కుక్క పిల్లలకు ఘనంగా బారసాల | karimnagar couple conducts naming ceremony for dogs | Sakshi
Sakshi News home page

కుక్క పిల్లలకు ఘనంగా బారసాల

Published Mon, Oct 20 2014 1:36 PM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

కుక్క పిల్లలకు ఘనంగా బారసాల - Sakshi

కుక్క పిల్లలకు ఘనంగా బారసాల

కరీంనగర్ :  సంతాన భాగ్యం లేని దంపతుల జంట తన పెంపుడు కుక్కకు పుట్టిన పిల్లలకు ఘనంగా బారసాల నిర్వహించారు. వివరాల్లోకి వెళితే కరీం నగర్ జిల్లా వావిలాలపల్లికి చెందిన రవి తన ఇంట్లోని కుక్కంటే ఎనలేని అభిమానం, ప్రేమ. తమకు సంతానం లేని లోటును ఆ కుక్క ద్వారా తీర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ కుక్క ఇటీవలే నాలుగు కూనలకు జన్మనిచ్చింది.

దాంతో ఆ ఇంట్లో ఆనందరం వెల్లివిరిసింది. ఇంకేం.... అనుకున్నదే తడవుగా.. కుక్కపిల్లలకు కొత్త బట్టలు కుట్టించటం, బంధు మిత్రులను ఆహ్వానించి వారి సమక్షంలో వైభవంగా బారసాల నిర్వహించారు. అంతేకాకుండా ఆ బుజ్జి కూనలకు నామకరణం కూడా చేశారు. వచ్చిన బంధుమిత్రులు కుక్క పిల్లలకు అక్షింతలు వేసి ఆశీర్వదించి విందు భోజనం ఆరగించి వెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement