తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగతో చిత్ర పరిశ్రమకు ప్రత్యేక అనుబంధం ఉంది. సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు స్టార్ హీరోలు సైతం పోటీపడుతుంటారు. ఈ సంక్రాంతికి రామ్‌చరణ్ ‘గేమ్ చేంజర్’, బాలకృష్ణ ‘డాకు మహారాజ్’, వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బిగ్ ప్రాజెక్ట్స్ ప్రేక్షకుల ముందుకు వచ్చి అలరిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. సంక్రాంతి పండుగని పురస్కరించుకుని తమ సినిమాల నుంచి ప్రత్యేక పోస్టర్స్, లుక్స్‌ని విడుదల చేశారు పలువురు మేకర్స్. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం...
రాజా సాబ్ ఆగయా
ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్‌లో రూపొందుతోన్న ‘రాజా సాబ్’ నుంచి ప్రభాస్ సరికొత్త పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పండుగ కళ కనిపిస్తున్న ఈ పోస్టర్‌లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. షూటింగ్ తుదిదశలో ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
అందమైన లైలా
హీరో విశ్వక్ సేన్ లైలాగా మారారు. ఆయన అబ్బాయిగా, అమ్మాయిగా నటించిన చిత్రం ‘లైలా’. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆకాంక్షా శర్మ హీరోయిన్. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించిన ఈ మూవీలో తొలిసారి లైలా అనే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు విశ్వక్ సేన్. ఈ సినిమా నుంచి లైలాగా విశ్వక్ సేన్ లుక్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్.
జాస్మిన్ వచ్చేశారు
‘బబుల్ గమ్’ మూవీ ఫేమ్ రోషన్ కనకాల హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’. ‘కలర్ ఫోటో’ మూవీతో జాతీయ అవార్డు అందుకున్న సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వ ప్రసాద్ , టీజీ కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సాక్షి సాగర్ మదోల్కర్ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె జాస్మిన్ పాత్రలో నటిస్తున్నట్లు పేర్కొని, పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్.
సంతానప్రాప్తిరస్తు
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’. సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో మధుర ఎంటర్‌టైన్‌మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్‌పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమా నుంచి విక్రాంత్, చాందినిల స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది యూనిట్. ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment