
రాష్ట్ర స్థాయి ఖోఖో: హైదరాబాద్ శుభారంభం
జింఖానా, న్యూస్‌లైన్: రాష్ట్ర స్థాయి అండర్-19 ఖోఖో పోటీల్లో హైదరాబాద్ జట్లు శుభారంభం చేశాయి. ఖమ్మంలో సోమవారం జరిగిన ఈ పోటీల్లో బాలుర విభాగంలో హైదరాబాద్ జట్టు 15-10తో అనంతపురం జట్టుపై విజయం సాధించింది. బాలికల విభాగంలో హైదరాబాద్ జట్టు 6-1తో గుంటూరుపై గెలుపొందింది. హైదరాబాద్ క్రీడాకారిణి మహేశ్వరి చక్కటి ప్రతిభ కనబరిచింది. బాలుర విభాగంలో నిజామాబాద్ 13-3తో గుంటూరుపై, రంగారెడ్డి 18-1తో క ర్నూలుపై, ఖమ్మం 10-5తో తూర్పు గోదావరిపై, విజయనగరం 11-2తో మహబూబ్‌నగర్‌పై గెలుపొందాయి. బాలికల విభాగంలో కృష్ణ 3-2తో కరీంనగర్‌పై, నిజామాబాద్ 14-7తో ఖమ్మంపై నెగ్గాయి.