టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న కృతి సనన్‌ చెల్లెలు | Kriti Sanon Sister Nupur Sanon Tollywood Debut With Tiger Nageswara Rao Movie | Sakshi
Sakshi News home page

Nupur Sanon: టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్న కృతి సనన్‌ చెల్లెలు

Mar 31 2022 8:51 PM | Updated on Apr 1 2022 1:30 PM

Kriti Sanon Sister Nupur Sanon Tollywood Debut With Tiger Nageswara Rao Movie - Sakshi

మహేశ్‌ బాబు ‘వన్‌ నేనొక్కడే’ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కృతి సనన్‌. తొలి సినిమాతో టాలీవుడ్‌ బై చెప్పి బాలీవుడ్‌కు వెళ్లిపోయింది. అక్కడ స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొంది వరస ఆఫర్స్‌ బిజీగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమె చెల్లి నుపుర్‌ సనన్‌ టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమైంది. రవీతేజ తదుపరి చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు సినిమాలో నుపుర్‌ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తాజాగా మూవీ మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. కాగా దర్శకుడు కృష్ణవంశీ పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో మాస్‌ మహారాజ రవితేజతో నుపుర్‌ జోడి కట్టనుంది.

చదవండి: తెలుగు సినిమాలు ఎందుకు చేస్తున్నావ్‌ అంటు‍న్నారు: తాప్సీ

ఇదిలా ఉంటే మాస్‌ మహారాజ రవితేజ వరస హిట్స్‌, ప్లాప్స్‌తో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఇటీవల ఆయన నటించిన ఖీలాడి మూవీ రిలీజై బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయం పొందింది. ఇదిలా ఉంటే త్వరలోనే రామారావు ఆన్‌ డ్యూట్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు ధమాకా, రావణాసుర సినిమాలు షూటింగ్‌ను జరుపుకుంటున్నాయి. ఇవి ఉండగానే రవితేజ పాన్‌ ఇండిచా చిత్రం టైగర్‌ నాగేశ్వరరావు పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్ 2వ తేదీన లాంచ్ చేయనున్నట్టుగా ఇటీవల చిత్రం బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. 

చదవండి: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’పై కేఏ పాల్‌ అనుచిత వ్యాఖ్యలు, ఆర్జీవీ కౌంటర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement