రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా? | One Rupee Gulabi Dosa At Aswarao Pet On the Eve Of CM KCR Birthday | Sakshi
Sakshi News home page

CM KCR Birthday: రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా?

Published Thu, Feb 17 2022 12:08 PM | Last Updated on Thu, Feb 17 2022 1:00 PM

One Rupee Gulabi Dosa At Aswarao Pet On the Eve Of CM KCR Birthday - Sakshi

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు(ఫిబ్రవరి15) నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు రెండు, మూడు రోజుల ముందు నుంచే వేడుకలు పండుగలా నిర్వహిస్తున్న విషయం తెలిందే. అన్నదానం, రక్తదానం, బట్టలు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్‌ పుట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు.  
చదవండి: చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్​ ఇచ్చారట.. ఇంకేముంది!!

మంత్రి పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే దోశ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ దోశలో ఇంకో స్పెషల్‌ కూడా ఉంది. బీట్‌రూట్‌తో తయారు చేసిన గులాబీ రంగు దోశలను చేయించి ఒక్కో దోశను కేవలం రూపాయికే స్థానికులకు అందజేశారు. దీంతో కొత్త రంగులో ఉన్న దోశలను తినేందుకు ప్రజల ఎగబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement