
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఏప్రిల్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాలోని 'ఏంటమ్మ.. ఏంటమ్మ..' అంటూ సాగే పాటను విడుదల చేశారు మేకర్స్. అయితే ఈ సినిమా గ్లోబల్ స్టార్ చెర్రీ కూడా కనిపించడం ఆడియన్స్‌లో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది.
సాధారణంగా లుంగీ డ్యాన్స్ అంటే ప్రేక్షకులకు 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సినిమానే గుర్తుకొస్తుంది. అందులో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణే స్టెప్పులే గుర్తుకొస్తాయి. అయితే ఈ సాంగ్‌తో ఓ నయా ట్రెండ్ సెట్ చేశారు కిసీకా భాయి కిసీకీ జాన్ టీమ్. ఇందులో రామ్ చరణ్ స్పెషల్ పాటకు స్టెప్పులు వేయడం హైలెట్‌గా నిలిచిందని అభిమానులు సంబరాలు చేసుకంటున్నారు. ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ అందించారు.
(ఇది చదవండి: సల్మాన్ ఖాన్ సినిమాలో 'బతుకమ్మ' పాట.. క్షణాల్లోనే వైరల్)
ఆ సాంగ్‌లో రామ్ చరణ్, సల్లు భాయ్, వెంకటేశ్ కలిసి స్టెప్పులతో అదరగొట్టారు. ఈ పాటకు డ్యాన్స్ చేయటం పట్ల రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశారు. ఇద్దరు లెజెండ్స్ కలిసి డ్యాన్స్ చేయడం నా లైఫ్‌లో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోతుందంటూ చెర్రీ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. ముగ్గురు హీరోలు ఓకే పాటలో కనిపించడంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తి పెరిగింది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఓ పాట ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తుంది. ఈ చిత్రంలో తెలంగాణ సంస్కృతిని అద్దం పట్టేలా బతుకమ్మ సాంగ్‌ను కూడా చిత్రీకరించారు. 'ముంగిట్లో ముగ్గేసి గొబ్బిల్లే పెడదామా...గడపకు బొట్టేట్టి తోరణాలు కట్టేద్దామా' అంటూ హిందీ చిత్రంలో తెలుగు పాట రావడం తెలుగు ప్రేక్షకులనే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
One of my most precious on screen moments.
— Ram Charan (@AlwaysRamCharan) April 4, 2023
Love you Bhai ❤️
Dancing with these absolute legends... #Yentamma song out now.https://t.co/9gSJhidu0y@BeingSalmanKhan @hegdepooja @VenkyMama @farhad_samji @VishalDadlani @iPayalDev @raftaarmusic @Musicshabbir @AlwaysJani pic.twitter.com/raRa2zl8Zy