Gulabi
-
కామెల్లియా..అచ్చం గులాబీలా ఉంటుంది..! కానీ..
గులాబీ ఎంత అందమైనదో అంత సున్నితమైనది. కామెల్లియా పువ్వు కూడా చూడటానికి గులాబీ పువ్వంత అందంగానే ఉంటుంది. అయితే, ఇది అంత సున్నితమైనది కాదు. ఈ పువ్వు రేకులు దృఢంగా ఉంటాయి. అందుకే, కామెల్లియా పంటను గులాబీ పంటకు చక్కని ప్రత్యామ్నాయంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.కామెల్లియా ఆకర్షణీయమైన, అద్భుతమైన పువ్వులు. కామెల్లియా సొగసైన పుష్పించే మొక్క. తూర్పు ఆసియాకు చెందినది. ముఖ్యంగా జపాన్, చైనా, కొరియా దేశాల్లో సాగులో ఉంది. థియేసి కుటుంబానికి చెందినది. కామెల్లియా పూజాతిలో వైవిధ్యపూరితమైన అనేక వంగడాలతో పాటు సంకరజాతులు ఉన్నాయి.నిగనిగలాడే సతత హరిత ఆకులతో ఈ చెట్టు అన్ని కాలాల్లోనూ నిండుగా ఉంటుంది. అందానికి, అలంకారానికి ప్రతీకగా అద్భుతమైన తెలుపు, గులాబీ, ఎరుపు, ఊదా రంగుల్లో కామెల్లియా మొక్క పూస్తుంది. అందమైన నున్నని రేకులు, సున్నితమైన సువాసనకు ప్రసిద్ధి చెందిన కామెల్లియాను తరచుగా గులాబీతో పోల్చుతూ ఉంటారు. గులాబీలు సాంప్రదాయకంగా ప్రేమ ప్రతీకలైతే.. కామెల్లియా పూలు స్వచ్ఛత, అభిరుచి, పరివర్తనలకు ప్రతీకగా చెబుతుంటారు.నీడలోనూ పెరుగుతుందిగులాబీ చెట్టు చల్లదనాన్ని, నీడను తట్టుకోలేదు. అయితే, కామెల్లియా అందంగా కనిపించటమే కాదు ఇటువంటి విభిన్న వాతావరణాన్ని కూడా తట్టుకుంటుంది. పదగా, చిన్నపాటి చెట్టుగా పెంచినా ముదురు ఆకుపచ్చని ఆకులతో కామెల్లియా మొక్క పూలు లేనప్పుడు కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అందువల్ల గార్డెన్లో గాని, అలంకరణలో గానీ కామెల్లియా పూలు గులాబీలకు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తాయి. కామెల్లియా పూలు గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో పూస్తాయి కాబట్టి ఆయా సందర్భాలకు తగిన రంగు పూలను ఉపయోగపెట్టుకోవచ్చు. పూరేకులు మృదువుగా, గుండ్రంగా, మందంగా ఉంటాయి కాబట్టి ఇన్డోర్ బొకేల్లో పెట్టినా, గార్డెన్లో పెంచినా ఈ పూలు ఏడాది పొడవునా చూడముచ్చటగా ఒదిగిపోతాయి. గులాబీలు ఇలా కాదు. గులాబీ రేకులు బాగా సున్నితమైనవి, పల్చటివి కాబట్టి త్వరగా వాడిపోతాయి. కామెల్లియా పూలు రంగు, రూపు, నిర్మాణం, పరిమాణం విషయంలో ఇతర పూజాతుల మధ్య వైవిధ్యంగా నిలబడుతుంది. ఈ పువ్వులోనే ఆడ (పిస్టిల్), మగ (స్టేమెన్స్) భాగాలు అమరి ఉండటం వల్ల పరాగ సంపర్కానికి అనువుగా ఉంటుంది. ఈ పువ్వులో వంగడాన్ని బట్టి 5 నుంచి 9 రేకులు ఉంటాయి. ఇవి సాధారణంగా గుడ్డు ఆకారంలో స్పైరల్ పద్ధతిలో కూడుకొని ఉంటాయి. కామెల్లియా పూలలో రేకుల వరుసలు సింగిల్ (కొద్ది రేకులతో) లేదా సెమీ డబుల్ నుంచి డబుల్ (అనేక వరుసలు కలిసి) ఉంటాయి. పూల రంగులు... ప్రతీకలుపూలు లేత గులాబీ నుంచి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. కొన్ని రకాల్లో ఊదా రంగులో, అనేక రంగులతో కూడిన రేకులతోనూ కామెల్లియా పూలు పూస్తాయి. తెల్ల కామెల్లియా పూలు స్వచ్ఛతకు, అమాయకత్వానికి, అనురాగానికి ప్రతీకలు. గులాబీ రంగు కామెల్లియా పూలుఇష్టానికి, ప్రేమకు ప్రతీకలు. ఎర్ర కామెల్లియా పూలు అభినివేశానికి, గాఢమైన ప్రేమకు ప్రతీకలు. ఊదా రంగు కామెల్లియా పూలు ఆరాధనకు, పరివర్తనకు ప్రతీకలుగా చెబుతారు. ఈ పువ్వు 5–10 సెం.మీ. (2–4 అంగుళాలు) వ్యాసార్థంతో ఉంటుంది. కొన్ని కామెల్లియా రకాల పూలు 12 సెం.మీ. (4.7 అంగుళాల) వరకు ΄÷డవుగా, గుండ్రంగా అద్భుతమైన ఆకర్షణీయంగా పెరుగుతాయి. ఈ చెట్టు ఏ సీజన్లో అయిన నిగనిగలాడే ముదురు ఆకుపచ్చని ఆకులతో కళకళలాడుతూ ఉంటుంది. ఆకులు 5–10 సెం.మీ.ల ΄÷డవున, 2–5 సెం.మీ. (0.8 నుంచి 2 అంగుళాల) వెడల్పున ఉంటాయి.2 నుంచి 12 మీటర్ల ఎత్తు కామెల్లియా మొక్కను పొద మాదిరిగా పెంచుకోవచ్చు లేదా చిన్నపాటి నుంచి మధ్యస్థ ఎత్తు ఉండే చెట్టుగానూ పెంచుకోవచ్చు. రకాన్ని, పరిస్థితులను బట్టి 2 నుంచి 12 మీటర్ల (6.5 నుంచి 40 అడుగుల) ఎత్తు వరకు పెరుగుతుంది. కాయ ఆకుపచ్చగా లేదా లేత పసుపు రంగులో ఉంటుంది. విత్తనాలు ఓవల్ షేపులో చిన్నగా, గట్టిగా ఉంటాయి. వీటి నూనెను సౌందర్యసాధనాల్లో వాడతారు. వంటకు కూడా వాడుతుంటారు. కామెల్లియా జాతిలో చాలా రకాల చెట్లు శీతాకాలంలో పూతకొస్తాయి. ఇవి పెరిగే వాతావరణ స్థితిగతులు, నేలలను బట్టి పూత కాలం మారుతూ ఉంటుంది.పూలు.. అనేక వారాలు! కామెల్లియా మొండి జాతి. చల్లని ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. ఉష్ణోగ్రతల్లో తీవ్ర హెచ్చుతగ్గులున్న ప్రాంతాల్లోనూ తట్టుకుంటుంది. గులాబీ చెట్లతో పోల్చితే కామెల్లియా చెట్లు పెద్దవి, చాలా కాలం మనుగడసాగిస్తాయి. దీర్ఘకాలం ఆధారపడదగిన పూల చెట్ల జాతి ఇది. దీని పూలు అనేక వారాల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ చెట్లకు ఆకులు ఏడాది పొడవునా నిండుగా, ముచ్చటగొలుపుతుంటాయి.ఆమ్ల నేలల్లో పెరుగుతుందిగులాబీ మొక్కను జాగ్రత్తగా పెంచాలి. తరచూ కొమ్మలు కత్తిరించాలి. చీడపీడల నుంచి జాగ్రత్తగా రక్షించుకోవాలి. తరచూ మట్టిలో ఎరువులు వేస్తూ ఉండాలి. కానీ, కామెల్లియా చెట్లు అలాకాదు. వీటి మెయింటెనెన్స్ చాలా సులభం. మొక్క నాటిన తర్వాత నిలదొక్కుకుంటే చాలు. నీరు నిలవని ఆమ్ల నేలల్లో పెరుగుతుంది. ఏడాదిలో చాలా తక్కువ రోజులు మాత్రమే ఎండ తగిలే ప్రాంతాల్లో పూల తోటను పెంచాలంటే కామెల్లియాను ఎంచుకోవాలి. చిన్న పొదగా పెంచుకోవచ్చు. తరచూ కత్తిరిస్తూ హెడ్జ్లుగా అనేక రకాలుగా, అనేక సైజుల్లో దీన్ని పెంచుకోవచ్చు. గులాబీ మొక్కల్ని పొదలుగా, తీగలుగా మాత్రమే పెంచగలం. గులాబీల మాదిరిగానే అనేక రంగుల్లో అందంగా పూస్తుంది. ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉండే పూలు కావటం కూడా ముఖ్యమైన విషయం. ఇన్ని ప్రత్యేకతలున్నందునే గులాబీకి కామెల్లియాను చక్కని ప్రత్యామ్నాయంగా చెబుతారు. ఆకులతో టీ, గింజలతో నూనెకామెల్లియా జాతిలో 100–250 వైవిధ్యపూరితమైన రకాలు ఉండటం విశేషం. పువ్వు రూపు, రంగును బట్టి అది ఏ రకమో గుర్తించవచ్చు. ‘కామెల్లియా జ΄ోనికా (జూన్ కామెల్లియా) రకం ఎక్కువగా సాగులో ఉంది. దీని పూలు పొడవుగా, ఆకర్షణీయంగా ఉంటాయి. తెలుపు నుంచి ముదురు ఎరుపు, గులాబీ రంగుల పూలు జూన్ కామెల్లియా చెట్టు పూస్తుంది. కామెల్లియా సినెన్సిస్ (టీ కామెల్లియా) రకం చెట్టు ఆకులతో టీ కాచుకొని తాగుతారు. అందువల్ల దీని ఆకుల ద్వారా కూడా ఆదాయం పొందవచ్చు.దీని తెల్లని పూలు చిన్నగాను, తక్కువ ఆకర్షణీయంగానూ ఉంటాయి. కామెల్లియా ససన్కువ రకం పూలు చిన్న, అతి సున్నితంగా ఉన్నా సువాసనను వెదజల్లుతాయి. జూన్ కామెల్లియా రకం కన్నా చాలా ముందుగానే ఈ రకం చెట్టు పూస్తుంది. కామెల్లియా రెటిక్యులాట జాతి చెట్లకు పొడవాటి పూలు పూస్తాయి. అందరినీ ఆకర్షించగల ఈ రకం చెట్లు చైనాలో విస్తారంగా కనిపిస్తాయి. కామెల్లియా ఒలీఫెరా రకం కూడా చైనాలో విస్తారంగా కనిపిస్తుంది. దీని విత్తనాల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ నూనెను వంటకాల్లో, సౌందర్య సాధనాల తయారీకి కూడా వాడుతున్నారు. చిన్న, తెల్లని పూలు పూస్తుంది. వాణిజ్యపరంగా చూస్తే మంచి ఆదాయాన్నిచ్చే రకం ఇది. -
‘గులాబీ’రచయిత కన్నమూత
‘గులాబీ’, ‘అనగనగా ఒకరోజు’ సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాలకు మాటల రచయితగా పని చేసిన నడిమింటి నరసింగరావు (72) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో వున్న ఆయన యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం నరసింగరావు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ సోమాజిగూడ లోని యశోదా ఆస్పత్రి లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి వెళ్లిన ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్ర పరిశమ్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.సినిమాల్లోకి రాక ముందు బొమ్మలాట అనే నాటకం ద్వారా మంచి గుర్తింపుని పొందిన ఆయన ఒకప్పుడు దూరదర్శన్ ప్రేక్షకులని ఉర్రూతలూగించిన తెనాలి రామకృష్ణ సీరియల్‌కి కూడా రచయితగా చేసారు. అలాగే ఈ టీవీ లో ఫేమస్ సీరియల్స్ గా గుర్తింపు పొందిన వండర్ బోయ్, లేడీ డిటెక్టవ్, అంతరంగాలు వంటి సీరియల్స్ కి కూడా మాటలు అందించారు. నరసింగరావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు. -
అగ్రహీరోలతో అలరించిన మహేశ్వరి .. ఇప్పుడేం చేస్తోందో తెలుసా?
అప్పటి తెలుగు సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు మహేశ్వరి. అప్పట్లో పలు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. ఇప్పటి సినీ ప్రేక్షకులకు ఆమె పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 35 చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులో పెళ్లి చిత్రంలో హీరోయిన్గా ఆకట్టుకుంది. అయితే మహేశ్వరి తెలుగులో అమ్మాయి కాపురం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. పెళ్లి సినిమాతోనే మహేశ్వరికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రవి తేజతో కలిసి జంటగా నటించిన నీకోసం చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది. గులాబీ సినిమా ఆమెకు మరింత క్రేజ్ తెచ్చి పెట్టింది. అయితే 2008లో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవికి బంధువైన మహేశ్వరి ఇప్పుడేలా ఉంది? ఏం చేస్తోందో తెలుసుకుందాం. తమిళంలో ఎంట్రీ ఉల్లాసం అనే తమిళ చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించింది. ఆమె తమిళంలో అజిత్, విక్రం వంటి అగ్ర నటుల సరసన నటించింది. ' జీ తెలుగు సీరియల్ 'మై నేమ్ ఈజ్ మంగతాయారు'లో నటించింది. అయితే ఈ ధారావాహిక తమిళంలో కూడా ప్రసారమయ్యేది. తెలుగులో గులాబీ, దెయ్యం, నీ కోసం, పెళ్లి, ప్రియరాగాలు, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ, తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగులో చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రంలో కనిపించింది. శ్రీదేవి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం ఈ మధ్య కాలంలో ఆమె కనుమరుగయ్యారు. అయితే తాజాగా ఇటీవల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు అండగా ఉంటున్నారామె. చెన్నైకి వచ్చినప్పుడల్లా శ్రీదేవితోనే కలిసి ఉండేవారట. ప్రస్తుతం షూటింగ్స్‌లో జాన్వీకి తోడుగా ఉంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి మహేశ్వరికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
ఒకప్పుడు స్టార్ హీరోయిన్.. ఆమెను ఎవరైనా గుర్తుపట్టగలరా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్లకు క్రేజ్ అంతా సులభంగా రాదు. ఒకవేళ వచ్చినా ఎక్కువ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. అలా చాలామంది కెరీర్‌ను మధ్యలోనే ఆపేసిన కథానాయికలు ఉన్నారు. ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన టాలీవుడ్ స్టార్ నటీమణులు ఎందరో ఉన్నారు. తాజాగా అలా కనిపించకుండా పోయిన్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. అప్పట్లో తన గులాబీ చూపులతో బంధించిన కథానాయిక మహేశ్వరి మీకు గుర్తున్నారా?. ప్రస్తుతం ఆమెను చూస్తే గుర్తు పడతారా? ఇటీవల బాలీవుడ్ నటి జాన్వీకపూర్‌తో ఆమె ఫోటో దిగింది. కానీ ఆ ఫోటోలో అందరూ జాన్వీ చూశారే తప్ప.. పక్కన ఉన్న హీరోయిన్ను ఎవరూ గుర్తు పట్టలేకపోయారు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మహేశ్వరి.. అంటే నేటి యువతకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ అదే గులాబీ సినిమా హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేస్తుంది భామ. అమ్మాయి కాపురం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ముద్దుగుమ్మ. ఆ తర్వాత వచ్చిన ‘గులాబీ’ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది. రామ్‌గోపాల్ వర్మ నిర్మించిన ఆ సినిమా అప్పట్లో భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహించారు. జేడీ చక్రవర్తి హీరోగా తెరకెక్కిన చిత్రంలో మహేశ్వరి జంటగా నటించింది. ఈ చిత్రంలో బ్రహ్మజీ, బెనర్జీ, జీవ, చంద్రమోహన్, చలపతిరావు కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రం ఇండస్ట్రీలో పలు రికార్డులను తిరగరాసింది. గులాబీ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో మహేశ్వరికి అవకాశాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. ఆ తర్వాత పలు సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. వడ్డే నవీన్‌తో పెళ్లి, జేడీ చక్రవర్తితో దెయ్యం, మృగం లాంటి సినిమాల్లో నటించింది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు(ఫిబ్రవరి15) నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు, మూడు రోజుల ముందు నుంచే వేడుకలు పండుగలా నిర్వహిస్తున్న విషయం తెలిందే. అన్నదానం, రక్తదానం, బట్టలు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పుట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. చదవండి: చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ ఇచ్చారట.. ఇంకేముంది!! మంత్రి పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే దోశ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ దోశలో ఇంకో స్పెషల్ కూడా ఉంది. బీట్రూట్తో తయారు చేసిన గులాబీ రంగు దోశలను చేయించి ఒక్కో దోశను కేవలం రూపాయికే స్థానికులకు అందజేశారు. దీంతో కొత్త రంగులో ఉన్న దోశలను తినేందుకు ప్రజల ఎగబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
ఆడేందుకు ఎవరూ దొరక్కపోతే కొడుకుతోనే..
చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు. చెవుల్ని చేతుల్లోకి తీసుకోవచ్చు. చెప్పిన మాట వినకుంటే పిల్లల చెవుల్ని మెలేసినట్లే.. భార్యని వేధించవద్దని, వ్యసనాల జోలికి వెళ్లొద్దని,తాగుడు మానేయమనీ ఎంత చెప్పినా వినని మగాళ్ల చెవి పిండి, చెడు వదిలించేందుకు యూపీలో గ్రామాల్లో కొత్తగా ‘గ్రీన్ గ్యాంగ్’ అనే మహిళా దళం ఊపిరి పోసుకుంది. పదమూడేళ్ల క్రితం అదే రాష్ట్రంలో ఆవిర్భవించిన ‘గులాబీ గ్యాంగ్’కు సిస్టర్ గ్యాంగ్..ఈ గ్రీన్ గ్యాంగ్. ఇంటి పని పూరై్తంది. ఆశాదేవి బట్టలు మార్చుకుని బయటికి వచ్చింది. ఆమె ఇప్పుడు ఆకుపచ్చ రంగు చీరలో ఉంది. ఆ చీర ఆమె ఆయుధం. ఆమెను మాత్రమే కాపాడే ఆయుధం కాదు, ఊళ్లోని ఆడవాళ్లందరికీ రక్షణ! ఆశాదేవి వేరే ఏ బట్టల్లో ఉన్నా ఊళ్లోని మగాళ్లు ఉలిక్కిపడరు. ఆకుపచ్చ చీరలో కనిపించిందంటే ఒళ్లు దగ్గర పెట్టుకుంటారు. గ్రీన్ గ్యాంగ్ లీడర్ బయటికి వచ్చిందని ఒకరికొకరు సమాచారం ఇచ్చుకుంటారు. గ్యాంగ్ లీడర్ బయటికి వచ్చిందంటే నూటాయాభై మంది వరకు ఉన్న ఆ గ్యాంగ్ ఊళ్లో ఎక్కడో మగవాళ్లను ‘చక్కబెడుతోందనే’! ధైర్యం.. ధీమా.. భరోసా! పవిత్ర పుణ్యభూమి అయిన వారణాసికి దగ్గరలో ఉంది గ్రీన్గ్యాంగ్ ఉన్న ఊరు. పేరు ఖుషియారీ. ఆడపిల్లలకు, ఆడవాళ్లకు అనువైన ఊరు కాదది! అసలు ఆడపిల్ల తల్లి గర్భంలోంచి భూమ్మీద పడడమే ఆ ఊళ్లో కనాకష్టం. పుట్టాక పెరగడం ఇంకా కష్టం. పెరుగుతుంది కానీ.. ఆమెకో జీవితం ఉండదు. పెళ్లీ అవుతుంది. తన మాటకు విలువ ఉండదు. ఆమె తరఫున అత్తమామలే మాట్లాడతారు. ఆమె ఇష్టాలను, అయిష్టాలను వదిన మరదళ్లే నిర్ణయిస్తారు. అలాంటి ఊళ్లో.. ఇంటి పనయ్యాక పచ్చచీర కట్టుకుని బయటికి వచ్చింది ఆశాదేవి. పొలం పనులు ముగించుకుని అప్పుడే ఇంటికి చేరుకున్న మరో ఇరవై మంది మహిళలు ఆ వెంటనే ఆమెను అనుసరించారు. వాళ్లంతా కూడా ఆకుపచ్చ చీరలో ఉన్నారు. అది వాళ్ల యూనిఫారం. ఊళ్లోని మహిళలకు, పిల్లలకు ధైర్యాన్ని, భరోసాను, నమ్మకాన్ని ఇచ్చే రంగు. తాగొచ్చి భార్యను కొట్టే భర్తకు ఆ రంగును చూస్తే భయం. జూదం ఆడే మగాళ్లకు వణుకు. పేకముక్కలు అక్కడే పడేసి వెనక్కైనా చూడకుండా పారిపోతారు. తల్లి మొత్తుకుంటున్నా పిల్లల్ని స్కూలుకు పంపకుండా పనికి తరిమేసే తండ్రుల భరతం కూడా పడుతుంది గ్రీన్ గ్యాంగ్. గ్యాంగ్ సభ్యులతో గులాబీ గ్యాంగ్ లీడర్ సంపత్‌పాల్ దేవి మార్పు కోసం ఒకటయ్యారు ఖుషియారీ గ్రామంలోని మగాళ్ల ప్రధాన కాలక్షేపం ‘మూడు ముక్కలాట’. దేశంలో జూదం ఆడటం నిషేధం. కానీ ఖుషియారీలో మగాళ్లు చెట్ల కింద, గట్ల మీద కండువాపై ముక్కలు వేసుకుని కూర్చుంటారు! ఆడేందుకు ఎవరూ దొరక్కపోతే కొడుకుతోనే ‘కాయ్ రాజా కాయ్’ అంటాడు తండ్రి. ఆ గ్రామంలోని షీలాదేవి ఆవేదన కూడా ఇదే. తండ్రి చెడిపోయాడు. కొడుకునూ చెడగొడుతున్నాడు. ఏం చేస్తుంది మరి? గ్రీన్ గ్యాంగ్‌లో చేరింది! ఇంట్లో అంతా పని చేస్తే కానీ రోజు గడవదు. షీలాదేవి భర్త çపనికి వెళ్లడు. ఆమె నాలుగు రూపాయలు సంపాదించుకొస్తేనే ఆ రోజుకి ఇంట్లో పొయ్యి వెలిగేది. షీలాదేవికి ఆడపిల్లలూ ఉన్నారు. ఖుషియారీలో ఆడపిల్లలను అచ్చంగా గుండెలపై కుంపటిలానే చూస్తారు. దేశం మారుతున్నా ఖుషియారీ మారడం లేదు. అందుకే ఆ ఊరి ఆడవాళ్లు మారదలచుకున్నారు. అడ్డదిడ్డంగా ఉండి కుటుంబాల్లో కల్లోలం రేపుతున్న మగాళ్లకు ముందుగా చెప్పి చూస్తారు. వినకుంటే ‘గుర్తుండిపోయేలా’ చెప్తారు. ఏ ఇంట్లోనైనా ఒక పురుషుడు అశాంతి సృష్టిస్తుంటే ఆ సమాచారాన్ని గ్రీన్ గ్యాంగ్ ఇచ్చి పుచ్చుకుంటుంది. అతడిని పంచాయితీకి రమ్మని పిలుస్తారు. ‘మీరు పిలిస్తే వచ్చేదేంటి?’ అని అతడు భీష్మించుకుని కూర్చుంటే వీళ్లే వెళ్తారు. ఊరికే వెళ్లరు. చేతుల్లో కర్రలతో వెళ్తారు. మరీ కర్రలు అవసరం లేని కేస్ అయితే బెదిరించి బుద్ధి చెబుతారు. జూదశాలలపై దాడులు చేయడం, గుడుంబా కుండల్ని బద్దలు కొట్టడం.. వీటి కన్నా కూడా.. మారని మగాళ్లను దారిలోకి తెచ్చేందుకే వీళ్లు ఎక్కువ సమయం కేటాయించవలసి వస్తోంది. చదువుకున్నవారి సహకారం గ్రీన్ గ్యాంగ్‌లో కొందరు కరాటే తెలిసిన మహిళలు కూడా ఉన్నారు! పరిస్థితి చెయ్యి దాటినప్పుడు వట్టి చేతులతో టాస్క్‌ని ఫినిష్ చేసేస్తారు. ఇదేమీ పెద్ద విషయంగా కనిపించకపోవచ్చు. కానీ ఖుషియారీలో మహిళలు ఇలా సంఘటితం అవడం కష్టమైన సంగతే. కట్టుబాట్లపరంగా స్త్రీల పట్ల వివక్షకు మారు పేరు ఖుషియారీ. గత ఏడాది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక నివేదిక విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు గృహహింసకు, గృహ లైంగికహింసకు గురవుతున్నారు. వివాహిత మహిళల్లో మూడింట ఒక వంతు మంది భర్తల చేతుల్లో భౌతిక, లైంగిక హింసను అనుభవిస్తున్నారు. పట్టణాలతో పోల్చి చూస్తే గ్రామాల్లోని మహిళలపైనే ఈ హింస ఎక్కువగా ఉంటోంది. అలాంటి గ్రామాలకు ఒక ముఖచిత్రం ఖుషియారీ. అయితే ఈ నివేదికల్లో చూపించేదాని కన్నా ఎక్కువగానే మహిళలపై హింస జరగుతోందని గ్రీన్ గ్యాంగ్‌కు తెలియందేమీ కాదు. ప్రభుత్వం వైపు నుంచి మహిళల రక్షణ, భద్రతలకు జరిగేది జరుగుతున్నా, ఏ గ్రామానికి ఆ గ్రామంలో బాధితుల తరఫున మహిళలూ పూనుకుంటే తప్ప మగాళ్లలో మార్పు రాదని గ్రీన్ గ్యాంగ్ నిశ్చయించుకుని స్త్రీలను, పిల్లలను కాపాడే ఉద్యమానికి నడుం కట్టింది. గ్రీన్ గ్యాంగ్ సభ్యులకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్న వలంటీర్లు స్వయంగా ఆశాదేవి కూడా ఒక బాధితురాలే. రోజూ తాగొచ్చి భార్యను అదొక అలవాటుగా బాదేవాడు! ఆమె తలను గోడకేసి కొట్టేవాడు. రక్తం కారేది. నొప్పిని ఆలాగే భరిస్తుండేది కానీ ఏనాడూ ఎదురు తిరగలేదు. కానీ ఒకరోజు పిల్లల ముందు ఆమెపై చెయ్యి చేసుకున్నాడు. ఆ చెయ్యిని అక్కడే ఆపేసింది ఆశాదేవి. నిర్ఘాంతపోయాడు. పిల్లల కళ్లల్లో సంతోషం. అమ్మ కూడా ఎదిరించగలదు. అమ్మకూడా ఎదురు తిరగగలదు. అంతే. నాన్నంటే భయం పోయింది. అమ్మంటే గౌరవం పెరిగింది. ఈ విషయం ఆశాదేవి గ్రహించింది. ఊళ్లో తన దొక్కటే కుటుంబం కాదు. తనొక్కతే బాధితురాలు కాదు. పిల్లల్ని తండ్రి ప్రేమగా చూసుకోవచ్చు. కానీ వాళ్ల కళ్లముందే తల్లిని అవమానిస్తే, అగౌరవపరిస్తే వాళ్లూ బాధితులే అవుతారు. ఈ దుస్థితిని తన పిల్లలకు తొలగించిన ఆశాదేవి, తనలాంటి వారే మరికొందరితో కలిసి ఊళ్లోని బాధిత మహిళల కోసం, వారి పిల్లల కోసం ‘గ్రీన్ గ్యాంగ్’ ఆవిర్భావానికి తోడ్పడింది. ఒక గ్యాంగ్ గా ఏర్పడడానికి వీళ్లకు స్ఫూర్తిని ఇచ్చింది మాత్రం కొంతమంది యూనివర్సిటీ విద్యార్థులు. వాళ్లలోని వలంటీర్లు ఊళ్లోకి వచ్చి, స్త్రీల హక్కుల గురించి చెప్పి వెళ్లిపోయారు. అరె.. హక్కులుండీ హక్కులు లేనట్లు పడివుండటం ఏంటని అనుకున్నారు ఖుషియారీ మహిళలు. విద్యార్థులలోనే కొందరికి కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలతో పరిచయాలున్నాయి. అలా దివ్వాంశు ఉపాధ్యాయ్ అనే సేవా సంఘం నిర్వాహకుడు కొంతమంది యువ వలంటీర్ల చేత స్థానిక మహిళలకు చట్టాలపై, సెక్షన్లపై అవగాహన కల్పించాడు. ముఖ్యంగా పోలిస్ కంప్లయింట్ ఎలా ఇవ్వాలో చెప్పించాడు. ఆ తర్వాతి నుంచి ఊళ్లో మగాళ్లపై కేసులు నమోదవడం మొదలైంది. భర్తపై భార్య పెట్టిన కేసులే వాటిల్లో ఎక్కువ! తర్వాతి స్థానం జూదం ఆడేవారిది, తాగొచ్చి కొట్టేవాళ్లది, గుడుంబా కాసేవాళ్లదీ. ఊళ్లో ఇప్పుడీ పచ్చరంగు చీరల్లోని ఆడవాళ్లు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌గా మహిళల్ని, బాలికల్ని కాపుకాస్తున్నారు. రక్షణ వలయంగా నిలుస్తున్నారు. వీళ్లకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నది కూడా యవ వలంటీర్లే. శాంతి సౌభాగ్యాలు గ్రీన్ గ్యాంగ్ గుడుంబా కుండల్ని బద్దలు కొడుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ గ్యాంగ్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. గ్రీన్ గ్యాంగ్‌లో ప్రస్తుతం 150 మంది వరకు మహిళలు ఉన్నారు. ప్రతి సాయంత్రం వీళ్లంతా కలుస్తారు. అయితే అందరూ ఒకే చోట కలవరు. బృందాలుగా విడిపోయి, వేర్వేరు చోట్ల సమావేశం అవుతారు. ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా అని చర్చించుకుంటారు. ఉంటే ఆ బాధిత మహిళను ఎలా గట్టెక్కించాలో ఆలోచిస్తారు. కార్యాచరణ సిద్ధం చేసుకున్నాక బాధితురాలి ఇంటికి వెళ్లి భర్త వైఖరిని మార్చుకొమ్మని సలహాయిస్తారు. సాధారణంగా చెయ్యి చేసుకోరు. చేతిలో కర్రలు మాత్రం ఉంచుకుంటారు. ఏ ఫిర్యాదులూ లేనప్పుడు గ్రామం మంచిచెడ్డల కోసం అధికారులను కలిసే విషయమై మాట్లాడుకుంటారు. ఏబీసీ న్యూస్ దక్షిణాసియా కరస్పాండెంట్ సియోభన్ హెన్యూ ఈ గ్రీన్ గ్యాంగ్‌ను.. ‘ఆకుపచ్చ రంగునే మీ యూనిఫారమ్‌కు ఎందుకు ఎంచుకున్నారు అని ప్రశ్నించినప్పుడు.. ‘‘ఆకుపచ్చ సౌభాగ్యానికి, శాంతికి చిహ్నంగా మేము భావిస్తాం. అయితే ఈ మగవాళ్లు మాకు అవి రెండూ లేకుండా చేస్తున్నారు. వాటిని సాధించుకోవడం కోసమే మా పోరాటం’’ అని చెప్పారు. గులాబీ గ్యాంగ్ పన్నెండేళ్ల వయసుకే సంపత్ పాల్ దేవి ఒక గొర్రెపిల్లలా భర్త వెనకే నడిచి, మెట్టినింట అడుగుపెట్టింది. ఇరవై ఏళ్లకే ఐదుగురు పిల్లల తల్లి అయింది. గొర్రెల కాపరి అయిన ఆమె తండ్రి తన కూతురుని ఎంత త్వరగా ఇంకొకరి కాపలాకి ఇస్తే అంత త్వరగా తన భారం వదులుతుందని భావించాడే తప్ప, తర్వాత పిల్ల భవిష్యత్తు ఏమిటని ఆలోచించలేదు. బడిపిల్లలకు ఐస్‌క్రీమ్ అమ్ముతుండే దేవి భర్త కూడా తన భార్యాపిల్లలకు చల్లని జీవితాన్ని ఇవ్వలేకపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని అనేక నిరుపేద గ్రామాల్లో మహిళల పరిస్థితి చాలావరకు ఇలాగే ఉంటుంది. బాల్యంలోనే వివాహం అయిపోతుంది. అక్కడితో చదువు ఆగిపోతుంది. అక్కడి నుంచి భర్త వేధింపులు సాధింపులు మొదలవుతాయి. దేవి కూడా అలాంటి సగటు గృహిణే. తను, తన కుటుంబం, తన కష్టాలు... అంతే. గుట్టుగా నెట్టుకొస్తోంది. అయితే ఆమె జీవితంలోని ఓ క్షణం ఆమెను పూర్తిగా మార్చేసింది. ఆమెలోని దృఢత్వాన్ని, నాయకత్వ లక్షణాలను బయటికి తెచ్చింది. ఆమెపై 2014లో ‘గులాబ్ గ్యాంగ్’ అనే సినిమా కూడా వచ్చింది! ఆ చిత్రంలో సంపత్ పాల్ దేవి పాత్రను మాధురీ దీక్షిత్ పోషించారు. గ్రీన్ గ్యాంగ్ లీడర్ ఆశాదేవి 2006లో ఓరోజు సంపత్ పాల్ దేవి తన ఇంటి బయట, అత్యంత బాధాకరమైన దృశ్యం చూసింది. ఓ భర్త తన భార్యను గొడ్డును కూడా బాదని విధంగా బాదుతున్నాడు. ‘చచ్చిపోతాను, నన్ను కొట్టొద్దు’ అని ఆ భార్య అతడి కాళ్ల మీద పడి ప్రాధేయపడుతోంది. అయినా ఆమె భర్త కరుణించలేదు. అడ్డుపడిన వాళ్లను సైతం కొట్టబోయాడు. ‘నా భార్య. నా ఇష్టం’ అన్నాడు. ఆ రాత్రి సంపత్ పాల్ దేవి నిద్రపోలేదు. తెల్లవారుజామునే లేచి కొంతమంది మహిళలను సమీకరించుకుంది. అందరి చేతుల్లో కర్రలు! అంతా కలిసి ఆ భర్త ఇంటి మీదికి వెళ్లారు. అతణ్ని బయటికి రప్పించి, దేహశుద్ధి చేశారు. అదీ ఆరంభం. బుందేల్‌ఖండ్ గ్రామంలో గులాబీ రంగుల చీరలు ధరించిన ‘గులాబీ గ్యాంగ్’ ఆవిర్భవించింది. 2010 నాటికి రాష్ట్రవ్యాప్తం, దేశవ్యాప్తం అయింది. ఎక్కడైనా, ఏ ఇంట్లోనైనా స్త్రీపై దౌర్జన్యం, గృహహింస జరుగుతోందని తెలిస్తే గులాబీ గ్యాంగ్ అక్కడ ప్రత్యక్షమౌతోంది. ప్రలోభాలకు లోను కాకూడదన్న కారణంతో ప్రభుత్వ యంత్రాంగం నుంచీ, స్వచ్ఛంద సేవాసంస్థల నుంచి ఎలాంటి ఆసరా కోరకుండా సంపత్ పాల్ దేవీ తన సైన్యాన్ని తనే నిర్మించుకుంది. ‘ప్రతి ఆడపిల్లా చదువుకోవాలి. ప్రతి మహిళా స్వేచ్ఛగా జీవించాలి’. ఇదే సంపత్ పాల్ దేవి ధ్యేయం. గ్రీన్ గ్యాంగ్ కూడా సరిగ్గా గులాబీ గ్యాంగ్ బాటలోనే పయనిస్తోంది. -
‘నిర్భయ’ ప్రేరణతో గులాబి
‘‘ఇటీవల కాలంలో స్త్రీలపై అత్యాచారాలు అధికమైపోయాయి. నిర్భయ సంఘటన తర్వాత ఆడవాళ్లు దుర్గామాతలుగా మారారు. ఆ ప్రేరణతో సందేశాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని మలచడం అభినందనీయం’’ అని మాదాల రవి అన్నారు. గోగిశెట్టి క్రియేషన్స్ పతాకంపై మాదాల కోటేశ్వరరావు స్వీయదర్శకత్వంలో నిర్మిస్తున్న ‘గులాబి’ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి పాటల సీడీని, నిర్మాత యెక్కలి రవీంద్రబాబు ప్రచారం చిత్రాలను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘నిర్భయ సంఘటన తర్వాత నేను, నా మిత్రుడు కలిసి ఎంతో చర్చించి ఈ కథ తయారు చేశాం. చిత్రీకరణ పూర్తయింది. పవన్‌శేష మంచి సంగీతం ఇచ్చారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా బసిరెడ్డి, బాపిరాజు, వైభవ్, యశోకృష్ణ పాల్గొన్నారు.