Ramya Krishnan Interesting Comments About Rangamarthanda Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Rangamarthanda Movie Award: ఎందుకు ఈ సినిమా.. ఎవరు చూస్తారని అడిగా : రమ్యకృష్ణ

Published Tue, Mar 21 2023 11:57 AM | Last Updated on Tue, Mar 21 2023 12:43 PM

Ramya Krishnan Talks About Rangamarthanda Movie - Sakshi

టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్‌ కృష్ణవంశీ తెరకెక్కించిన తాజా చిత్రం ‘రంగమార్తాండ’. మరాఠీలో సూపర్ హిట్ అయిన నటసామ్రాట్ చిత్రానికి తెలుగు రీమేక్‌ ఇది. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఉగాది సందర్భంగా మార్చి 22న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా రమ్యకృష్ణ ఓ యూట్యూబ్‌ చానల్‌తో మాట్లాడుతూ.. సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

‘సినిమా ప్రారంభానికి ముందు ‘అసలు ఇలాంటి చిత్రాలను ఇప్పుడు ఎవరు చూస్తారు?’ అని కృష్ణవంశీని అడిగాను. కానీ ఆయన మొండి కదా.. వినిపించుకోకుండా షూటింగ్‌ని ప్రారంభించారు. ఇందులో నేను పోషించిన పాత్ర కోసం మొదటగా చాలా మంది హీరోయిన్లను సంప్రదించారు. ఎవరూ ఎంపికకాకపోవడంతో..చివరకు నేను ఆ పాత్ర చేస్తానని ముందుకొచ్చా. కళ్లతోనే నటించాలని చెప్పారు. అలానే నటించాను. నా పాత్ర నిడివి అంత ఉంటుందని ఊహించలేదు.  ఎమోషనల్‌ సినిమాలు నాకు అంతగా నచ్చవు. కానీ ఈ సినిమా షూటింగ్‌ చేస్తుండగానే.. భావోద్వేగానికి లోనయ్యాం. ప్రతి సీన్‌ హృదయాలను హత్తుకునేలా తిశాడు. వంశీ  కెరీర్‌లో ఇదొక బెస్ట్‌ మూవీగా నిలుస్తుంది’ అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement