aswarao pet
-
రూపాయికే గులాబీ దోశ.. ఎక్కడో తెలుసా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు(ఫిబ్రవరి15) నేపథ్యంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రెండు, మూడు రోజుల ముందు నుంచే వేడుకలు పండుగలా నిర్వహిస్తున్న విషయం తెలిందే. అన్నదానం, రక్తదానం, బట్టలు పంపిణీ వంటి పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా సీఎం కేసీఆర్ పుట్టిన సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో టీఆర్ఎస్ కార్యకర్తలు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. చదవండి: చనిపోయిన వ్యక్తికి బూస్టర్ డోస్ ఇచ్చారట.. ఇంకేముంది!! మంత్రి పువ్వాడ యువజన సంఘం ఆధ్వర్యంలో ఒక్క రూపాయికే దోశ కార్యాక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ దోశలో ఇంకో స్పెషల్ కూడా ఉంది. బీట్రూట్తో తయారు చేసిన గులాబీ రంగు దోశలను చేయించి ఒక్కో దోశను కేవలం రూపాయికే స్థానికులకు అందజేశారు. దీంతో కొత్త రంగులో ఉన్న దోశలను తినేందుకు ప్రజల ఎగబడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. -
అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం
భద్రాద్రికొత్తగూడెం: జిల్లాలోని అశ్వరావుపేట పట్టణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెయిన్‌రోడ్డులోని మల్లుగారి కిరాణషాపులో శుక్రవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు సమీపంలోని దుకాణాలకు పాకుతుండటంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లుతోంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి యత్నిస్తున్నారు. -
మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
అశ్వరావుపేట: ఓ మహిళను దారుణంగా హతమార్చిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం మోడల్ కాలనీకి చెందిన మహరున్నిసా(30) అనే మహిళ ఈ నెల 4న దారుణ హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి శనివారం నిందితులను అరెస్ట్ చేశారు. మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్న వ్యక్తే.. ఓ భూవివాదం విషయంలో ఆమెను హత్య చేయించాడని తెలియడంతో.. హత్య చేసిన కిరాయి హంతకుడు మస్తాన్ తో పాటు సహకరించిన గౌసుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. -
అశ్వారావు పేటలో కార్డన్‌సెర్చ్
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పోలీసులు సోమవారం తెల్లవారుజామున కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. సత్తుపల్లి డీఎస్పీ కవిత ఆధ్వర్యంలో సిబ్బంది తెల్లవారుజామున 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఇంటింటిని సోదా చేశారు. ఈ సందర్భంగా పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానికలు , అద్దెకుంటున్న వారి గుర్తింపును తనిఖీ చేశారు. ఎలాంటి గుర్తింపు పత్రాలు లేని 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. -
నకిలీ నోట్ల చలామణి: ఇద్దరి అరెస్ట్
అశ్వారావుపేట: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో శనివారం వెలుగు చూసింది. స్థానిక దుకాణాల్లో రూ.1000 నోట్లను ఇచ్చి కొంత మొత్తంలో మాత్రమే కొనుగోళ్లు చేస్తున్నారని సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగనోట్లను మార్చడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు సమాచారం కోసం నిందితులను విచారిస్తున్నారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఖమ్మం : ఖమ్మం జిల్లా అశ్వారావు పేట మండలం తుమ్మలలో విషాదం చోటు చేసుకుంది. అప్పుల బాదతో పురుగుల మందు తాగి శనివారం ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. తుమ్మలకు చెందిన వీరా స్వామి అనే రైతు సాగు కోసం చేసిన అప్పులు పెరిగిపోవడంతో తీవ్ర మనస్ధాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అశ్వారావు పేటలో భారీ వర్షం
అశ్వారావుపేట : ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో భారీ వర్షం కురిసింది. గురువారం తెల్లవారు జామునుంచి పడిన వర్షానికి మండల పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెదవాగు ప్రాజెక్టు నిండటంతో నీళ్లను కిందకి వదిలారు. అలాగే మండల పరిధిలోని పలు వాగులు పొంగి పొర్లుతున్నాయి. -
అశ్వరావుపేటలో అగ్నిప్రమాదం
ఖమ్మం: ఖమ్మం జిల్లా అశ్వరావుపేటలో శుక్రవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక వడ్డెర బజార్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో నాలుగు పూరిళ్లు ఒక ద్విచక్రవాహనం దగ్ధం అయ్యాయి. పుష్కర ఏర్పాట్ల కోసం ఫైరింజన్లను భద్రాచలం తరలించారు. ఫైరింజన్ అందుబాటులో లేకపోవడంతో నష్టం భారీగా జరిగిందని స్థానికులు అంటున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదంలో జరిగింది. సుమారు రూ. 4 ల క్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. -
అశ్వారావుపేటలో ఉద్రిక్తత
అశ్వారావుపేట: అటవీ శాఖ పరిధిలోని టేకు ప్లాంటేషన్ నరికివేసేందుకు గిరిజనలు యత్నించారు. దీంతో అటవీ అధికారులకు గిరిజనలకు మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటన శనివారం ఉదయం అశ్వారావు పేట మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని రామన్న గూడెం గిరిజనలు తమకు చెందిన లంకపల్లి భూముల్లో అటవీ అధికారుల టేకు ప్లాంటేషన్ చేశారని, వాటిని నరికివేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అటవీ అధికారులు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఖమ్మం : అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందింది. ఈ సంఘటన బుధవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం నారాయణపురం గ్రామంలో జరిగింది. వివరాలు..నారాయణపురం గ్రామానికి చెందిన నల్లపు శైలజ(25) అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతి చెందింది. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (అశ్వారావుపేట) -
అశ్వారావు పేటలో గిరిజనుల ఆందోళన
అశ్వారావుపేట: ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం వినాయకపురం గ్రామం సమీపంలో అటవీ శాఖ అధికారులు, గిరిజనుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇక్కడ అటవీ సరిహద్దు ప్రాంతంలో అధికారులు శుక్రవారం ఉదయం కందకం పనులు చేపట్టారు. అయితే తాము పోడు వ్యవసాయం చేసుకునే భూముల్లో కందకం పనులను నిర్వహించవద్దని గిరిజనులు అడ్డుకున్నారు. అనంతరం వారు ఆందోళన చేపట్టారు. దీంతో అటవీ శాఖ సిబ్బంది పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. -
పార్టీ మారే ఉద్దేశం లేదు..అవన్నీ పుకార్లు
ఖమ్మం : తాను పార్టీ మారటం లేదని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు రాత్రింబవళ్లు శ్రమించి, వ్యయప్రయాసలకోర్చి తనను ఎమ్మెల్యేను చేశారని, వారిని ఎన్నటికీ మోసగించనని ఆయన అన్నారు. బీఫాం ఇచ్చిన పార్టీని, వెన్నుదన్నుగా ప్రోత్సహించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభిమానాన్ని ఏ పార్టీకి తాకట్టు పెట్టే ప్రసక్తే లేదన్నారు. 'తాటి వెంకటేశ్వర్లు పార్టీ మారుతున్నారు' అని వస్తున్న వార్తలపై ఆయన స్పందించారు. వైఎస్ఆర్ సీపీ ఆవిర్భవించినప్పటి నుంచి కొన్ని మీడియా సంస్థల్లో ఇలాంటి వ్యతిరేక వార్తలు వస్తున్నాయని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనపై ఈనెల 18న కుక్కునూరులో టీడీపీ నాయకుల దాడిపై సీఎం కేసీఆర్‌కు వివరించానని, ఆయన స్పందించి పోలీస్ అధికారులతో మాట్లాడారని, రెండ్రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు తాటి వెంకటేశ్వర్లు తెలిపారు. కుక్కునూరు, వేలేరుపాడు మండలాల ప్రజలకు తానే ఎమ్మెల్యేనని ఆయన స్పష్టం చేశారు. -
చెరుకు తోటలో అగ్ని ప్రమాదం
అశ్వారావుపేట రూరల్, న్యూస్‌లైన్: చెరుకు పంట తొలగించిన ఓ తోటలో శనివారం మంటలు వ్యాపించాయి. వీటిని ఆర్పేందుకు వెళ్లిన ఫైరింజన్‌కు మంటలు అంటుకున్నాయి. త్రుటిలో ముప్పు తప్పింది. అశ్వారావుపేట మండలంలోని గంగారం గ్రామానికి సమీపంలో వేముల ప్రకాష్ అనే రైతుకు చెందిన చెరుకు తోటలో ఇటీవల పంటను తొలగించారు. ఈ తోటలో శనివారం సాయంత్రం మంటలు వ్యాపించాయన్న సమాచారంతో అశ్వారావుపేట నుంచి ఫైరింజన్ వెళ్లి మంటలను అదుపు చేస్తోంది. ఇంతలో ఆ మంటలు ఫైరింజన్‌కు అంటుకున్నాయి. ఫైరింజన్ టైర్లతోపాటు ఇంజన్ ప్రదేశంలో మంటలు అంటుకున్నాయి. వాటిని సిబ్బంది అదపులోకి తెచ్చారు. డీజల్ ట్యాంక్ వద్ద కూడా మంటలు చెలరెగడంతో సిబ్బంది ఆందోళన చెందారు. మంటలు అదపులోకి రావడంతో పెను ముప్పు తప్పింది.