వెంకటేష్, రామ్‌చరణ్‌లతో కృష్ణవంశీ సినిమా?
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ పుణ్యమా అని నిదానంగా టాలీవుడ్‌లో కూడా మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుంటోంది. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ప్రస్తుతం ‘మనం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు వెంకటేష్, రామ్ కలిసి ‘మసాలా’ నూరే పనిలో ఉన్నారు.
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ పుణ్యమా అని నిదానంగా టాలీవుడ్‌లో కూడా మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుంటోంది. అక్కినేని ఫ్యామిలీ అంతా కలిసి ప్రస్తుతం ‘మనం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మరో వైపు వెంకటేష్, రామ్ కలిసి ‘మసాలా’ నూరే పనిలో ఉన్నారు. ఓ విధంగా ఈ ట్రెండ్‌ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో వెంకటేష్ అందరికంటే ముందున్నారని చెప్పాలి.
త్వరలో వెంకటేష్... రామ్‌చరణ్‌తో కూడా కలిసి నటించనున్నారని విశ్వసనీయ సమాచారం. ఈ చిత్రానికి కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తారని, బండ్ల గణేష్ నిర్మాత అని ఫిలింనగర్ సమాచారమ్. ఇందులో చరణ్‌కి బాబాయ్‌గా వెంకటేష్ నటిస్తారని వినికిడి. ఇందులో కీలకమైన పాత్రను సూపర్‌స్టార్ కృష్ణతో చేయించాలనుకున్నారని, అయితే కృష్ణ నటనకు స్వస్తి పలికి విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మరో సీనియర్ నటుణ్ణి ఎంపిక చేసే ప్రయత్నంలో ఉన్నారని సమాచారం.
అలాగే ఇందులో మరో పాత్రను నాగబాబుతో చేయించాలను కుంటున్నారు. మూడు తరాలకు సంబంధించిన కథగా కృష్ణవంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని వినికిడి. గతంలో అక్కినేని ఫ్యామిలీతో ‘త్రయం’ పేరుతో ఓ చిత్రం చేయాలనుకున్నారు కృష్ణవంశీ. కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదు. మరి ఇది ఆ కథేనా? లేక వేరే కథా అనేది తెలుసుకోవాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.