Director Krishna Vamsi Interesting Comments On Prakash Raj: ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ప్రకాశ్ రాజ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనను రాక్షసుడు అని పిలిచి ఆశ్చర్యపరిచారు. కాగా కృష్ణవంశీ చాలా గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా రంగమార్తాండ. 'నట సామ్రాట్' అనే మరాఠీ సినిమాకి ఇది రీమేక్. విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలో ఈ మూవీ రూపొందుతోంది. కాగా ఇప్పటికే షూటింగ్ ప్రారంభించిన ఈ చిత్రం చివరి షెడ్యూల్ చేరుకుంది. ఈ నేపథ్యంలో కరోనా కారణంగా వాయిదా పడిన ఈ మూవీ తాజాగా తిరిగి సెట్స్‌పైకి వచ్చింది.
చదవండి: భార్యకు కరోనా, అయినా ఆమె బర్త్‌డే సెలబ్రేట్ చేసిన నితిన్..
దీంతో ప్రకాశ్ రాజ్‌కు సంబంధించిన ఎమోషనల్ క్లైమాక్స్ సీన్స్‌తో పాటు పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు కృష్ణవంశీ ట్వీటర్‌లో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘చివరి దశకు చేరుకున్న రంగమార్తాండ. నేను అత్యంత అభిమానించే నటుడు.. నటరాక్షసుడు ప్రకాశ్ రాజ్‌తో భావోద్వేగభరితమైన క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్న.. స్టన్నింగ్’ అంటూ రాసుకొచ్చారు. కాగా ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్, రాజశేఖర్ రెండో కుమార్తె శివాత్మిక కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.
చదవండి: కరోనా ఎఫెక్ట్.. మరో భారీ బడ్జెట్ చిత్రం వాయిదా
Started the final ANKAM of RANGAMARTHANDA..... Shooting a most emotional climax with my most fav actor NATARAKSHSA prakashraj ... Stunning 💕💕💕💕. pic.twitter.com/n9PRnR5sEH
— Krishna Vamsi (@director_kv) January 6, 2022
Comments
Please login to add a commentAdd a comment