Director Krishna Vamsi Interesting Comments On His Wife Ramya Krishna, Deets Inside - Sakshi
Sakshi News home page

Krishna Vamsi: రమ్యకృష్ణపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేసిన కృష్ణవంశీ

Published Mon, Aug 29 2022 12:44 PM | Last Updated on Tue, Aug 30 2022 8:26 AM

Director Krishna Vamsi Intresting Comments About Ramya Krishnan - Sakshi

టాలీవుడ్‌లో క్రియేటివ్‌ డైరెక్టర్‌గా కృష్ణవంశీకి పేరుంది. గులాబీ, సింధూరం, ఖ‌డ్గం, అంతఃపురం వంటి సినిమాలతో ఇండస్ట్రీకి హిట్స్‌ ఇచ్చిన కృష్ణవంశీ తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా 'రంగమర్తాండ'. నక్షత్రం సినమా తర్వాత దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత డిఫరెంట్ కాన్సెఫ్ట్‌తో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు కృష్ణవంశీ. ఈ సినిమాలో రమ్యకృష్ణ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదలకు సిద్ధం కానుంది.

ఈ నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న ఆయన సినిమాకు సంబంధించిన విశేషాలతో పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు కూడా షేర్‌ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'ర‌మ్య‌కృష్ణ రేంజ్‌ని మ్యాచ్ చేయాల‌నే టెన్ష‌న్ నాకు ఉంటుంది. నాకు ఆమెతో కాంపిటిష‌న్ ఉంటుంది. కొడుకుతో కలిసి రమ్యకృష్ణ చెన్నైలో ఉంటోంది. నేనేమో హైదరాబాద్‌లో ఉంటున్నా. ఎప్పుడూ ఖాళీ దొరికినా నేను అక్కడికి వెళ్తుంటా. లేదా వాళ్లే నా దగ్గరికి వస్తుంటారు.

ఇక మా అబ్బాయి రిత్విక్‌ చాలా యాక్టివ్‌. ఎంతైనా క్రాస్‌బ్రీడ్‌ కదా అంటూ చెప్పుకొచ్చాడు. ఇక రమ్యకృష్ణ, మీరు వేరేవేరుగా ఉంటే పుకార్లు వస్తుంటాయి కదా అని అడగ్గా.. అలాంటివి తాము పట్టించుకోమని, ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్‌ కామన్‌' అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా అందరికీ గాసిప్స్‌ అంటేనే ఇంట్రెస్ట్‌ కదా అంటూ సమాధానమిచ్చారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement