
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'రంగమర్తాండ'. దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తర్వాత డిఫరెంట్ కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబందించిన విశేషాలతో పాటు మ్యారేజ్ లైఫ్‌పై వస్తోన్న రూమర్స్‌పైనా స్పందించారు.
గత కొన్నాళ్లుగా కృష్ణవంశీ- నటి రమ్యకృష్ణ విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృష్ణవంశీ ఈ వార్తలపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. 'బాధ్యతలంటే భయంతో అసలు పెళ్లే వద్దునుకున్నా. కానీ చివరకు రమ్యకృష్ణతో వివాహం జరిగింది. ఇదంతా లైఫ్ డిజైన్ అని భావిస్తాను.
పెళ్లి తర్వాత నా జీవితంలో పెద్దగా మార్పులు రాలేదు. రమ్యకృష్ణ నన్ను నన్నులా ఉండనిచ్చింది. ఇక ఆమెతో విడాకులు అంటారా? ఇందులో నిజం లేదు. పబ్లిక్ ఫిగర్స్‌గా ఉన్నప్పుడు ఇలాంటి పుకార్లు వస్తుంటాయి. కానీ మేం పెద్దగా పట్టించుకోం. అందుకే ఖండించాలని కూడా అనుకోము. జస్ట్ నవ్వి ఊరుకుంటాం' అంతే అంటూ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment