శునకానకి శ్రద్ధాంజలి ఘటిస్తున్న శంకరయ్య కుటంబ సభ్యులు
బుగ్గారం(ధర్మపురి): మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో జం తువులపై తమకు ఉన్న ప్రేమ అమితమైనదని చాటిచెప్పారు మండలంలోని చందయ్యపల్లె గ్రామానికి చెందిన గాదె శంకరయ్య,చిలుకవ్వ దంపతులు. తమ కన్న బిడ్డలతో సమానంగా పెం చుకు న్న బబ్బి అనే శునకం ఇటీవల చనిపోవడంతో సంప్రదాయబద్ధంగా దశదినకర్మ నిర్వహించారు. శంకరయ్య– చిలుకవ్వ దంపతులకు కొన్నాళ్ల వరకు పిల్లలు కలుగకపోవడంతో పలు ఆలయాలు తిరిగారు.
క్రమంలో వారి బంధువుల్లో కొందరు శునకం కూనలకు బారసాల జరిపితే పిల్లలు పుడతారని చెప్పడంతో ఆ తంతు జరిపారు. కొద్దికాలానికి వారికి కుమారుడు నాగరాజు, కుమార్తె పూజిత జన్మించారు. దీంతో వారికి శునకాలపై విశ్వాసం పెరిగింది. అప్పటినుంచి వాటిని తమ పిల్లలతో సమానంగా పెంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం వారి పెంపుడు శునకం బబ్బి చనిపోయింది. గత బుధవారం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజులకు బుధవారం పెద్దకర్మ జరిపించారు. దాదాపు 200 మందికి భోజన ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment