rayalacheruvu
-
రాయలచెరువుకు తప్పిన ముప్పు.. వారం తర్వాత ఇంటికెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తిరుపతి రూరల్: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్, రామచంద్రాపురం మండలాలకు చెందిన 25 గ్రామాల ప్రజలకు వారం రోజులపాటు కంటి మీద కునుకు లేకుండా చేసిన 500 ఏళ్ల నాటి రాయలచెరువుకు పూర్తిస్థాయిలో ముప్పు తప్పింది. వారం కిందట భారీ వరదలతో చెరువు కట్టకు ఏర్పడిన లీకేజీలకు 55 వేల ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేశారు. దీంతో చుట్టుపక్కల గ్రామాల్లోని వేలాదిమంది ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి శనివారం సాయంత్రం రాయల చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. చదవండి: ఆ దిశగా మరో ముందడుగు.. సీఎం జగన్ ట్వీట్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చెరువు లీకేజీలను వందశాతం అరికట్టామని, పశువులతో సహా పునరావస కేంద్రాలకు వెళ్లిన దాదాపు 15 వేల మంది ప్రజలు తిరిగి ఇళ్లకు రావాలని పిలుపునిచ్చారు. లీకేజీలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపించారని, ఆయన ఆదేశాల మేరకు చెన్నై, తిరుపతి ఐఐటీ ప్రొఫెసర్లు, ఇరిగేషన్ నిపుణులను పిలిపించి సమస్యను గుర్తించామన్నారు. 120 మంది నిపుణుల పర్యవేక్షణలో 453 మంది కార్మికులు వారం రోజులుగా రోజుకు 19 గంటలపాటు యుద్ధప్రతిపాదికన పనులు చేశారన్నారు. భారతీ సిమెంట్ యాజమాన్యం వితరణ చేసిన 35వేల ఖాళీ సంచులు, టీటీడీ నుంచి 20 వేల సంచుల్లో ఇసుక, క్వారీ డస్ట్‌ను కలిపి లీకేజీలు ఏర్పడిన ప్రదేశంలో బెర్మ్ పద్ధతిలో అరికట్టామని వివరించారు. నీటి ప్రవాహానికి ఈ బస్తాలు కొట్టుకుపోకుండా 700 టన్నుల బోల్డర్స్ (పెద్దపెద్ద బండరాళ్లు)ను వీటికి దన్నుగా ఉంచామన్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడినా కట్టకు ఇబ్బంది లేకుండా ఔట్‌ఫ్లో 8 వేల క్యూసెక్కులు వెళ్లే విధంగా ఏర్పాట్లుచేశామని చెవిరెడ్డి వెల్లడించారు. ఏడు రోజుల తర్వాత ఇంటికి.. నిర్వాసితులు ఇంటికి వచ్చిన తర్వాతే తాను ఇంటికి వెళ్తానన్న చెవిరెడ్డి.. మొదటి రోజు నుంచి చెరువు కట్టపైనే బసచేసి చెరువు మరమ్మతు పనులను అనుక్షణం పర్యవేక్షించారు. అంతేకాక.. ముంపు ప్రాంతాల్లోని ప్రజలకు నేవీ హెలికాప్టర్లలో నిత్యావసర సరుకులను అందిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో.. చెరువు లీకేజీలకు పూర్తిస్థాయిలో అడ్డకట్ట వేసిన తర్వాత స్థానికులందరూ ఇళ్లకు చేరుకున్నాక చెవిరెడ్డి శనివారం ఇంటికి వెళ్లారు. -
సీపీఐ నారాయణకు కాలికి గాయం.. వైద్యం చేసిన ఎంపీ డాక్టర్ గురుమూర్తి
సాక్షి, తిరుపతి: అసెంబ్లీలోనే విపక్షం, స్వపక్షాలు అనే మాట. బయట అందరు ఒకరితో ఒకరు కలిసిపోతారు. ఎక్కడో కొందరు నేతలు మాత్రం బయట కూడా ద్వేషాన్ని ప్రదర్శిస్తుంటారు. ఇప్పుడిదంతా ఎందుకంటే.. తాజాగా సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఓ ఫోటోపై నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు.. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్‌ను కకావికలం చేసిన సంగతి తెలిసిందే. ఊళ్లకు ఊళ్లే నీట మునిగాయి. ముఖ్యంగా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని రాయల చెరువు.. చుట్టుపక్కల ప్రాంత ప్రజలను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. పై నుంచి వస్తోన్న వరద కారణంగా చెరువు ఎప్పుడు తెగుతుందో అర్థం కాక చుట్టూ పక్కల ఊర్ల జనాలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. (చదవండి: ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి) ఈ క్రమంలో సీపీఐ నాయకుడు నారాయణ బుధవారం రాయలచెరువు సందర్శనకు వచ్చారు. ఈ క్రమంలో ఆయన అనుకోకుండా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే అక్కడకు చేరుకున్న తిరుపతి ఎంపీ డాక్టర్ గురిమూర్తి నారాయణకు వైద్యం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత మార్గాని భరత్ రామ్ తన ట్విటర్లో షేర్ చేయగా ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. గురుమూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: వరద సాయం అందడంలో తప్పులు జరగకూడదు: సీఎం జగన్ -
రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి.. హెలికాఫ్టర్ సాయంతో
సాక్షి, చిత్తూరు: చంద్రగిరి నియోజకర్గం పరిధిలో వరదముంపు ప్రాంతాల ప్రజలకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన హెలికాప్టర్ సాయంతో ఆహార పంపిణీ చేపట్టారు. రామచంద్రపురం మండలంలో రాయల చెరువు గండి పడే అవకాశం ఉండటంతో 18 గ్రామాలు ఖాళీ చేయించారు. తిరుపతిలో పునరావసం కల్పించారు. మరోవైపు కొంతమంది ఊరు వదిలి వెళ్లేందుకు ఇష్టపడని ప్రజలు స్థానికంగా ఉన్న కొండలు పైభాగంలో ఆవాసంగా చేసుకున్నారు. స్వర్ణముఖి నది ఉదృతంగా ప్రవహించడంతో వారికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి హెలికాప్టర్ సాయంతో వరద ముంపుకు గురైన రామచంద్రాపురం మండలంలోని సీకాలేపల్లి, చిట్టత్తూరు, రాయలచెరువు, పుల్లమనాయుడుకండ్రిగ, తిరుపతి రూరల్ మండలం వినాయకనగర్ కాలనీలోని నిర్వాసితులకు బియ్యం, పప్పు, నూనె వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. చదవండి: (ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి) రాత్రి, పగలు రాయలచెరువు వద్దనే ఎమ్మెల్యే చెవిరెడ్డి వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఓ వైపు సహాయక, పునరావాస సౌకర్యాలు కల్పిస్తూనే మరోవైపు వరద ముంపు తగ్గించే పనులు వేగవంతం చేశారు. చిత్తూరు జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు వద్ద లీకేజీ అరికట్టేందుకు భారీగా ఇసుక, కంకర, సిమెంట్ తరలించి కట్టడి చేస్తున్నారు. టీటీడీ అందించిన ఖాళీ గోనె సంచులు, ప్లాస్టిక్, సిమెంట్ సంచుల్లో ఇసుక మిశ్రమం నింపి మూట కట్టి అడ్డుకట్ట వేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టి రాయల చెరువు లీకేజీని అదుపులోకి తెచ్చారు. రాయల చెరువుకు అవుట్ ఫ్లోను మరింత వెడల్పు చేసి, దిగువకు నీరు విడుదల చేశారు. అనంతరం ట్రాక్టర్‌పై వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పగలు, రాత్రి రాయల చెరువు వద్దనే ఉంటు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. చదవండి: ('మీ పతనం నా కళ్లతో చూడాలనే ఆత్మహత్యా ప్రయత్నం విరమించుకున్నా') -
ప్రమాదకరంగానే ‘రాయలచెరువు’
తిరుపతి రూరల్/రామచంద్రాపురం: చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని సుమారు 500 ఏళ్లనాటి రాయలచెరువు పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉంది. 1,050 ఎకరాల్లో 0.9 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ చెరువు నిండుకుండను తలపిస్తోంది. భారీ వర్షాల కారణంగా వరద పోటెత్తడంతో చెరువు కట్టకు లీకేజీలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, జిల్లా అధికారయంత్రాంగం క్షేత్రస్థాయిలో కట్ట బలోపేతం చేసే పనులను పర్యవేక్షిస్తున్నారు. సమీపంలోని 17 గ్రామాలకు చెందిన దాదాపు 20వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజన, వసతులు కల్పించారు. నిపుణుల పరిశీలన రాయలచెరువు కట్టను సోమవారం తిరుపతి, చెన్నై ఐఐటీల సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్లు జానకీరామయ్య, రోషన్ శ్రీవాస్తవ, మైనర్ ఇరిగేషన్ సీఈ శ్రీనివాస్, సోమశిల ప్రాజక్టు సీఈ హరినారాయణరెడ్డి, జలవనరుశాఖ ఎస్ఈ విజయకుమార్‌రెడ్డి పరిశీలించారు. లీకేజీలను త్వరితగతిన అరికట్టాలని, అవుట్‌ఫ్లోను 3వేల కూసెక్కులకు పెంచాలని సూచించారు. చెరువు పటిష్టతకు కనీసం 35వేల ఇసుక మూటలు అవసరమవుతాయన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవతో భారతీ సిమెంట్స్ యాజమాన్యం పంపిన 50వేల సంచుల్లో ఇసుక, కంకర నింపి కట్ట పనులను అధికారులు వేగవంతం చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి, కలెక్టర్ హరినారాయణన్, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన చెరువు కట్టను పటిష్టం చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ఉన్నారు. -
ప్రమాదకరంగా రాయలచెరువు.. రాత్రంతా చెరువు వద్దే ఎమ్మెల్యే చెవిరెడ్డి
Rayala Cheruvu Present Situation: నిండుకుండను తలపిస్తున్న రాయలచెరువు ప్రమాదఘంటికలను మోగిస్తోంది. చెరువు కట్ట బలహీనంగా మారుతూ హెచ్చరికలు జారీ చేస్తోంది. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కట్ట పటిష్టతకు కృషి చేస్తోంది. కలెక్టర్ హరినారాయణన్, ప్రత్యేకాధికారి ప్రద్యుమ్న, తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి తదితరులు చెరువును ఆదివారం పరిశీలించారు. వారు మాట్లాడుతూ ప్రస్తుతం రాయలచెరువులో 0.9 టీఎంసీల నీరు ఉన్నట్లు వెల్లడించారు. విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు హెలికాప్టర్‌ను సిద్ధం చేసినట్లు తెలిపారు. చదవండి: (తిరుపతి రాయల చెరువుకు లీకేజీ.. ఏ క్షణానైనా కట్ట తెగిపడే అవకాశం) చెరువులో పరిస్థితిని గమనిస్తున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తిరుచానూరులోని పద్మావతి నిలయంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో 2వేల కుటుంబాలకు వసతి, భోజన సదుపాయం కల్పించామన్నారు. అలాగే రామాపురంలోని వెరిటాస్ సైనిక్ స్కూలు, గంగిరెడ్డిపల్లెలోని ఏఈఆర్ ఎంబీఏ కళాశాల, కమ్మకండ్రిగ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సైతం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ క్రమంలో సమీప గ్రామాల ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ప్రభుత్వం విప్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి సూచించారు. మరో రెండు రోజుల పాటు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కొండలు, గుట్టల్లో తలదాచుకుని ఇబ్బంది పడకుండా పునరావాస కేంద్రాలకు వెళ్లాలని తెలిపారు. ఆదివారం సాయంత్రం రాయలచెరువు వద్దకు చేరుకున్న ఆయన కట్టను పటిష్టం చేసే చర్యలను పర్యవేక్షించారు. అధి కారులతో సమన్వయం చేసుకుంటూ రాత్రంతా చెరువు వద్దనే గడిపారు. -
తిరుపతి రాయల చెరువుకు లీకేజీ.. ఏ క్షణానైనా కట్ట తెగిపడే అవకాశం
సాక్షి, చిత్తూరు: ఏపీలో భారీ వర్షాలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయలసీయలో వానలు ఎన్నడూలేని విధంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. తాజాగా భారీ వర్షాలతో తిరుపతి రామచంద్రాపురంలోని రాయల చెరువు కట్టకు స్వల్ప గండి పడటంతో వరద నీరు లీకవుతోంది. చెరువు కట్ట నుంచి కొద్దికొద్దిగా జారుతోంది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎత్తైన, సురక్షిత ప్రాంతాలకు సమీప ప్రజలు పరుగులు తీస్తున్నారు. ఒకవేళ రాయల చెరువు తెగితే సుమారు వంద పల్లెలకు ముంపు ప్రమాదం పొంచి వుందని అధికారులు చెబుతున్నారు. చదవండి: Heavy Rains, Floods: సీఎం జగన్ కీలక ఆదేశాలు దీంతో చెరువు దిగువన పల్లెలను అధికారులు అప్రమత్తం చేశారు. అంతేగాక రాయల చెరువు మార్గంలో వాహన రాకపోకలు నిలిపివేశారు. సంతబైలు, ప్రసన్న వెంకేటశ్వరపురం, నెన్నూరు, గంగిరెడ్డిగారిపల్లి, సంజీవరాయపురం, కమ్మపల్లి, గొల్లపల్లె, కమ్మకండ్రిగ, నడవలూరు,వెంకట్రామపురం, రామచంద్రాపురం, మెట్టూరులో ప్రజలను అప్రమత్తం చేశారు. పల్లెలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హరినరయన్ తిరుపతి అర్బన్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అక్కడే పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. -
రాయలచెరువులో గర్భిణి మృతి
యాడికి (తాడిపత్రి) : యాడికి మండలం రాయలచెరువులో మంజుల (60) అనే తొమ్మిది నెలల గర్భిణికి మంగళవారం రాత్రి మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. మంజులకు వెక్కిళ్లు ఎక్కువగా రావడంతో శ్వాస తీసువడానికి ఇబ్బంది పడింది. కుటుంబ సభ్యులు తాడిపత్రి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందింది. -
ఉపాధ్యాయురాలి ఆత్మహత్య
యాడికి (తాడిపత్రి) : యాడికి మండలం రాయలచెరువులో మహేశ్వరి (26) అనే ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ కత్తి శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. తాడిపత్రికి చెందిన మహేశ్వరిరకి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సమీపాన గల బత్తలూరు గ్రామానికి చెందిన వీరబ్రహ్మం అనే ఉపాధ్యాయుడితో వివాహమైంది. వీరిద్దరూ వృత్తి రీత్యా యాడికి మండలం రాయలచెరువులో నివాసముంటున్నారు. మహేశ్వరి తుట్రాళ్లపల్లి ప్రాథమిక పాఠశాలల, వీరబ్రహ్మం చందన ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి రెండేళ్ల వయసు గల కుమారుడు ఉన్నాడు. మహేశ్వరికి వారం రోజుల క్రితం అబార్షన్ జరిగింది. అప్పటి నుంచి కడుపునొప్పితో బాధ పడుతుండేది. బుధవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో మహేశ్వరి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రికి తరలించామని ఎస్ఐ తెలిపారు. -
మెట్లపై నుంచి జారిపడి చిన్నారి మృతి
యాడికి : రాయలచెరువులో షఫీవుల్లా కుమార్తె షహనాజ్(3) మెట్లపై నుంచి జారి పడి ఆదివారం మరణించి నట్లు గ్రామస్తులు తెలిపారు. షఫీవుల్లాకు ఇద్దరు కుమార్తెలు కాగా, వారిలో పెద్ద కు మార్తె షహనాజ్ ఇంటిపైకి వెళ్లే ప్రయత్నంలో మెట్లెక్కుతూ జారి కిందపడిపోయిం దన్నారు. తీవ్రంగా గాయపడిన చిన్నారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మా ర్గమధ్యంలోనే మరణించినట్లు వివరించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.