హైదరాబాద్: నగరంలోని ఓల్డ్ మలక్పేటలో శనివారం ఓ ప్రైవేట్ బస్సు బీభత్సం సృష్టించింది. రహదారి పక్కనే ఉన్న మహేశ్వరీ (6) పైకి బస్సు దూసుకువెళ్లింది. దీంతో చిన్నారి మహేశ్వరి అక్కడికక్కడే మరణించింది. దాంతో భయపడిన డ్రైవర్ అక్కడి నుంచి పరారైయ్యాడు. చిన్నారి మృతి చెందడంతో ఆగ్రహించిన స్థానికులు బస్సును ధ్వంసం చేశారు.
అనంతరం ఓల్డ్ మలక్పేటలో రహదారిపై ఆందోళనకు దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగి... డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. బస్సు వివరాలు తీసుకుని యజమానికి అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు.