అశ్వారావుపేట రూరల్, న్యూస్‌లైన్: చెరుకు పంట తొలగించిన ఓ తోటలో శనివారం మంటలు వ్యాపించాయి. వీటిని ఆర్పేందుకు వెళ్లిన ఫైరింజన్‌కు మంటలు అంటుకున్నాయి. త్రుటిలో ముప్పు తప్పింది. అశ్వారావుపేట మండలంలోని గంగారం గ్రామానికి సమీపంలో వేముల ప్రకాష్ అనే రైతుకు చెందిన చెరుకు తోటలో ఇటీవల పంటను తొలగించారు. ఈ తోటలో శనివారం సాయంత్రం మంటలు వ్యాపించాయన్న సమాచారంతో అశ్వారావుపేట నుంచి ఫైరింజన్ వెళ్లి మంటలను అదుపు చేస్తోంది.
ఇంతలో ఆ మంటలు ఫైరింజన్‌కు అంటుకున్నాయి. ఫైరింజన్ టైర్లతోపాటు ఇంజన్ ప్రదేశంలో మంటలు అంటుకున్నాయి. వాటిని సిబ్బంది అదపులోకి తెచ్చారు. డీజల్ ట్యాంక్ వద్ద కూడా మంటలు చెలరెగడంతో సిబ్బంది ఆందోళన చెందారు. మంటలు అదపులోకి రావడంతో పెను ముప్పు తప్పింది.
చెరుకు తోటలో అగ్ని ప్రమాదం
Published Sun, Feb 9 2014 3:38 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement