సినిమా రివ్యూ: గోవిందుడు అందరివాడేలే
సినిమా రివ్యూ: గోవిందుడు అందరివాడేలే
Published Wed, Oct 1 2014 1:23 PM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM
నటీనటులు: రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, జయసుధ, కమిలిని ముఖర్జీ, రావు రమేశ్, కోట శ్రీనివాసరావు
సంగీతం: యువన్ శంకర్ రాజా
కెమెరా: సమీర్ రెడ్డి
నిర్మాత: బండ్ల గణేష్
దర్శకత్వం: కృష్ణవంశీ
వరుస విజయాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్, సరియైన సక్సెస్ కోసం చూస్తున్న దర్శకుడు కృష్ణవంశీ కాంబినేషన్ రూపొందిన 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం అక్టోబర్ 1 తేదిన (బుధవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ ఖాతాలో మరో హిట్ చేరిందా?, క్రియేటివ్ డైరెక్టర్ గా కృష్ణవంశీకి ఈ చిత్రం గత వైభావాన్ని తీసుకువచ్చిందా అనే తెలుసుకోవాలంటే కథేంటో తెలుసుకుందాం!
ఊరు బాగుండాలని కోరుకునే బాలరాజు(ప్రకాశ్ రాజ్)కు చంద్రశేఖర్ (రహమాన్) బంగారం(శ్రీకాంత్) ఇద్దరు కొడుకులుంటారు. తన పెద్ద కుమారుడ్ని వైద్యుడిని చేసి తాను కట్టించే ఆస్పత్రి ద్వారా గ్రామానికి సేవలందించాలని బాలరాజు కోరుకుంటారు. అయితే ఊహించని విధంగా పెద్ద కుమారుడు తన కోరికను తిరస్కరిస్కరించడంతో బాలరాజు షాక్ గురువుతాడు. దాంతో బాలరాజు, చంద్రశేఖర్ లు విడిపోతారు. తండ్రికి దూరమై విదేశాల్లో స్థిరపడిన చంద్రశేఖర్ కి అభిరామ్(రామ్ చరణ్), ఓ కూతరు ఉంటుంది. విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన చంద్రశేఖర్ ఓ కారణంతో కుటుంబానికి దూరమయ్యాని చింతిస్తాడు. తండ్రి బాధను తెలుసుకున్న అభిరామ్ తన తాత బాలరాజు వద్దకు చేరుకుని ఏం చేశాడు? కుటుంబాన్ని కలుపడానికి చేసిన ప్రయత్నంలో ఎలాంటి సమస్యుల ఎదురయ్యాయి? సమస్యల్ని ఎలా అధిగమించాడు. తండ్రిని, తాతను, కుటుంబాన్ని కలుపడానికి అభిరామ్ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయా? ఈ క్రమంలో తన మరదలు సత్య(కాజల్) ప్రేమను ఎలా దక్కించుకున్నారనే ప్రశ్నలకు సమాధానమే 'గోవిందుడు అందరివాడేలే'
ప్లస్ పాయింట్స్:
రామ్ చరణ్, కాజల్ కెమిస్ట్రీ
ప్రకాశ్ రాజ్ ఫెర్ఫార్మెన్స్
ఫోటోగ్రఫి
కృష్ణవంశీ డైరెక్షన్
మైనస్ పాయింట్స్:
సంగీతం
రొటీన్ కథ,
క్లైమాక్స్
మాస్, యాక్షన్ చిత్రాల విజయాలతో జోరు మీదున్న రాంచరణ్ ఈ చిత్రంలో కుటుంబాన్ని కలిపే మనవడి పాత్రను పోషించాడు. రామ్ చరణ్ ఇమేజ్ తగినట్టుగా సాంగ్స్, ఫైట్స్ తో అదనంగా భావోద్వేగాలను పలికించే అభిరామ్ పాత్రను పోషించాడు. దసరా పండగ పురస్కరించుకుని వచ్చిన ఈ చిత్రంలో అభిమానుల్ని మెప్పించడానికి అభిరామ్ గా రామ్ చరణ్ చేసిన ప్రయత్నం సఫలమైందనే చెప్పవచ్చు.
మరదలిగా 'సత్య' పాత్రలో కనిపించిన కాజల్, రామ్ చరణ్ ల మధ్య కెమిస్ట్రీ పడింది. రామ్ చరణ్ తో రొమాంటిక్ సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. పాటలకే పరిమితం కాకుండా, శృంగార సన్నివేశాల్లో కాజల్ కొంత అడ్వాన్స్ అయిందనే చెప్పాలి. కొన్ని సన్నివేశాల్లో కూడా కాజల్ తన వంతుగా ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకోవడానికి ప్రయత్నించింది.
ఇక ఈ చిత్రంలో బంగారం పాత్రలో శ్రీకాంత్ కొంత నెగిటివ్ షేడ్ ఉన్న కారెక్టర్ ను పోషించాడు. బాధ్యత తెలియని కుమారుడిగా జూదం, మద్యానికి బానిసైన వ్యక్తిగా తన మార్కును ప్రదర్శించాడు. ఇక కమిలిని ముఖర్జి, జయసుధ తమ పాత్రల పరిధిమేరకు పర్వాలేదనిపించారు.
బాలరాజు పాత్రలో ప్రకాశ్ రాజ్ మరోసారి విజృంభించాడు. కుటుంబ పెద్దగా, ఊరి పెద్దగా అందరి బాగు కోసం తపన పడే పాత్రలో జీవించాడు. ఈ చిత్ర భారాన్నంత తన నటనతో ప్రకాశ్ రాజ్ భుజాన వేసుకున్నారని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. మరోసారి ప్రకాశ్ రాజ్ ఈచిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఈ సినిమాలో అప్పుడప్పుడు వచ్చే విలన్ పాత్రల్లో రావు రమేశ్, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళిలు తమ పాత్రల పరిధిమేరకు ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే కథలో పెద్దగా స్కోప్ లేకపోవడంతో వారు చేయాల్సింది ఏమిలేకపోయింది.
సాంకేతిక నిపుణుల పనితీరు:
జోర్డాన్ తో ఇతర అందమైన లోకేషన్లను తెరకెక్కించడంలో సినిమాటోగ్రాఫర్ గా సమీర్ రెడ్డి రాణించారు. ఈ చిత్రంలో భారీ సంఖ్యలో ఉన్న ఆర్టిస్టుల మూడ్ ను ఫ్రేమ్ లో బంధించడంలో సమీర్ సక్సెస్ అయ్యారు. ఈ చిత్ర ఆడియోలో ఆకట్టుకోలేకపోయిన పాటల్ని తెరపైన చిత్రీకరించడంలో సమీర్ తన పనితనాన్ని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. బండ్ల గణేష్ నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
యువన్ శంకర్ రాజ్ మ్యూజిక్:
ఆడియోలో పాటలు అంతగా ఆకట్టుకోలేకపోయినా.. ఈ చిత్రంలో సిట్వువేషనల్ గా వచ్చే పాటలు తెరపై ఆలరించాయి. పాటలు అంతగా క్యాచీగా లేకపోవడం కొంత ప్రేక్షకుల్ని నిరుత్సహపరిచే అంశమని చెప్పవచ్చు. నీలిరంగు చీరలోన, బావగారి చూపే పాటలు సందర్భోచితంగా బాగున్నాయి. రాంచరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ అభిమానులను ఉత్సాహపరిచేవిధంగా తెరకెక్కించారు.
కృష్ణవంశీ దర్శకత్వం:
చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులను నిరాశపరుస్తున్న కృష్ణవంశీ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో కూడా తన మార్కును వదలకుండా... ఎలాంటి ప్రయోగాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అనిపిస్తుంది. సీతారామయ్య మనవరాలు, కలిసుందారాం చిత్ర కథలను దాదాపు పోలివుండే 'గోవిందుడు అందరివాడేలే' తన స్టైల్లో మురారీ, నిన్నే పెళ్లాడుతా లాంటి చిత్రాల శైలిలో ఈ చిత్రాన్ని రూపొందించారు. కృష్ణవంశీ స్టైల్ భావోద్వేగాలు, కుటుంబ సంబంధాలు, విభేదాలు, మనస్పర్ధలు లాంటి అంశాలతో తెరపై మరోసారి తెలుగుదనం ఉట్టిపడేలా రూపొందించడంలో కృష్ణవంశీ సఫలమయ్యారు.
ముగింపు:
దసరా పండగ రేసులో విడుదలైన 'గోవిందుడు అందరివాడేలే' సూపర్, డూపర్ హిట్ అనే టాక్ బయటికి చెప్పలేకపోయినా.. తొలి ఆటనుంచే పాజిటివ్ టాక్ ని సంపాదించుకుంది. అయితే పాత చిత్రాల కథకే మళ్లీ కొత్త రంగులద్దారనే విమర్శలు ఓ వైపు ఉన్నా.. సెలవు దినాల్లో అభిమానులు, ప్రేక్షకులకు పైసా వసూలు చేసే చిత్రంగా 'గోవిందుడ్ని తీర్చి దిద్దారు.
-రాజబాబు అనుముల
Advertisement
Advertisement