ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన సూదగోని భూమాగౌడ్ నివాసంలో బుధవారం నిర్వహించారు. తన పెంపుడు కుక్క తొమ్మిది రోజుల క్రితం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన సూదగోని భూమాగౌడ్ నివాసంలో బుధవారం నిర్వహించారు. తన పెంపుడు కుక్క తొమ్మిది రోజుల క్రితం ఐదు పిల్లలకు జన్మనిచ్చింది.
కుటుంబంలో ఒకరిగా మారిన పెంపుడు కుక్కకు పిల్లలు జన్మించడంతో బారసాల చేస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. కుక్కను మల్లన్నదేవునిగా భావించి పూజలు చేయడం ద్వారా ఇంట్లో మంచి జరుగుతుందని అన్నారు. అనంతరం కుక్కకు పూలమాలలు వేసి, బొట్లుపెట్టి పూజలు చేయడంతోపాటు కాలనీవాసులందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు.