్ని సూచిస్తుంది. ఆ పేరుకి శక్తివంతమైన వైబ్రేషన్ ఉంది అని మెగాస్టార్ చిరంజీవినే స్వయంగా తన ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఎదుగుతున్నకొద్దీ ఈ లక్షణాలన్నింటినీ ఆమె తన వ్యక్తిత్వంలో ఇముడ్చుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: రామ్ చరణ్- ఉపాసన బిడ్డకు ఆ పేరు.. అసలు కారణం ఇదేనా?) -
అయ్యో.. ఎంత ఘోరం.. బారసాల మురిపెం తీరకముందే..
సాక్షి, ఎల్లారెడ్డిపేట(కరీంనగర్): బారసాల చేసి నోటి నిండా బిడ్డను పిలుచుకోకుండానే ఆ దేవుడు ఆ దంపతులకు తీరని వేదనను మిగిల్చాడు. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చినా ఆ తల్లి మురిపెంగా 21వ రోజు(నామకరణం) చేసిన మరుసటి రోజే మృత్యువు ఆ పసికందును కబళించడం అందరినీ కలచివేసింది. కనుపాప కళ్లముందే తుదిశ్వాస విడవడంతో ఆ కన్నతల్లి గుండెలు అవిసేలా రోదించడం అందరినీ కలచి వేసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లెకు చెందిన చెరుకు మానస–భాస్కర్ దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు గౌతమి(3) ఉండగా, 22రోజుల క్రితం మరో ఆడబిడ్డకు మానస జన్మనిచ్చింది. నామకరణం జరిపిన మరుసటిరోజు మరోసారి వైద్య చికిత్సకోసం మానస ఇద్దరు కూతుర్లు, అత్త ఎల్లవ్వతో కలిసి ఓ ఆటోలో బుధవారం సిరిసిల్ల వెళ్తుండగా పెద్దూరు శివారులో టాటా పికప్, ఆటో ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ సంఘటనలో పసికందు ఆటోలో ఉన్న తల్లి ఒడి నుంచి జారి కింద పడింది. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో సిరిసిల్లకు తరలించేలోపే మరణించింది. మానసతో పాటు ఎల్లవ్వ, గౌతమిలు గాయాలపాలయ్యారు. ఈ సంఘటన రాగట్లపల్లెలో విషాదం నింపింది. బిడ్డ కోసం రూ.2లక్షల ఖర్చు.. ప్రమాదంలో మరణించిన పసికందును కడుపులో ఉండగా అనారోగ్యంతో ఉన్న బిడ్డను బతికించుకోవడానికి తల్లిదండ్రులు అప్పులు చేసి ఆస్పత్రుల్లో రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. ఉమ్మినీరు తక్కువగా ఉండడం, పాప ఎదుగుదల సరిగా లేని కారణంగా వైద్యుల సూచనల మేరకు బిడ్డను దక్కించుకోవడానికి దొరికిన కాడల్లా అప్పులు చేసి ఆరోగ్యంగా బిడ్డకు జన్మనిచ్చారు. బిడ్డ పుట్టిన మురిపెం మూడునాళ్లు నిలవకముందే రోడ్డు ప్రమాదం ఆ పసికందును దంపతులకు దూరం చేసి కడపుకోతను మిగిల్చింది. విగత జీవిగా మారిన బిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. చదవండి: వివాహితకు మరో వ్యక్తితో పరిచయం.. ఏడాదిగా సహజీవనం -
కుక్కపిల్లలకు బారసాల
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన సూదగోని భూమాగౌడ్ నివాసంలో బుధవారం నిర్వహించారు. తన పెంపుడు కుక్క తొమ్మిది రోజుల క్రితం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. కుటుంబంలో ఒకరిగా మారిన పెంపుడు కుక్కకు పిల్లలు జన్మించడంతో బారసాల చేస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కుక్కను మల్లన్నదేవునిగా భావించి పూజలు చేయడం ద్వారా ఇంట్లో మంచి జరుగుతుందని అన్నారు. అనంతరం కుక్కకు పూలమాలలు వేసి, బొట్లుపెట్టి పూజలు చేయడంతోపాటు కాలనీవాసులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. -
కుక్క పిల్లలకు ఘనంగా బారసాల
కరీంనగర్ : సంతాన భాగ్యం లేని దంపతుల జంట తన పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించారు. వివరాల్లోకి వెళితే కరీం నగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన రవి తన ఇంట్లోని కుక్కంటే ఎనలేని అభిమానం, ప్రేమ. తమకు సంతానం లేని లోటును ఆ కుక్క ద్వారా తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుక్క ఇటీవలే నాలుగు కూనలకు జన్మనిచ్చింది. దాంతో ఆ ఇంట్లో ఆనందరం వెల్లివిరిసింది. ఇంకేం.... అనుకున్నదే తడవుగా.. కుక్కపిల్లలకు కొత్త బట్టలు కుట్టించటం, బంధు మిత్రులను ఆహ్వానించి వారి సమక్షంలో వైభవంగా బారసాల నిర్వహించారు. అంతేకాకుండా ఆ బుజ్జి కూనలకు నామకరణం కూడా చేశారు. వచ్చిన బంధుమిత్రులు కుక్క పిల్లలకు అక్షింతలు వేసి ఆశీర్వదించి విందు భోజనం ఆరగించి వెళ్లారు.